Adsense

Saturday, February 26, 2022

ఎలాంటివేళల్లో భోజనాన్ని తినకూడదు?

 
గ్రహణం సమయమున అనగా సూర్యగ్రహాణానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహాణానికి 9 గంటల ముందుగా ఎటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోకూడదు.

2.‘ఏడు’ సంఖ్య మంచిదా కాదా?

తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం క్రింద లోకాలు 7, భువర్లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7. అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా ఏడే. 7 సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. డాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకిలభిస్తుంది.

3.దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. 

వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. అలాగే ఆముదంతో వెలిగించి చేసే దీపారాధన వలన దాంతాయి. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు.

 శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.

4. లక్ష్మీదేవి తామర పువ్వులోనూ, ఇరుప్రక్కలా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది?

సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది.

 తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం. ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్థం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం.

5) ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?

మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగావున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి.

 దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

No comments: