Adsense

Tuesday, October 5, 2021

ఆదిపురి...అత్తివృక్షం



అత్తి వృక్షం స్ధల వృక్షం గా వున్న ఆలయం చెన్నైలో  వున్న  తిరువొత్తియూరు ఆలయం.

కృత్తికా  నక్షత్రం వారు పూజించ
వలసిన వృక్షం అత్తి వృక్షం.
కృత్తికా నక్షత్రం కుమారస్వామి నక్షత్రం. ఈ నక్షత్రం లో జన్మించిన వారు మేధావులుగా వాక్పటిమ కలిగి దృఢంగా తేజస్సుతో వుంటారు.
ఉన్నత పదవులు  సంఘంలో అంతస్తులు
వీరిని వెతుక్కుంటూ వస్తాయి.

అత్తి వృక్షం చితుకులు హోమంలో వేసిజ్వలింపచేయగా వచ్చే
పొగ వల్ల కారుమబ్బులు 
కమ్ముకుని  వర్షం వచ్చే శక్తి వున్నదని
ఖగోళ మూలికా శాస్త్రం
తెలుపుతున్నది.

దత్తాత్రేయ మహర్షి అత్తి వృక్షం నీడనే
నివసిస్తారని గురు చరిత్ర
తెలియచేస్తున్నది.

దానవుల గురువైన శుక్రాచార్యుల అంశ
' అత్తి వృక్షం' అని తెలుపుతున్నది చాతుర్మాస
మహాత్యం.

నరసింహ అవతారం దాల్చిన
మహావిష్ణువు  హిరణ్యకశిపుని
సంహరించిన తరువాత
అత్తి వృక్ష బెరడుతో 
తన గోళ్ళు శుభ్రపరచుకొన్నట్టు
ఒక పురాణ సమాచారం.

తిరువొత్తియూరు
వడివుడై
అమ్మవారి సమేతంగా 
అనుగ్రహిస్తున్న  త్యాగరాజస్వామి (శ్రీఆదిపురీశ్వరుడు)
 ఆలయంలో స్ధల వృక్షం
అత్తి వృక్షం.

ఈ ఆలయం వడివుడై అమ్మవారికి ప్రాధాన్యత ఎక్కువ. బ్రహ్మ దేవుడు
ప్రపంచాన్ని సృష్టించడానికి ముందే ఆవిర్భవించిన ఊరు
అని పురాణాల వివరణ.
అందువలన యీ ఈశ్వరునికి
ఆదిపురీశ్వరుడని పేరు.
రాముని కుమారుడు లవుడు
రాజసూయ యాగం జరిపిన
స్ధలం యిది. 

ఆదిశంకరా
చార్యులవారు
ఇక్కడికి వచ్చి పూజించారు.
కవిచక్రవర్తి కంబర్ నిత్యం
యీ ఆలయానికి వచ్చి
పూజించిన నిదర్శనాలున్నవి.

27 నక్షత్రాల నామాలతో శివలింగాలు కలిగివుండడం
యీ ఆలయ
విశిష్టత.

పరమశివుడు ఇక్కడ ఆశీనుడై వుంటూ నాట్య భంగిమలో కనిపించడం ఒక  విశేషం...సేకరణ...

No comments: