Adsense

Tuesday, August 10, 2021

ఇండియన్ రైల్వేస్ రైలు కూతలు 11 రకాలు... ఒక్కో హారన్‌కు ఒక్కో అర్థం... ఏంటో తెలుసుకోండి


 రైలు హారన్ శబ్దం చాలా దూరం వినిపిస్తుంది. ఒకట్రెండు కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వినిపిస్తుంది. రైల్వే గార్డుల్ని, రైల్వే సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు, హెచ్చరించేందుకు హారన్ ఉపయోస్తుంటారు. రైలు స్టేషన్‌లోకి వచ్చేప్పుడు, స్టేషన్ నుంచి వెళ్లేప్పుడు హారన్ రైలు కూత తప్పనిసరిగా వినిపిస్తుంది. రైలు స్టేషన్‌లోకి వస్తోందని, స్టేషన్ నుంచి వెళ్తోందని చెప్పడానికి మాత్రమే కాదు... రైల్వే సిబ్బందికి, రైల్వే గార్డులకు కొన్ని సూచనలు చేసేందుకు హారన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలా రైలు 11 రకాల కూతల్ని వినిపిస్తుంది. మరి ఒక్కో హారన్‌కు అర్థమేంటో తెలుసుకోండి.

ఒక చిన్న హారన్: లోకో పైలట్ ఒక చిన్న హారన్ సౌండ్ చేస్తే రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తీసుకెళ్తున్నట్టు అర్థం.
 అంటే తదుపరి ప్రయాణానికి రైలు సిద్ధం కావడానికి వెళ్తుందన్నమాట.
 రెండు చిన్న హారన్‌లు: రెండు చిన్న హారన్‌ల శబ్దం వినిపిస్తే రైలు బయల్దేరడానికి సిగ్నల్ ఇవ్వాల్సిందిగా గార్డ్‌ను లోకోపైలట్ కోరుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

మూడు చిన్న హారన్‌లు: మూడు చిన్న హారన్‌ల శబ్దం వినిపిస్తే మోటార్ పైన తన కంట్రోల్ పోయిందని, వ్యాక్యూమ్ బ్రేక్ వేయాలని గార్డుకు లోకోపైలట్ సమాచారం ఇస్తున్నట్టు. సాధారణంగా ఇలాంటి హారన్ చాలా తక్కువగా వినిపిస్తుంది.

నాలుగు చిన్న హారన్‌లు: రైలులో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే లోకోపైలట్ నాలుగు సార్లు చిన్న హారన్‌లు మోగిస్తారు. అంటే రైలు ముందుకు కదలడానికి సిద్ధంగా లేదని అర్థం.

నిరంతరాయంగా వినిపించే హారన్: ఏదైనా రైల్వే స్టేషన్‌లో హాల్ట్ లేనప్పుడు రైలు ఆగకుండా వెళ్తుందని ప్రయాణికులను అలర్ట్ చేసేందుకు లోకోపైలట్ నిరంతరాయంగా హారన్ మోగిస్తారు. నాన్‌స్టాప్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు వచ్చినప్పుడు ఈ హారన్ వినొచ్చు.
 ఒక లాంగ్, ఒక షార్ట్ హారన్: రైలు ఇంజిన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు బ్రేక్ పైప్ సిస్టమ్ సెట్ చేయాలని గార్డుకు సిగ్నల్ ఇచ్చేందుకు లోకోపైలట్ ఒక లాంగ్, ఒక షార్ట్ హారన్ ఇస్తారు.

రెండు లాంగ్, రెండు షార్ట్ హారన్‌లు: రైలు ఇంజిన్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవాలని గార్డుకు సూచిస్తూ లోకోపైలట్ రెండు లాంగ్, రెండు షార్ట్ హారన్‌లు ఇస్తారు.

రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్‌లు: రైలు రైల్వే క్రాసింగ్ దాటే సమయంలో అటు వైపుగా వెళ్తున్నవారిని అప్రమత్తం చేసేందుకు లోకోపైలట్ రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్‌లు మోగిస్తారు.

రెండు లాంగ్ అండ్ షార్ట్ హారన్‌లు: రైలు ట్రాక్ మారేప్పుడు లోకో పైలట్ రెండు లాంగ్ అండ్ షార్ట్ హారన్‌లు మోగిస్తారు.

రెండు షార్ట్, ఒక లాంగ్ హారన్: రైల్వే ప్యాసింజర్ చైను లాగినా, గార్డ్ వ్యాక్యూమ్ బ్రేక్ లాగినా లోకోపైలట్ రెండు షార్ట్, ఒక లాంగ్ హారన్ మోగిస్తారు.

ఆరు సార్లు షార్ట్ హారన్‌లు: రైలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకోపైలట్ ఆరు సార్లు షార్ట్ హారన్‌లు మోగిస్తారు.                                #Source:

సేకరణ : from velamuri Sri Vishnu

No comments: