Adsense

Wednesday, June 15, 2022

శ్రీ శ్యామ్ బాబా మందిర్, కాచిగూడ, హైదరాబాద్


💠 ఆలయ పురాణం :
భీమసేనుని మనుమడు బర్భరికుడు 
ఘటోత్కచుడు మౌర్విల కుమారుడు.
బర్బరికుడు తన తల్లి మోర్వి నుండి యుద్ధ కళను నేర్చుకున్నాడు. దివ్యాస్త్రాల కోసం పరమేశ్వరుడుని కోసం తప్పసు చేసి మూడు శక్తివంతమైన బాణాలను పొందాడు.

💠 బర్బరికుడు యుద్ధవిద్యలో మంచి నైపుణ్యం గల నిపుణుడు .
ఒకే సారి 3 బాణములు శత్రువులపైనా సంధించగల మహా విలుకాడు. 
ఈయన తప్ప భారతంలో మరెవరికీ సాధ్యం కానీ విద్య ఇది .

💠 బర్బరీకుడు తన గురువు అయిన తల్లితో గురుదక్షిణ కోసం అడుగుతూ అన్నాడట ... "అమ్మా...  యుద్ధమంటూ వస్తే నేను ఎవరి పక్షాన నిలవాలి తల్లి అని.
" ఏ పక్షం అయితే బలహీనంగా ఉంటుందో ముందే గ్రహించి వారి పక్షాన నిలవడమే ధర్మం అని చెప్పి ...అలా నువ్వు బలహీన పక్షం తరుపున సాయంగా  యుద్ధం చేయడమే నాకు గురుదక్షిణ అని చెప్పింది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయల్దేరతాడు బర్బరీకుడు.

💠 కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా శ్రీ  కృష్ణ పరమాత్మ అందరిముందు ఓ ప్రశ్న వేశారు.
యుద్ధo ఎన్ని రోజులలో పూర్తి చెయ్యగలరు అని ..
దీనికి సమాధానముగా భీష్ముడు 20, ద్రోణాచార్యుడు 25,కర్ణుడు 24,అర్జునుడు 28 రోజులని కృష్ణుడికి సెలవిచ్చారట !

💠 బర్బరీకుడు మాత్రం అన్నిరోజులు అవసరం లేదు.
నా త్రిషరాఘాత సంధానంతో కేవలం ఒకే ఒక్క ఘడియలో శత్రుసంహారం, దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయగలను అని చెప్పాడట

💠 బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు.
‘3 బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు.
‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు.‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ని శక్తి నిరూపించు అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు.

💠 కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద ఆకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.
‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు.

💠 ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధ రంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. 

💠 బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో... నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని విశదపరుస్తాడు. 
శ్రీ కృష్ణుడు మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి శ్రీ కృష్ణుడు ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉందనీ, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వ’మని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని...అతనే పరమాత్మ అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారుమాటాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందనీ, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.

💠 యుద్ధం తరువాత బర్బరీకుడు శ్రీ కృష్ణ పరమాత్మను " నా చరిత్ర మరియు నన్ను నీలో ఐక్యం చేసుకోవాల్సింది "అని శ్రీకృష్ణ పరమాత్మను వరం కోరుకున్నాడు. కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే( శ్యామ్ బాబా )  పూజలందుకుంటాడనీ, అతడ్ని తల్చుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయనీ వరమిస్తాడు శ్రీ కృష్ణుడు. 

💠 కలియుగంలో బర్బరికుడు తల రాజస్థాన్‌లోని ఖతు ఖటాంక్  గ్రామంలో దొరికిందని చరిత్ర. తర్వాత క్రీ.శ.1027లో అప్పటి రాజు రూప్‌సింగ్ చౌహాన్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఖతు శ్యామ్ దేవాలయం రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలోని ఖాటులో ఉంది. కాచిగూడలోని శ్యామ్‌జీ ఆలయానికి ఈ అసలు ఆలయమే ప్రేరణ.
 
💠 ఇకడి ఈ ఆలయాన్ని 1996 ఏప్రిల్ నెల 22 తేదీన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి మరియు శ్రీ అనంత సరస్వతి స్వామి ప్రారంభించారు.

No comments: