Adsense

Tuesday, August 10, 2021

హిందూ ధర్మం: వ్యక్తి యొక్క నాలుగు జీవిత దశలు:



1.  బ్రహ్మచర్యం(25 సంవత్సరములవరకు) : విద్యార్థిగా తయారయ్యే జీవితం. విద్యార్థి బ్రహ్మచారిగా ఉంటూ,      స్త్రీ,పురుషులు ఒకరికొకరు ఏకాంతంగా మాట్లాడుకోకుండా, ఏకాంతంగా కలుసుకోకుండా, వేదాధ్యయనము, గురు శుశ్రూష, ఇంద్రియ నిగ్రహము, లౌకిక విజ్ఞానం, పెద్దలయందు గౌరవము ప్రధాన ధర్మములు.

2.  గృహస్థం (26 - 58 సంవత్సరములు): గృహస్థునకు కుటుంబం,సమాజంలో కల్సిబ్రతుకుట,ఏకపత్నీ వ్రతము, పరస్త్రీని తల్లితో సమానంగా చూడటం, ధర్మ సంతానము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, దేవఋణం, పితృఋణం తీర్చుకొనుట, ఆచార నిర్వహణము,ఆనాథులయందు  ఆదరణ,బీదలకు సహకారము ప్రధానములు 

3.  వానప్రస్థ జీవితం(59 - 65 సంవత్సరములు) :  ప్రాపంచిక వృత్తులను త్యజించడం. ధర్మ వ్యవహారబద్ధుడై వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మలయందు స్వార్ధమును వీడి, సంతానమునకు వ్యవహార మప్పగించి, ధర్మపత్నితో శాఖాహారం తీసుకొని తపమాచరించడం ప్రధానములు.

4.  సన్యాసం(66 -చివరి రోజు వరకు):- వైర్యాగ్యము కలిగి ధర్మపత్నిని సంతానమున కప్పగించి కామక్రోధాదులను జయించి శేషజీవితమును లోకొద్ధరణకై  ధర్మ ప్రబోధక లక్ష్యముతో అన్నీవదులుకొని ఉండడం యుక్తము.

No comments: