Adsense

Wednesday, June 15, 2022

శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవాలయం : పెద్దాపురం (తూర్పుగోదావరి)


💠 గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత.

💠 దేశంలో గ్రామదేవతలుగా వెలసిన 108 మంది సోదరీమణులలో తూర్పుగోదావరి జిల్లా చారిత్రక పట్టణం పెద్దాపురంలో వెలసి సుప్రసిద్ధమైనదిగా పేరొందిన   "శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవాలయం" ఒకటి.

💠 తూ.గో జిల్లా, పెద్దాపురం పట్టణంలో వెలిసిన శ్రీ మరిడమ్మ అమ్మవారు  కోరిన కోరికలుతీర్చే  చల్లనితల్లి. 

💠 ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనా ఈ తల్లిని దర్శించుకొని మొక్కుకొంటే నయమవుతాయని పూజ్యగురువులు శ్రీ చాగంటి గారు ప్రవచనాలలో తెలియజేయడం జరిగింది.

💠 శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం సుప్రసిద్ధమై మహిమాన్వితమై ప్రాముఖ్యత వహించిన దేవస్థానం . 
 
💠 కమ్మవారి ఆడపచుచు సతీసహగము కారణమున 17వ శతాబ్దం చివరి కాలమున పెద్దాపురంలోని 'మనోజి చెరువు' సమీపమునం! గ్రామ దేవతగా వెలిసినది.

💠 ఆ కాలంలో ఈ చెరువు చుట్టుప్రక్కల ప్రదేశము చిట్టడవిగా ఉండేడిది. ఒకసారి మన్యo నుండి పశువులను తోలుకొని వచ్చు పశువుల కాపరులతో కాలినడకన వచ్చిన పదహారేండ్ల యువ మనోజీ చెరువు ప్రాంతమునకు రాగానే వారితో “నేను చింతపల్లి వారి ఆడపడుచును, నేను ఇచ్చట ఉన్నానని మా వారికి తెలుపుము' అని పలికి అంతర్థానమయ్యింది.

💠 ఈ వింత సంఘటనను కాపరుల చింతపల్లి గ్రామంలోని వారందరికీ చెప్పిరి. ఆ రాత్రి వారికి పసుపు పూసిన ఒక కర్ర కనిపించింది దానిని తీసుకునే అక్కడే ఒక తాటాకు పాకవేసి అక్కడ ప్రతిష్ఠ చేసి, ధూప, దీప నైవేద్యములు పెడుతూ ఆరాధించసాగారు.
ఆ చుట్టుప్రక్కల గ్రామప్రజలు కూడా వచ్చి అమ్మవారిని ఆరాధించసాగారు. మహమ్మారి కలరా జాడ్యము నుండి రక్షించు దేవతగా ఈ అమ్మవారిని మారమ్మగా పిలిచెడి వారు. కాలక్రమమున 'మరిడమ్మ' గా పేరుగాంచెను. 

💠 ఆషాఢమాసంలో వచ్చు కలరా జాడ్యము నుండి ప్రజలు రక్షింపబడుటచే ప్రజలు ఆషాఢమాసమునందు అమ్మవారికి పూజలు, జాతరులు, తిరునాళ్లు చేయు ఆచారం వచ్చింది. 
ఇటీవలి కాలంలో ఆలయం ఆధునాతనంగా తీర్చిదిద్దబడి, నిత్య వేద పఠనాదులతో అమ్మవారి - సశాస్త్రీయమైన పూజాది కార్యక్రమములతో నిత్య యాత్రాస్థలముగా రూపొందించబడి -- ప్రకాశించుచున్నది.

💠 పెద్దాపురం మరిడమ్మ జాతర జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసం లోని అమావాస్య వరకూ ముప్పై ఒక్క రోజులు జరుగుతుంది

💠 జాతరలో భాగంగా…… సరిగ్గా బహులైక జేష్ఠ అమావాస్యకు పక్షం (పదిహేను రోజులు) ముందు అమ్మ వారికి ఉయ్యాల తాడిని వేస్తారు....
జాతర రోజు నుండి జాతర ముగిసే వరకూ అమ్మవారు మరియు ఆమె ఆడపడుచు లు అక్క చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తుల విశ్వాసం….

💠 ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి వారి పొలాల గట్లమీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడాని కి ఎగబడతారు .
అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవలసి వుంటుంది....

💠 ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మంది కి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మ్రోగుతుంటే ఆ తదుపరి గరగలు నడుస్తూ వుంటే దారిపొడవునా గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడిలకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటముందు మీదుగా గుడివద్దకు సాగనంపుతారు.

💠 ఈ విధంగా మొదలైన జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది.
 ఈ జాతర లో జ్యేష్ఠ అమావాస్య రోజున అర్ధ రాత్రి అమ్మవారికి ఎన్నుపోతు బలి ఇస్తారు మరునాడు బద్దికడుగు మహోత్సవం జరుగుతుంది.

💠 ఈ అమ్మవారు ఒక్క పెద్దాపురం గ్రామమే కాక చుట్టుపక్కల చాలా గ్రామాలకు గ్రామదేవత గా ప్రసిద్ధి చెందింది. 
చల్లని తల్లి కరుణా కటాక్షాలు మనందరి పై ఉండాలని కోరుకుందాం...

No comments: