Adsense

Saturday, September 18, 2021

ఈ రోజు నుండి పురాటాసి మాస ప్రారంభం. సెప్టెంబరు నెల 18వ తేదీనుండి తిరుమల శనివారాలు ప్రారంభం పురాటాసిమాసం.

.


ఈపురాటాసిమాసంలో శ్రీవారితిరునక్షత్రం 🌟

*విగ్రహ మాసం*

శ్రీవారి పురాటాసి (పెరుమాళ్)*మాసం
 వైకుంఠం నుంచి నారాయణుడు  కలియుగ భూ వైకుంఠం లొ విగ్రహం గా మారిన నెల ఈ నెల మొత్తం శ్రీవారి నీ నియమ నిష్ఠలతో అర్చించిన శ్రీవారి కృప చేత అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ నెల రోజులు శ్రీవారి దర్శనం సర్వ మంగళ  లక్ష్మీ కటాక్ష కారణం*

*విగ్రహ మాసం*

తిరుమల పన్నెండు మాసాల సమూహాన్ని సంవత్సరం అంటారు. మాసాల పేర్లు తమిళంలో, తెలుగులో వేరువేరుగా ఉంటాయి. తెలుగు మాసాలు చంద్రమానం ప్రకారం ఉంటే, తమిళ మాసాలు సౌరమానం ప్రకారం లెక్కగడతారు. సూర్యుడు ఉన్న రాశిని బట్టి నెలకు పేరు. 

ఈ క్రమంలో ఆరవ నెలను పెరటాసి అని వ్యవహరిస్తారు. దీన్ని పురటాసి, పెరుమాళ్‌ అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు వేంకటాచలపతిగా అవతరించిన మాసమే పెరటాసి. ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో తిరుమలేశుడు అవతరించినట్లు వేంకటాచలమహత్యం చెబుతోంది. ప్రత్యేకించి శనివారం ఆయనకు ఎంతో ప్రీతి. పెరటాసిలో శనివారాలు నాలుగు లేక ఐదు వస్తాయి. 

వీటిలో మూడో శనివారాన్ని తమిళులు చాలా విశేషంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.
పవిత్ర పెరటాసి మాసంలో భక్తులు నియమనిష్టలతో ఉండాలని స్కంధపురాణం చెబుతోంది. తిరుమలేశుడికి ఈ నెలలోనే సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నందున ఇది శ్రీవారి తిరునాళ్ల నెలగా పిలుస్తారు. 

ఈ నెల్లో వచ్చే శనివారాల్లో ఉదయాత్పూర్వమే భక్తులు నిద్రలేచి శుచిగా స్నానమాచరించి చక్కెర లేదా బెల్లం కలిపిన బియ్యం వంటకాన్ని భగవంతుడికి నివేదిస్తే చాలా విశేషం. దీనిని తలిగ అంటారు. ప్రతి భక్తుడు నియమనిష్టలతో ఉండి స్వామివారిని పూజించి ముడుపులను మూటగట్టి స్వామికి సమర్పించుకుంటారు. పెరటాసి మాసం సెప్టెంబరు 17వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 

ఈ  పెరటాసిలో ఐదు శనివారాలు ఇందులో తొలి, మూడో శనివారాలు శ్రేష్టమైనవని తప్పకుండా ఆ వారాలలో తలిగ వేసుకుంటే శుభం జరుగుతుందని ఆచార్య చక్రవర్తి రంగనాథన్‌ వివరించారు.
 మూడో శనివారం తలిగ
తమిళులు పెరటాసి మాసాన్ని ఎంతో విశేషంగా భావిస్తారు. సంవత్సరమంతా తమ తమ పనుల్లో నిమగ్నమయ్యే వారు ఈ నెలలో మాత్రం శ్రీనివాస పెరుమాళ్‌ను విధిగా కొలుస్తారు. 

ప్రతి రోజు ఉదయమే తలస్నానం చేసి ప్రాతఃకాలారాధన పవిత్రంగా చేస్తారు. శనివారాలు ఉపవాసం ఉంటారు. అన్ని రకాల పదార్థాలను తయారుచేసి అరిటాకులో స్వామికి నివేదిస్తారు. ఇందులో ప్రధానంగా చక్కెర పొంగళి, పునగాకు వేపుడు ఉంటాయి. నట్టింట గోడకు చిక్కుడు ఆకు పసరుతో పచ్చగా దిద్ది దానిపై కోపుతో నామం, శంఖ చక్రాలు వేస్తారు. పసుపు వస్త్రాలను ధరించి గోవిందనామాలతో దేవదేవుడిని కొలుస్తారు. 

ముడుపులు హుండీకి సమర్పిస్తారు.ఇంటిల్లిపాదీ సమూహంగా కూర్చుని నట్టింట పెట్టిన అరిటాకు భోజనాలను స్వీకరిస్తారు. ప్రధానంగా తలిగ రోజు మూడో శనివారం తక్కువ అంటే ఐదు ఇళ్లలో భిక్షమెత్తిన బియ్యంతో ప్రసాదం సిద్ధం చేసి స్వామివారికి నివేదిస్తారు. తమ ఆర్థిక స్థోమతను అనుసరించి కొంతమంది అన్నదానం చేస్తారు.
పాదయాత్రగా తిరుమలకు. పెరటాసి మాసంలో తమిళులు తప్పనసరిగా తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకుటారు. 

వీలులేని పడని పక్షంలో తమ ఊళ్లలోని శ్రీవైష్ణవ దేవాలయాలకు వెళతారు. గ్రామీణులు ఊళ్లకు ఊళ్లు బయల్దేరి తిరుమల బాటపడతారు. తిరుమల చేరుకుని తలనీలాలు సమర్పించి మూలవర్లను దర్శించుకుంటారు. ఏడాది పొడవునా సంపాదించిన దాంట్లో కొంతభాగం కూడబెట్టి కానుకలను హుండీకీ సమర్పించుకుంటారు. అఖిలాండం వద్ద నేతి పిండి దీపారాధనతో స్వామిని వేడుకుంటారు. గత వెయ్యేళ్లుగా ఈ ఆచారం సాగుతోందని చరిత్ర...స్వస్తి... ఓం నమో వెంకటేశాయ..🚩

No comments: