Adsense

Saturday, September 18, 2021

నేడు వామన ద్వాదశి , బలిని వామనుడు తొక్కిన రోజు పురాణ గాథ




భాద్రపద శుక్ల ద్వాదశి - వామన ద్వాదశి
భాద్రపద శుక్ల ద్వాదశి విష్ణువు ఐదవ అవతారమైన వామనుడికి ఇది ప్రియమైన దినము.

వామనుడు బ్రహ్మచారి వటుడు. తపస్విని ఐన అదితికి కశ్యప బుషి వల్ల పుట్టినవాడు.
విరోచనుడు అనే దైత్యుని కొడుకు బలి. దైత్య కులమున పుట్టినా బలిగొప్ప విష్ణుభక్తుడు. అందుచేత అతడు విష్ణువు అభిమానాన్ని అధికంగా చూరగొన్నాడు. అందుచే  అతనికి గర్వం కలిగి దేవతల్ని బాధించడానికి పూనుకొన్నాడు.

అప్పడు దేవతలు శేషనారాయణుని సన్నిధికి వెళ్ళి బలి బాధ పోగొట్టవలసిందిగా ప్రార్జించారు. భక్తుని భంగపెట్టడానికి విష్ణువుకి ఆదిలో ఇష్టం లేకపోయింది. అయినా దేవతుల విన్నపం  చేకొనక తప్పిందికాదు. అందుచేత విష్ణువు వామనమూర్తి ఐ బ్రాహ్మణ యాచకుని వేషంతో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లాడు.

వచ్చే వామనుని చూచి బలి సింహాసనం విూద నుంచి లేచి దాని విూద వామనుని కూర్చోబెట్టాడు. బద్దుడై బలి అతిధి రాకకు కారణం అడిగాడు.

తన వేదపఠనానికి గాను తనకు *త్రిపద్భూమి* కావాలని వామనుడు బలిని కోరాడు. త్రిపద్భూమి అంటే మూడు అడుగుల నేల అని. కోరడం తడువుగా బలి ఇస్తానన్నాడు. మంత్రయుక్తంగా దానకర్మచేయించడానికి బలి తన గురువైన శుక్రుడికి కబురు చేస్తాడు.
శుక్రుడు వచ్చి వామనుడి ఆంతర్యం గ్రహించి బలిచక్రవర్తితో చెబుతాడు, ఇది అపాత్రదానమని కూడా వాదిస్తాడు. దానం ఇవ్వడంతోటే నిన్ను పాతాళంలోకి తొక్కివేస్తాడని కూడా అంటాడు.

 ఐనా బలి తాను ఆడిన మాట తప్పేదిలేదన్నాడు. దానం చేసేందుకు నీరు వదలడానికి బలిచక్రవర్తి జారీ చెంబుఎత్తాడు.
అప్పడు శుక్రాచార్యుడు సూక్ష్మరూపం ధరించి జారీ కొమ్ముకు అడ్డంపడి నీరు కారకుండా చేశాడు. అందు మీద బలి ఒక పుల్ల పుచ్చుకుని జారీ కొమ్ములో పొడిచాడు. దానితో శుక్రాచార్యులవారి ఒక కన్నుపోయింది.

గత్యంతరం లేక అప్పడు శుక్రాచార్యులు బయటకి వచ్చివేశాడు. బలి దానం పూర్తిచేసాడు.
అంతట వామనుడు బ్రహ్మాండాంత సంవర్ణియై ఒక పాదంతో భూమిని , ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి మూడోపాదం బలి నెత్తి మీద వుంచి ఆతణ్ణి పాతాళంలోకి తొక్కివేశాడు.
ఐనా బలి విష్ణుభక్తుడు కాబట్టి వామనుడు బలి భవనానికి ద్వారపాలకుడుగా వున్నాడు.

ఇది విష్ణువుకి న్యూనతకాదు. బలి భక్తికి ఫలితంగా నిత్యమూ వామన దర్శనం కావడం కోసమే విష్ణువు ఈ విధంగా ద్వారపాలకుడు అయ్యాడు. అవి కొధారీ వ్రాతలు ,
హేమాద్రి , భవిష్య పురాణాల్లో ఈ విషయము కూడా కలదు.

 భాద్రపదమాస శుక్ల ద్వాదశి శ్రవణనక్షత్రంలో వామనావతార జయంతి వుత్సవం జరుపుతారు. దీనిని విజయ ద్వాదశి అని కూడా అంటారు.
ఈరోజు జపించవలసిన స్తోత్రము

*శ్రీవామనస్తోత్రం*

అదితిరువాచ

యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్శ్రవణ మంగళనామధేయ

ఆపన్నలోకవృజినోపశమోదాఽఽద్య శం నః కృధీశ భగవన్నసి దీననాథః

విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే

స్వస్థాయ శశ్వదుపబృంహితవూర్ణబోధ- వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే

ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ- ర్ద్యౌభూరసాస్సకలయోగగుణాస్త్రివర్గః

జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టా- త్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః

*ఇతి శ్రీమద్భాగవతే శ్రీవామనస్తోత్రం*

వామన ద్వాదశికి ముందటి ఏకాదశి ఉపవాసం వుండి రాత్రి జాగారం వుండి వామనావతార విగ్రహాన్ని పూజించాలి. విగ్రహానికి శిఖ , సూత్రం , యజ్జోపవీతం , కమండలువు ఇవి ఉండటం అవసరం. ప్రతోత్సవ చంద్రిక
ద్వాదశి నాడు ఉపవాసం చేసినవారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోవును. ఈనాడు పెరుగు దానం చేయాలి.

శక్రద్వాదశి.. దీనిని శక్ర ద్వాదశి అని కూడా అంటారు. ఈనాడు ఇంద్రధ్వజోత్తాపన పూజ జరుపుతారు. శక్రద్వాదశినాడు ఇంద్రప్రీత్యర్థము ధ్వజాన్ని నెలకొల్పి పూజిస్తే సస్యాను కూల వర్షప్రాప్తి కలుగుతుంది. శక్రధ్వజోత్తాపనం రాజులు మాత్రమే చేయవలసిందిగా గ్రంధాంతర మందు కలదు... సేకరణ

No comments: