👉శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి
ఆలయం : రాచురు.
🌀 1. నల్లూరు - శ్రీ లక్ష్మీనారాయణ స్వామి
💠 గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, రేపల్లె కు ఆగ్నేయం దిశగా, సుమారు 8 కీ.మీ దూరంలో నల్లూరు గ్రామం ఉంది.
నల్లూరు (నార్త్) గ్రామపంచాయితీ కార్యాలయం నకు సమీపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం తూర్ప అభిముఖంగా కలదు.
💠 ఇది పంచ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో ఒకటిగా ప్రతీతి.
ఆలయం చాల ప్రాచీనమైనది.
విశాలమైన ఆలయ ప్రాంగణములో ప్రధానాలయం ముఖ మండపం, గర్భాలయం కలిగి యున్నది.
💠 గర్భాలయం నందు స్వామి చతుర్భుజుడు. వామభాగాన లక్ష్మీదేవి కొలువుదీరింది.
ముందు భాగంలో శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ మూర్తులు మరియు చక్రాత్తాళ్వార్, అనంతుడు మొదలగు దేవత మూర్తులు కలరు. ముఖమండపం నందు ఆండాళ్, వైఖాన స్వామి సన్నిధులున్నాయి. దేవేరి సువర్చల సమేత ఆంజనేయ స్వామి పీఠం ఉంది.
💠 శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కి నిత్యం అర్చనలు జరుగుతాయి. చైత్ర శుద్ధ చతుర్ధశి నాడు కళ్యాణం నిర్వహించుతారు.
💠 హౌరా - చెన్నై రైలు మార్గములో తెనాలి రైల్వే జంక్షన్ ఉంది. తెనాలి నుంచి రేపల్లె కు 34 కీ.మీ బ్రాంచి రైలు మార్గం & రైలు సర్వీసులున్నాయి. గుంటూరు నుంచి రేపల్లె కు బస్సులు కలవు. మచీలిపట్టణం నుంచి (వయా) చల్లపల్లి మీదగా రేపల్లె కు బస్సులు కలవు.
🌀 2.రాచురు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం :
💠 గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం, పల్లెకోన గ్రామమునకు సుమారు 3 కిమీ దూరాన, పశ్చిమదిశగా రాచూరు గ్రామం కలదు. ఇచ్చట జమీందారుల యొక్క శిథిలమవుతున్న కోట ఒకటి ఉంది.
కోటకు ఉత్తరదిశన జీర్ణావస్థలో ఉన్న ఆలయంను చూడగలము.
ఇది జగత్ప్రసిద్ధాలు చెందిన పంచ లక్ష్మీనారాయణ ఆలయాలలో ఒకటి.
ఆలయం చాలా పురాతనమైనది.
💠 గర్భాలయంనందలి శ్రీ లక్ష్మీనారాయణుడు చతుర్భుజుడు. స్వామి వామభాగాన లక్ష్మీదేవిని దర్శించగలము.
శాలగ్రామ మూలవిరాట్టు బహుసుందరం.
💠 స్వామికి నిత్య ధూప-దీప-నైవేద్యములు జరుగుతాయి. కార్తీకమాసం, తొలిఏకాదశి, వైకుంఠ ఏకాదశి మొదలగు పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు చాలా కాలమునుంచి నిల్చిపోయినాయి.
💠 నాలుగు సంవత్సరములకు పూర్వం రాచూరు వంశీయులు జ్యేష్టామాస పౌర్ణమికి శాంతికళ్యాణం జరిపించినారు అని ఆలయ అర్చకులు తెలియజేసినారు. మూడు కుటుంబములకు చెందిన అర్చకులు, ప్రతి నాలుగు నెలల కొకరుగా (వంతులు వారీగా) స్వామికి కైంకర్యార్చనలు గావించుదురు. ఇంతకాలము నిధుల కొరత వలన శిథిలావస్థకు చేరుకున్న ఆలయ పునర్నిర్మాణము జరగలేదు. ప్రభుత్వ సహకారముతో నూతన ఆలయనిర్మాణం వికృతి నామ సంవత్సరం (2010), వైశాఖమాసం నుంచి ప్రారంభమవుతుంది.
💠 ఆలయ దర్శనము ఉదయం 6 నుంచి 8 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు మాత్రమే లభ్యమవుతుంది.
💠 తెనాలి-రేపల్లె బ్రాంచి రైలుమార్గంనందు పల్లెకోన అను రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి రాచూరు గ్రామమునకు రిక్షాలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 4 కి||మీగా ఉంటుంది. భట్టిప్రోలు-రేపల్లె రోడ్డుమార్గం నందు పల్లెకోన సెంటర్ వస్తుంది. రాను-పోను రిక్షా సర్వీసులు ఏర్పాటు సౌఖ్యముగా ఉంటుంది. భట్టిప్రోలు - గుంటూరు, చీరాల, అవనిగడ్డ బస్సర్వీసులు (వయా) భట్టిప్రోలు, పల్లెకోన మీదగా రేపల్లె మధ్య షేరింగు ఆటోసర్వీసులు ప్రతి 15 నిముషములకు దొరుకుతాయి. ఉంటాయి.
No comments:
Post a Comment