Adsense

Wednesday, September 22, 2021

ఈరోజు విదియ తిథి ప్రదోష కాలవ్యాప్తి ఉండటం వలన ఈరోజు *ఆశూన్య శయన వ్రతం




 నారదపురాణం ప్రకారం,చాతుర్మాస్య దీక్ష సమయంలొ,విష్ణుమూర్తి లక్ష్మీదేవి పాలకడలి పై శేష తల్పముపై విశ్రాంతి తీసుకుంటారని కథనం. ఈరోజు దంపతులు పగటి పూట ఉపవాసం ఉండి,రాత్రి పూట పండ్లు పాలు మాత్రమే తీసుకుంటారు. పగటి పూట క్షీర సాగరంలో శేషతల్పం పై  పవళించిన విష్ణుమూర్తి, పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవి చిత్రపఠానికి గానీ,ప్రతిమకు కానీ షోడశోపచారాలతో పూజ చేసి,రాత్రిపూట ఆది దంపతులకి శయనోత్సవం నిర్వహించి,మరుసటి రోజు దంపతులు శాస్త్రోక్తంగా వేద పండితులకు వస్త్రాలు, పండ్లుతో పాటు గా  పరుపుకానీ,చాప గానీ, దిండుగానీ,దుప్పటి కానీ దానం చేస్తారు. ఇలా చేయడం వలన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనీ,వైవాహిక దాంపత్య జీవితం మెరుగు పడుతుంది అని నమ్మకం.

ఈరోజు పితృపక్షాలలో భాగంగా *ద్వితీయ శ్రాద్ధం*. ఏమాసంలో అయినా శుక్ల పక్ష విదియ కానీ బహుళ పక్ష విదియ తిథి రోజున కానీ మరణించిన కుటుంబ సభ్యులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తిండానికి అనుకూలం. ద్వితీయ శ్రాద్దాన్ని *దూజ్ శ్రాద్ధ* అని కూడా పిలుస్తారు.

ఈరోజు సాయన రవి తులా రాశి లోకి రాత్రి 12.51 కి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి *తులాయాణం* మొదలు అవుతుంది. పితృ తర్పణాలు ఇవ్వడానికి అనుకూలించే *విషువత్పుణ్య కాలం* రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12.08 వరకూ ఉంటుంది.

నారాయణ స్మరణం తో..... సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.

No comments: