మన ప్రాచీన దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలేకావు ఆరోగ్య సంపదను ప్రసాదించే మహిమాన్విత స్థలాలు కూడా.
మన ఆలయాలలో దేవునికి నివేదించే ప్రసాదాలలో పలు వ్యాధులను నివారించే గుణాలున్నట్లు పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు.
1)ముక్కుడి ప్రసాదం :
కేరళలోని పాలక్కాడు పట్టణంలోని
"కుణ్ణత్తూరుమేడు శ్రీ కృష్ణుని ఆలయంలో శ్రీకృష్ణ జయంతి నాడు రాత్రి 11 గం.. - 12 గం..మధ్య జరిపే పూజ జన్మపూజ .
ఈ పూజ ప్రసిధ్ధి చెందినది.
ఈ పూజలో నివేదన చేసే
ప్రసాదాన్ని ముక్కుడి అంటారు.
శొంఠి,పిప్పిలి,ఏలక్కాయ ,
ఇంగువ, వాము , బెల్లం
వీటిని అన్నీ కలిపి "ముక్కుడి" ప్రసాదం తయారుచేస్తారు.
ఈ ప్రసాదాన్ని
భగవంతునికి నివేదించిన
పిదప భక్తులకు వినియోగిస్తారు.
ఈ ప్రసాదాన్ని తీసుకుని
తింటే అనేక వ్యాధులు
నయమౌతాయని భక్తుల
ధృఢ నమ్మకము , అనుభవము.
2)తేనె ప్రసాదం :
తమిళనాడు లోని తిరుచ్చిరాపళ్ళి లోని
"వేక్కాళియమ్మన్" ఆలయం ప్రక్కన వున్న 'కాళికాంబాళ్' ఆలయంలో,
ప్రతీ శుక్రవారము రాహు కాల(పగలు 10.30 - 12.00) సమయంలో , "దుర్గాదేవి కి"అల్లపు రసంతో , తేనెను కలిపి అభిషేకము చేస్తారు.
ఆ అభిషేక రసాన్ని మాటలు రాని పిల్లల నాలుకలకు రాస్తారు. ఇలా కొన్ని రోజులు రాశాక మాటలు రాని ఆ పిల్లలుమాట్లాడగలుగుతారని చెప్తారు.
3)కాకరకాయ ప్రసాదం :
తమిళనాడు లోని పుదుక్కోట్టై జిల్లాలోని , "ఔడైయార్ ఆలయం లో"అర్ధజాము పూజలో, కాకరకాయ పులుసు కలిపిన అన్నమును ప్రసాదంగా ఇవ్వడం ఆచారం .
క్రమంతప్పకుండా నాలుగువారాలపాటు ఈశ్వరుని దర్శించి
కాకరకాయ పులుసు అన్నప్రసాదాలను తీసుకుని మనసారా భగవంతుని
ప్రార్ధిస్తే చక్కెర వ్యాధి గుణమవుతుందని భక్తుల నమ్మకం.
4)విషాన్ని విరిచే (హరించే)ప్రసాదం :
ప్రసిధ్ధి చెందిన కేరళ 'ఆల ప్పుళా" లో వున్న " తిరువిళా శివన్ కోవిల్"(ఉత్సవ శివుని ఆలయం) లో క్షుద్రపూజల వలన ,
చేతబడులతో బాధపడే వారిని, విష పురుగుల బారిన పడినవారిని రక్షించే శక్తి యీ ఆలయంలో పంచే
విషమురి ప్రసాదానికి
వున్నదని భక్తుల ధృఢ నమ్మకం.
ఆలయానికి చుట్టుపక్కల
వున్న మూలికల చెట్ల ఆకులతో తీసిన రసంతో పరమశివుని పూజించిన పిదప ,ఆ రసాన్ని పాలలో కలిపి వ్యాధిగ్రస్తులైనవారికి
వినియోగిస్తారు.
ఆ రసాన్ని తాగిన పిదప
ఆలయాన్ని ప్రదక్షిణం
చేసివచ్చేలోగా వారికి వాంతి అయి పోతుంది .
ఆ వాంతి తో
విషం బయటికిపోయి
రోగికి స్వస్ధత చేకూరుతుందని
భక్తులు ధృఢంగా నమ్ముతారు.
5)వలి ఎణ్ణై ప్రసాదం :
తగళి ధర్మశాస్తా ఆలయంలో
ఇచ్చే ప్రసాదమే 'వలి ఎణ్ణై
ప్రసాదం" .
దీనికి వాత వ్యాధులను
గుణపరిచే శక్తి కలది.
ఈ ఆలయ సన్నిధిలో నివసించే "అణక్కేళత్త్
వలియచ్చన్" గా పిలవబడే (అంటే
పెదతండ్రి) ఒక సాధువు
స్వప్నంలో అయ్యప్పస్వామి
దర్శనమిచ్చి, వాత వ్యాధిని నివారించే ఔషధ తైలాన్ని తయారు చేసే విధానం తెలిపినట్లు చెప్తారు.
అయ్యప్పస్వామి నిర్దేశించిన
విధానంగానే ఆయన
తైలాన్ని కాచాడు, ఆ కాచే తైలం పక్వానికి వచ్చే సమయంలో వచ్చిన వాసన ,
- ఆ రోజు అయ్యప్పకి నివేదించిన ప్రసాద తైల వాసనతో సమానంగా వుందని , అందువలన ఆ సాధువు తయారు చేసిన తైలానికి అయ్యప్ప ఆమోదించినట్లుగా చెప్తారు.
ఓదర కొండ ప్రాంతంలో
84 రకాల తైలాలను
కలిపి యీ వలి ఎణ్ణై తైలాన్ని కాచుతున్నారు.
ఈ తైలాన్ని తీసుకునేవారు కఠిన పత్యంతో వుండాలి.
చెప్తారు. ఈ ప్రసాద తైలాన్ని శంఖం లో పోసి, నాలిక మీద,
పంటికి తగలకుండా
గొంతుకలో పోస్తారు.
ఏడు రోజులుపాటు అక్కడే వుండి ప్రార్ధనల తర్వాత యీ మందును త్రాగిన పిదప, ఆలయంలో, రాతి ఉప్పు
మిరియాలు కలిపిన అన్నం ప్రసాదంగా పెడతారు.
పత్యంలో భాగంగా
మంచినీరు, టీ వంటి ద్రవ పదార్ధాలు త్రాగ కూడదు.
ఆషాఢ, జ్యేష్టమాసాలలో
ఈ తైలాన్ని కాచుతారు.
ఈ రెండు మాసాలలోనే యీ మందును పుచ్చుకోవాలి.
అయ్యప్ప స్వామిని అత్యంత భక్తి శ్రధ్ధలతో ప్రార్ధించి, యీ మందుని వాడితే ఎంతటి క్లిష్టతరమైన వాతవ్యాధి అయినా తొలగిపోతుందని, భక్తులవిశ్వాసం, వారి అనుభవం.
6)తాళ్ కరి ప్రసాదం :
ఆలప్పుళా జిల్లాలోని
మరుత్తోరు తాలూకా
"శ్రీ ధన్వంతరి" ఆలయంలోని
విశేష " తాళ్ కుళంబు" (తాళ్ కరి అంటే చామదుంప ఆకుల పులుసు) అనే
ప్రసాదానికి, రక్తానికి
సంబంధించిన వ్యాధులను
గుణపరిచే శక్తి వున్నదని
నమ్మకం .
స్వాతి తిరునాళ్ రాజావారు
"తాళ్ కుళంబు" ప్రసాదం
సేవించి తన వ్యాధి నుండి
విముక్తి పొందాడు.
ఆషాఢ మాసంలోని అమావాస్యనాడు మాత్రమే యీ
తాళ్ కుళంబు నైవేద్యం పెడతారు. అడవి చేమ
దుంపను బాగా తరిగి
దానితో పచ్చ ఆకులను కూడా చేర్చి,
యీ కుళంబు (పులుసు)
పెడతారు.
ఆలయంలో దేవునికి నివేదించిన
యీ తాళ్
కరి పులుసును ప్రసాదంగా భక్తులకు వినియోగిస్తారు.
7)అడుక్కళై ప్రసాదం :
అన్నదాన ప్రభువైన వైక్కతప్పన్ ఆలయంలో
యీ ప్రసాదం ఇస్తారు.
అత్యంత ప్రసిధ్ధి చెందిన
ప్రసాదం " అడుక్కళై
విభూది ప్రసాదం"
పొయ్యి లోని బూడిదనే
విభూది ప్రసాదంగా
వినియోగించడం , ఐహీకం.
విభూది ని భక్తితో ధరిస్తే
"హిస్టీరియా వంటి" వ్యాధులు
గుణమౌతాయని భక్తులు
ధృఢంగా నమ్ముతారు...స్వస్తి....సేకరణ.
No comments:
Post a Comment