Adsense

Wednesday, June 15, 2022

ఆత్రిముని ప్రతిష్టిత శ్రీ సంగమేశ్వరాలయం –జాగర్ల మూడి (గుంటూరు)

 

💠 గుంటూరు జిల్లాలోని తెనాలి మండల కేంద్రం లో గల సంగం జాగర్లమూడి లో వెలసిన  పురాతనమైన దేవాలయం సంగమేశ్వర స్వామి దేవాలయం.


💠 జాగర్లమూడి సంగమేశ్వర దేవాలయం చాలా పురాతనమైంది.

💠 సంగమేశ్వర దేవాలయం చుట్టూ సువిశాలమైన ఆవరణ ఉంది. 
ఈ చారిత్రక దేవాలయం విశిష్టంగా ఉంటుంది. ఒక పక్కన ప్రాచీనతను ప్రతిబింబిస్తూ మరో పక్కన అపురూపమైన శాంతి నిలయంలో ప్రవేశించిన భావనను మనసులో నింపుతుంది.

💠 ఆలయ ప్రాంగణంలో నుండి దేవాలయంలోకి దారి తీస్తే, ముందుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. తూర్పుముఖంగా ఉన్న ఆలయ గర్భగుడిలో సంగమేశ్వరుడు ఉండగా, కుడివైపున విఘ్నేశ్వరుడు, ఎడమవైపున కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తారు.

💠 గుడి ప్రాంగణంలో తూర్పు దిక్కున ప్రాకారానికి దగ్గర్లో పెద్ద సత్రం, ఆఫీసు ఉన్నాయి. 
ఉత్తర దిక్కున నాగ ప్రతిమలు, కాలభైరవుని విగ్రహం, యజ్ఞశాల ఉన్నాయి. దక్షిణ దిక్కులో కళ్యాణ మండపం, వీరభద్రేశ్వరాలయం, పార్వతీదేవి ఆలయం, పాప వినాశాకేశ్వరాలయం, నవగ్రహాలు కనిపిస్తాయి. ఇంకా ఈ గుడిలో అనేక చెట్లు, పాకశాల మొదలైనవి ఉన్నాయి.

💠 దాదాపు మన ప్రాచీన దేవాలయాలన్నీ దేవుడు ఆ ప్రాంతీయులు ఎవరి కలలోనయినా కనిపించి ఫలానా ప్రదేశంలో తనకు ఒక ఆలయం కట్టించమని చెప్పి కట్టించుకున్నవే. కొన్ని మాత్రం పూర్వం మహర్షులు తపస్సు చేసిన పుణ్యభూమిలో కట్టినవి.

💠 గుంటూరు జిల్లా జాగర్లమూడి సంగమేశ్వర దేవాలయం కొలువైన ప్రదేశంలో అత్రి మహర్షి సుదీర్ఘ కాలంపాటు తపస్సు చేశాడట. 
తర్వాత ఆ పుణ్యభూమిలో సంగమేశ్వర స్వామికోసం ఆలయం కట్టించాడట.

💠 అత్రి మహాముని కట్టించిన దేవాలయం శిథిలావస్థకు చేరగా, 17వ శతాబ్దం నాటి వెలమ రాజులు ఈ సంగమేశ్వర దేవాలయాన్ని పునర్నిర్మించారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.



🙏ఓం నమః శివాయ 🙏

No comments: