Adsense

Saturday, September 18, 2021

గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాధలు



భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాధలున్నాయి.
జగజ్జనని (అంతర్ధానాంశయై) నిరాకారయైన గంగ బ్రహ్మదేవుని కమండలువునందుండెను. 

ఒకమారు శంకరుడు రాగము లాలాపించినపుడు నారాయణుడు ద్రవీభవించెను. ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలువును తాకించగా నిరాకార గంగ జలమయమయ్యెను. 

శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినపుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణుపాదమును కడిగెను. (బ్రహ్మ కడిగిన పాదము – అన్నమయ్య కీర్తన). ఆ పాదమునుండి ప్రవహించునదే దివ్యగంగ.

సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది.

 సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.

భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై “నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?” అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదలాడు.

 భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, “జాహ్నవి” అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

స్వర్గంలో “మందాకిని”గా, భూలోకంలో “గంగ” లేదా “అలకనంద”గా, పాతాళంలో “భోగవతి”గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగను “త్రిపథగ” అంటారు.

భారతంలో బీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై బీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు.అవి ఈ క్రింద వివరించబడినాయి.

1 .గంగా, యమున ,సరస్వతులు కలసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞ యాగాది దానాదులు చేసినదానికంటే అధికం.

2 . గంగాజలం కొంచమైననూ దేహమునకు సోకిన సకల పాపములు నశించును.స్వరం లభించును.

3 . నరుని ఎముక గంగానదియందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును.

4 . గంగాస్నానమాచరించిన వారు పరిశుద్ధులగుటయేకాక ఏడు తరముల వారు పరిశుద్ధులగుదురు.

5 . గంగా జలం త్రాగిన కలుగు ఫలితం నూరు చంద్రాయణం చేసినదానికంటే అధికం.

6 . శిరస్సు,మ్య్ఖం ,దేహంలందు గంగా మృత్తిక(మట్టి)ను రాసుకుని స్నానమాచరించిన గరుత్మంతుని చూచి పాములు పారిపోయినట్లు పాపములు దూరమగును.

7 . ఆధారం లేని జనులకు గంగ ఆధారమగును.దేవతలకు అమృతము వలె మునులకు గంగ ప్రియమైనది.

8 . గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానంము కలిగించుచూ పాపములను దూరం చేయును.

9 . మరణకాలమందు గంగను తలచినవారికి మోక్షం లభించును.

10 . గంగా నది మహిమలు చెప్పుకొను వారికి పాప భయం,రాజ భయం,చోర భయం,భూత భయం మొదలైన భయములు నశించును.

11 . గంగ ఎంతయో పుణ్యరాశి అయినందున ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తలమీద ధరించాడు.

12 . గంగ మూడు లోకములందు ప్రవహించి పునీతం లోకాలను చేస్తుంది.

13 . భగీరధుడు కపిల ముని శాపం వలన భస్మమైన తన పితరులకు మోక్షప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకు వచ్చాడు.

14 . గంగా నది బ్రహ్మలోకం నుండి మేరురూపుడైన విష్ణువు నుండి సూర్యుని నుండి చంద్రుని నుండి శివుని జటాజూటం నుండి హిమవంతం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంది.

15 . గంగ తొలుత విష్ణు పాదం నుండి ఉద్భవించింది కనుక గంగను భక్తితో శరణుజొచ్చిన మోక్షం నిశ్చయం.

16 . గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తుంటారు.నరులకు గంగానది మహిమ వర్ణించుట సాధ్యము కాదు.

17 . తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగనది మహిమలను మనోవాక్కాయకర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగును.

18 . గంగాదేవి ఇతిహాసమును వ్రాసినను విన్ననూ చదివిననూ సకల వ్యాధులు నశించి పరమ శుభములు కలుగును……సేకరణ.

No comments: