Adsense

Saturday, February 26, 2022

మాఘ పురాణం - 25 వ అధ్యాయము...!!కలింగ కిరాతుడు -మిత్రుల కథ




గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. 

" ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను. వినుము. 

ఎట్టి పాపాత్ముడైనను, మాఘమాసవ్రతము నాచరించి, పాప విముక్తుడగునని, యీ కథ తెలుపెదను. వినుము. అతి ప్రాచీనమైన యీ కథ,

 శ్రీహరి 
కథామహిమను తెలుపును.

పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు.

 ఆయుధములను ధరించి, పరివారముతో, నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా, నొకవిప్రుని జూచెను. 

ఆ బ్రాహ్మణుడు, నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో, ఆయాసముచే, నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి, మరల ప్రయాణము చేయదలచెను.

 కిరాతుడతని చూచి, వాని వద్ద నున్న వస్త్రములు, ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి, యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని, బలవంతముగ తీసికొనెను.

"ఓయీ! నీవు దాచిన ధనమునిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని, కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, 'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని, సమాధానము నిచ్చెను.

 వాని మాటలకు కోపించిన కిరాతుడు, ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు,  అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి, వారి నగలను, ధనమును దోచుకొనుచుండెను. 

అతడు క్రమముగా, అరణ్య మార్గముననే కాక, పట్టణ మార్గమున ప్రయాణించు, వారిని  కూడ  దోచుకొని, చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక, విపరీతముగా పెరుగుచుండెను.

ఇట్టి కిరాతునకు, బంగారు నగలను చేయువాడొకడు, మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె, క్రూరుడు, వంచనాపరుడు, బంగారపు నగలను చేయుచు, దానిలోని బంగారము హరించెడివాడు.

 కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని, స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడుl. అతడును నగలమ్మి, అందులో కొంత ధనమును తీసుకొని, మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. 

వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట, ఆమె మరింత స్వేచ్చావర్తనురాలయ్యెను.

 ఈ విధముగ, నాకుటుంబమున కుమారుడు, తల్లి యిద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా, నుండిరి. వాని తల్లి, చీకటిలో కామాతురయై, తన విటుడు వచ్చుచోటికి పోయెను. 

చీకటిగానున్న ఆ యింటికి, ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని, యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు, వ్యభిచారిణి కాముకురాలయిన, తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను.

 చీకటిలో నున్న తల్లి, తాను కోరిన ఆమెయనుకొనెను, వాని తల్లియు, ఆ చీకటిలో వచ్చినది, తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. 

ఈ విధముగా, తల్లియు కుమారుడును, ఆ చీకటిలో, ఒకరినొకరు యెరుగక, తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా, వారిద్దరును, ఆ చీకటిలో కలిసిరి, సమాగమమైన తరువాత, వారిద్దరును, ఒకరి నొకరు గుర్తించిరి.

 వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి, నరకమును చేరి, శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము, నిర్భయముగా నుండెను. 

పరస్త్రీ వ్యామోహముచే, అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై, కిరాతుని చేరి, వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు, బ్రాహ్మణుని, ధనమునకై చంపినవాడు. 

సువర్ణకారుడు నమ్మి యిచ్చిన నగలలో, బంగారమును, దొంగలించువాడు. శూద్రుడు, తల్లితో, వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని,, బ్రాహ్మణ మిత్రుడొకడు, కలడు.

 అతడు వారితో కలసి, వారితోబాటు, పాపకార్యములను చేయుచుండెను, బ్రాహ్మణుడగుటచే, వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో, పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. 

బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కల్లుత్రాగువాడు, క్రూరుడు, బంగారము నపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును, పంచమహాపాతకులు.

 బ్రాహ్మణుడు, కిరాతుడు, పంపగా, గ్రామాంతరమునకు పోయెను, అతడు ఆ గ్రామమున, శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. 

లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు, వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి,దీనుడై యున్నవానిని చూచి, "నీవెవరవు? ఎక్కడికి పోవుచున్నావని" యడిగెను.

 అతడును," నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పని చేయువాడనని" పలికెను. అప్పుడు వీరవ్రతుడు, ధ్యానమగ్నుడై యుండి, కనులు తెరచి యిట్లనెను.

"ఓయీ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను. వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు. 

వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు. తల్లితో రమించినవాడు.

 ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో, తిరిగి, నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను, వాడును, వారివలె పాపాత్ముడగును.
నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది, మరల కాశీనగరమునకు పోయెను.

 గృహస్థాశ్రమమును స్వీకరించి, వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును, ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను, పుత్ర పౌత్రులను పొంది, సుఖముగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను...🙏💐

నేటి మాఘ పురాణం 25,వ రోజు పారాయణం సమాప్తం..

No comments: