నేడు యశోద జయంతి...!!
నేడు పవిత్రమైన రోజు ఎందుకంటే ఇది శ్రీకృష్ణుని పెంపుడు తల్లి యశోద పుట్టినరోజు.
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం షష్ఠి తిథి నాడు, భక్తులు ఈ రోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
యశోదా జయంతి రోజున తల్లులు తమ పిల్లల కోసం ఉపవాసం చేస్తారు
వారి ఆనందం మరియు శ్రేయస్సు కోసం .
మహారాష్ట్ర, గుజరాత్ మరియు దక్షిణ భారత రాష్ట్రాలలో ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది .
పంచాంగం ప్రకారం, యశోదా జయంతిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఆరవ తేదీన జరుపుకుంటారు,
కాబట్టి ఈ సంవత్సరం యశోద జయంతిని ఫిబ్రవరి 22, 2022 మంగళవారం జరుపుకుంటారు
యశోద జయంతి 2022: పూజ విధి
యశోదా జయంతి రోజున, తల్లి యశోద ఒడిలో కూర్చున్న శ్రీ కృష్ణుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూజించండి.
ఇలా చేయడం వల్ల పిల్లల కష్టాలు అన్నీ తీరిపోతాయని నమ్మకం.
ఈ రోజున స్త్రీ శ్రీకృష్ణుడిని, యశోద తల్లిని పూజిస్తే శ్రీకృష్ణుడు ఆమెకు బిడ్డ రూపంలో దర్శనమిస్తాడని చెబుతారు.
యశోదా జయంతి నాడు బ్రహ్మ ముహూర్తంలో లేవడం శుభప్రదంగా భావిస్తారు.
ఉదయం పూట మీరు చేయవలసిన మొదటి పని యశోదా రూపమైన మా ఆదిశక్తిని స్మరించుకుని నమస్కారాలు చేయడం.
ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి గంగా జలంతో స్నానం చేయాలి.లేదా శుద్ధి నీటితో..
యశోద మరియు శ్రీకృష్ణుడిని పూజ పటానికి...
అగరబత్తులు, పువ్వులు, తులసి ఆకులు, హాల్వా, చందనం, కుంకుమ, కొబ్బరి కాయ, అరటిపండ్లు, తాంబూలం మొదలైన వాటిని సమర్పించి పూజించండి.
తరువాత, మా యశోద అమ్మది ఈ క్రింది మంత్రాలను జపించండి.
యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేన్ సంస్థితా । నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్వభూతేషు యశోదా రూపేన్ సంస్థితా । నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
ఇంట్లోని కష్టాలు తొలగాలంటే అమ్మ యశోదకు, శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టాలని చెబుతారు.
యశోదా జయంతి నాడు కృష్ణ మందిరంలో గోధుమలతో నింపిన రాగి పాత్రను నైవేద్యంగా సమర్పించడం మంచిదని అంటారు .
యశోదా జయంతి రోజు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.
యశోదా జయంతి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక లేదా ఓం గుర్తులు వైయడం మంచిది అంటారు
యశోద జయంతి కథ :
ఒకానొకప్పుడు బ్రహ్మ ఈ ద్రోణుడు , "ధర", లను పిలిచి ,
‘ఒక ప్రయోజనం కోసం మీరు భూలోకంలో జన్మించాలని’ కోరతాడు. అప్పుడు వాళ్ళు ‘వెళ్తాం.
కానీ అక్కడ మాకు నిరంతరం విష్ణువును సేవించే అవకాశమివ్వాలని’ప్రతిగా కోరుతారు.
అంతేకాక , వీరికి సంతానం లేనందున త్వరగా అనుగ్రహమిచ్చే గంధ మాదన అనే పర్వతం దగ్గర విష్ణువును ప్రార్థిస్తారు.
కానీ , విష్ణువు అనుగ్రహం , పలుకు దొరక నందున వారు అక్కడే అగ్నిలో ఆహుతై పోయారు.
అప్పుడు అశరీరవాణి ‘శ్రీమహావిష్ణువే మీకు కుమారుడుగా లభ్యమవుతాడని’ చెప్పిందట.
అలా , వారు బ్రహ్మ కోరిక మేరకు భూలోకంలో నందగోకులంలో జన్మించడం , కృష్ణున్ని సంతానంగా యోగమాయ స్థానంలో పొందడం జరిగింది.
యశోద ఒడిలో పడుకొని పాలు తాగుతున్న కృష్ణుడు పెద్దగా ఆవులిస్తాడు.
అప్పుడు ఆ నోటిలో బ్రహ్మాండమంతా కనపడింది. ఇంకోసారి ‘మన్ను తిన్నాడని’ మందలించి నోరు తెరవమంటుంది.
అప్పుడూ ఆ నోటిలో బ్రహ్మాండాన్నంతా మళ్లీ చూసింది. యశోద అనుభవించిన ఈ ‘అద్భుతానంద దర్శనభాగ్యం’, మరే తల్లికీ దక్కలేదు.
దేవదేవుని ఎన్ని మాయలో , మరెన్ని అద్భుతాలో చూసింది , అనుభవించింది ఆ తల్లి. ‘కలయో , వైష్ణవ మాయో , నే యశోదనో కానో’,,,, అనుకుంది.
పాలకుండ పగులగొట్టిన కొడుకును కోపంతో కొట్టలేదు , తిట్టలేదు. అట్లాగని ఊరుకోలేదు.
ఎందుకంటే , గోకులానికి పాలంటే పవిత్రం. అవి కింద పడితే చేతితో తుడుస్తామే తప్ప కాలితో తొక్కం. అలాంటి పాలు కింద ఒలక పోశాడని దుఃఖంతో ఏం చేయాలో తోచక తిట్టలేక , కొట్టలేక , తాడుతో కట్టేయాలని అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చింది.
కట్టేయడానికి రెండంగుళాలు తక్కువైనాయి. చివరకు ‘నేను నిన్ను పట్టుకోలేను. పట్టుబడరా!’,,,, అందట. ఆ రెండే ‘అహంకార, మమకారాలు’,, ఎప్పుడైతే పరిపూర్ణ శరణాగతి అయ్యిందో అప్పుడే పట్టుబడ్డాడు.
పెంచిన ప్రేమ అనగానే యశోదనే అనుకుంటాం. ఒక్కోసారి ‘కన్నవాళ్ళ ప్రేమకంటే పెంచిన ప్రేమ ఎక్కువ’,,, అనేదికూడా ఈ తల్లివల్లే లోకానికి తెలిసింది.
తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్ష దైవాలని , వారి రుణం తీర్చుకోలేమని కొడుకుగా శ్రీకృష్ణుని జీవితం , పెంచితేనే ప్రేమ ఉంటుందని నిరూపించిన తల్లిగా యశోద జీవితం మానవాళికి ఎల్లకాలం ఆదర్శప్రాయమే...స్వస్తి.
No comments:
Post a Comment