Adsense

Saturday, September 18, 2021

కల్యాణమంటే

  
🛎 కల్యాణం అనే పదానికి ఒక్కసారి అర్థాన్ని పరిశీలిస్తే ' "కల్యం సుఖం అణయతి ప్రాపయతి - ఇతి కల్యాణం -"
 సుఖాన్ని కలిగించేదే కల్యాణం అని సామాన్యార్థం . 

👉ఈ కల్యాణాన్నే వివాహం , ఉద్వాహం , పరిణయం , పాణిగ్రహణం మొదలైన అనేక పేర్లతో వ్యవహరిస్తారు . 
👉జానపదులు తెలుగులో పెళ్లి , పెండ్లి అనీ , కన్నడంలో ' లగ్న ' , ' మదువే ' అనీ , తమిళంలో ' తిరుమణం ' అని పిలుస్తారు .

👉 నిజానికి పద్మావతి శ్రీనివాసుల కల్యాణం 5 వేల సంవత్సరాలకు పూర్వమే జరిగింది . 
మనం చేసే కల్యాణమేమీ ఆయనకు అక్కరలేదు . అయితే మనం మన యోగక్షేమాలను కోరి ఆ ఏడుకొండలవానికి కల్యాణోత్సవాన్ని జరుపుతున్నాము . 

👉తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి , భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ప్రతిరోజు అభిజిత్ లగ్నంలో జరిగే ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి వందల సంఖ్యలో గృహస్థులు హాజరవుతారు .

👉లోక కల్యాణార్థం భక్తులచే, దేవస్థానం వారిచే జరిపించే ఆర్జిత కల్యాణోత్సవమే ఇంత వైభవంగా జరిగితే.... ఇక ఆ పద్మావతీ శ్రీనివాసుల నిజమైన కల్యాణోత్సవం ఇక ఎంత వైభవంగా జరిగిందో కదా......

👉మరి ఆ జగత్ కల్యాణ చక్రవర్తి పెళ్లి ముచ్చట్లు తెలుసుకుందామా.......

👉ఆనాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం 5 రోజులు జరిగింది కనుక మనం కూడా ఆ వేడుకను ఐదు భాగాలుగా చర్చించుకుందాం....

👉మొదటి రోజులో భాగంగా ఈ రోజు సాయంత్రం శ్రీవారి పెళ్లి ముహూర్తం, పెళ్లి ఏర్పాట్లు, పెళ్లి పిలుపులు గురించి తెలుసుకుందాం....

కళ్యాణం కమనీయం శ్రీ వేంకటేశ్వర కళ్యాణం.." 

"చదవండి,
 తెలుసుకోండి, 
ఆ వైభవం అనుభవించి తరించండి."
 

🙏ఓం నమో వేంకటేశాయ🙏

No comments: