" పాండురంగా నామం పరమ పుణ్య ధామం “
💠 శ్రీ పాండురంగడు, దయా సముద్రుడు, భక్తుల పాలిట కల్పతరువు.
ఆ పవిత్రమూర్తి కొన్ని వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని ముచుకుంద నదీతీరమున (మూసి నది) ఉస్మాన్ షాహి (విఠల్ నగర్)లో వెలిశాడు.
ఆ రోజుల్లో హైదరాబాద్ నగరం చుట్టూ చెట్లు ,గుట్టలుతో ఒక అడవిలో ఉండేది అందుకే ఈ దేవాలయానికి జంగల్ విటోభ దేవాలయం అని పేరు వచ్చింది అని చెబుతారు .
💠 ఈ దేవాలయమును కీ. శే. గున్నాజీ నాదస్వర వాదకుడు అనే భక్తుడు కట్టించెను. ఈ గున్నాజీ పరమ పాండురంగని భక్తుడు. అతనే సర్వమని భక్తిభావముతో తన్మయత్వం చెందిన మనిషి, అతడు అందజేసిన ఈ భక్తి భావన మందిర ప్రాంతములో స్పష్టంగా కనబడుచున్నది.
💠 ఈ దేవాలయం అతి పవిత్రమైనది.
ఆయన లీలలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
ఈ దేవాలయమునకు "సయ్యద్ “హుస్సేన్ ఖాన్ బహదూర్' అనే ముస్లిం మందిర నిర్మాణమునకు భూమిని ఇచ్చెను.
సయ్యద్ కి పురుష సంతానం లేరు కనుక
ఈ విషయం శ్రీ గున్నాజీ మహరాజ్ కి విన్నవించెను.
విఠలేశ్వరుని అనుగ్రహ కటాక్షము వలన సయ్యద కు పుత్రసంతానం కలిగెను.
💠 సయ్యద్ సంతోషంచేత విఠలేశ్వరుని ఆలయ నిర్మాణం కొరకు భూమిని ఇచ్చెను. ఈ దేవాలయం 200 సంవత్సరాల క్రితం నిర్మితమైంది.
💠 శ్రీ పాండురంగని దేవాలయము, ఆంజనేయస్వామి నవగ్రహ, శివపార్వతుల ప్రతిష్ఠ కూడా అదే సమయంలో జరిగింది.
ఈ పుణ్యక్షేత్రంలో రుక్మిణీ, పాండురంగని దర్శనం కొరకు శ్రీ మాణిక్య ప్రభు సంస్థాన పీఠాధిపతి సంత్ శ్రీ శ్రేష్ఠ మనోహర ప్రభువు లాంటి ఎందరో మహానుభావులు ఈ ఆలయమును దర్శించెను.
💠 1908 సంవత్సరంలో ముచుకుందా( మూసీ) నది ఉప్పొంగి భయంకర ప్రవాహంతో దేవాలయ స్థితిగతులను చిన్నాభిన్నం చేసింది.
ఈ సమయమున అనేక వేల మంది దేవాలయము పైకి ఎక్కి తమ ప్రాణములను రక్షించుకున్నారు. తర్వాత 2003 సంవత్సరములో భక్తుల సహాయ సహాకారములతో ఆలయ పునః నిర్మాణం గావించబడినది.
💠 వేదశాస్త్ర సంపన్నులు, వంశపారంపర్య అర్చకులు అయిన గోవింద మహరాజ్ వారి ఆధ్వర్యంలో పూజా కారక్రమములు చేయుచున్నారు.
విఠలేశ్వర బాలభక్త సమాజం ఏర్పాటు చేసి భక్తులు భజనలు, కీర్తనలు చేయుచున్నారు.
💠 ఉత్సవాలు - పండుగలు :
అషాడ శుద్ధ దశమి మొదలుకొని ఆషాడ బహుళ తదియ వరకు ఉత్సవములు జరుగును.
ఆషాఢ ఏకాదశి రోజున రథోత్సవము జరుగును.
💠 కార్తీక మాసంలో హారతి కార్యక్రమంలో భాగంగా పౌర్ణిమ రోజున 108 సత్యనారాయణ వ్రతములు జరుగును. హనుమాన్ జయంతి, మహాశివరాత్రి, దత్తజయంతి, శరన్నవరాత్రులు వైభవంగా జరుగును.
No comments:
Post a Comment