ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యానగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న సరయూ నది
దక్షిణ తీరాన రాముడు
అవతరించిన పుణ్య స్ధలంవున్నది.
ఇక్కడ శ్రీరామునికి
పెద్ద ఆలయం నిర్మించారు.
ఈ అయోధ్యానగర ప్రాంతాలలో రామాయణకాలంనాటి
చిహ్నాలు ఎన్నో గత చరిత్రకు
నిదర్శనం గా ఆలయాలుగా, పవిత్ర తీర్ధాలుగా దర్శనమిస్తాయి.
శ్రీరామచంద్రునిగా అవతరించిన మహావిష్ణువు రామజన్మ భూమిలోని ఒక పెద్ద ఆలయంలో
పట్టాభిరామునిగా దర్శనమిస్తున్నాడు.
హనుమాన్ గర్హీ అనే ఒక చిన్న ఆలయంలో హనుమంతుడు కుడిచేతిలో గద, ఎడమ చేతిలో సంజీవ పర్వతాన్ని ధరించి, కాళ్లు
వెడల్పుగా జాపి , ఎగరడానికి సిధ్ధంగా వున్న భంగిమలో కనిపిస్తాడు.
ఈ ఆలయాన్ని రాజా విక్రమాదిత్యుడు
నిర్మించాడు. సీతా రసోయి అనేచోట సీతాదేవి వంటచేసిన ఆ కాలపు పొయ్యిలు వరుసగా వున్నవి.
బంగారు భవనమైన కనకభవనంలో
శ్రీ రాముడు ,సీతాదేవి స్వర్ణ సింహాసనం మీద ఆశీనులై దర్శనమిస్తారు.
వీరి శిరోజాలు మేలిమి బంగారంతో తయారు చేసినవిగా చెపుతారు. ఈ స్వర్ణ భవనం
సీతారాముల శయనమందిరంగా
భావించబడుతున్నది.
లక్ష్మణుని భవనంలో లక్ష్మణుడు ఒంటరిగా ముకుళిత హస్తాలతో దర్శనమిస్తున్నాడు.
ఈ భంగిమ లక్ష్మణుడు
ఎవరినో ఆహ్వానిస్తున్నట్టే
వుంటుంది. లక్ష్మణ్ ఖిలా అనే భవనం లక్ష్మణుని కోటగా పిలవబడినా
అలాగ కనిపించదు.
చిన్న గుహలా ఈ ప్రదేశంలో
లక్ష్మణుడు కనిపించడు.
కాని ఆక్కడ దైవీకమైన ప్రశాంతత కనిపిస్తుంది.
సరయూ స్నాన ఘట్టం:
ఈ స్నాన ఘట్టంలో
రాముడు అతని సోదరులు
బాల్యంలో నిత్యమూ నిత్యానుష్టాలనాచరించి
ధ్యానంచేసుకునేవారట.
స్వర్గతారా అనేది సరయూనదికి మరో
స్నాన ఘట్టం. ఇక్కడే
శీరాముడు తన అవతారసమాప్తి కావించిన తీర్థస్థలంగా భావిస్తారు.
అయోధ్యలోని
రాముని ఆలయంలో
ఆయన పుట్టినరోజు రావడానికి 15 రోజుల ముందునుండే ఉత్సవాలు
ఆరంభమౌతాయి.
భక్తులు నిత్యం
రామ భజనలతో రాముని స్తుతిస్తారు. తులసీదాసు
యొక్క రామచరిత మానస్
ప్రవచనాలుగా చెప్పబడతాయి.
వేద మంత్రాలతో యాగాలు జరుపుతారు. స్త్రీలు రాముని
బాలరామునిగా అలంకరించి
ఉయ్యాలలో పరుండబెట్టి
జోలపాటలు పాడుతారు.
నిత్యం రాముని సన్నిధిలో
హరతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రి
అయోధ్యానగరమంతా
టపాకాయల వెలుగులతో
వెలిగి పోతుంది.
శ్రీ రామ నవమి రోజున
రాముని పాద ముద్రలు పడిన అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన జీవితంలో ప్రశాంతత సర్వ
శుభాలు లభిస్తాయని
భక్తులు ధృఢంగా నమ్ముతారు....స్వస్థి.
1 comment:
thanks for sharing
Post a Comment