Adsense

Wednesday, September 22, 2021

రేపు ఉండ్రాళ్ళ తద్దె




భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గతులు పొందడానికి నిమిత్తం ఉండ్రాళ్ళ తద్దె నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహించుకుంటారు .

 ఈ నోముకు మోదక తృతీయ అనికూడా పెరు. ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడం తో తద్దె అనే మాట మూడవ రోజు తదియ అనే అర్థం తో ఉపయోగించబడింది అందుకీ ఉండ్రాళ్ళ తద్దె గ పిలవబడుతుంది . 

ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తదియ. ఇది రెండ్రోజుల పండుగ . 

భాద్రపద లో పౌర్ణమి వెళ్ళిన మూడవ రోజున బహుళ తదియ నాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వికులు నిర్ణయించారు . ఈ వ్రతం గురుంచి సాక్షాత్తు పరమ శివుడు పార్వతి దేవికి వివరించాడు అని పురాణాలూ చెబుతున్నాయి . 


ఐదుగురు ముత్తైదువులకి గోరంటాకు ముద్ద ,పసుపు కుంకుమలు ,కుంకుడు కాయలు ,నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటాని కి రండి అని ఆహ్వానించాలి.
 
భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి ,సాయంత్రం వారకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం ఉండాలి . బియ్యపు పిండి తో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి ,మరో ఐదు ఉండ్రాళ్ళను అయదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి . ఇలా అయదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి బర్త లబిస్తాడు అని చెబుతారు . 
మద్యాహ్నం గౌరీ పూజ. గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు. ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి , ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి , మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి , పచ్చి చలిమిడి చేసి , ఐదు ఉండ్రాలను చేసి , నైవేద్యం పెట్టాలి.
పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి.


 సత్ప్రవర్తన తో ఉండి నోచినవారికి  ఉన్నతమైన పలితముంటుంది. కాబట్టి  సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి...సేకరణ...

No comments: