మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు...!!
పౌర్ణమి సందర్భంగా ఈ రోజు రాత్రికి వెన్నెల పారాయణం చేయండి 🙏
మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలల్లో ఏలకులు, పటికబెల్లం కలిపి వెన్నలలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి.
ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తిరిపోతుంది
9 సార్లు అనే సరికి అమ్మో ఇన్ని సార్లా అని ఆనుకుంటారేమో, కానీ పౌర్ణమి చాలా చాలా విశేషం, ఇలా భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.
మీకు ఎట్టి సమస్య అయినా పరిస్కారం తప్పకుండా లభిస్తుంది, ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది.
ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి.
లలితా సహస్త్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది, అలా 9 సార్లు పూర్తి అయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీ చక్రం చుట్టి ఉంటుంది.
అంత సేపు ఒకే అసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీ చక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవము కలుగుతుంది,
అది అనిర్వచనీయమైన అనుభూతి అనుభవిస్తుంటే అర్ధమవుతుంది, ఒక్కసారి ఊహించండి అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకుని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా.
శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది.
ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమి కి చేయవచ్చు..
ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్క సారి చదవచ్చు. ఇలా చేయాలనే సంకల్పం కలగడం కూడా పూర్వజన్మల సుకృతమే,
అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది అనడానికి ప్రతీక.
ఏదైనా తీరని సమస్య, లేదా కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి.
ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహము కోసం చేయవచ్చు, 9 సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది కనుక అలా చెప్పాను
శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు.దయచేసి సద్వినియోగం చేసుకోండి..
చంద్రోదయం తరువాత చేయవచ్చు, బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకుని కూడా చేయవచ్చు,
వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడుగా భావించి పారాయణ చేయవచ్చు....స్వస్తి..
No comments:
Post a Comment