Adsense

Friday, June 17, 2022

గాయత్రీ మాతకి మూడు సంధ్యలలో మూడు పేర్లు ఉన్నాయి...!

!


 🌿ప్రాతఃకాలం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి. ఒకే గాయత్రి మూడు నామములతో ఉన్నది. 

🌸సరస్వతి, సావిత్రి, గాయత్రి – ఈ మూడూ కూడా సృష్టి కారణమైన చైతన్య స్వరూపమైన జ్ఞాన రూపిణి అన్న అర్థాన్ని చెప్తున్నాయి. 

🌿అదేవిధంగా ఈ మూడు రూపాలకీ ‘బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ’  అని పేర్లు కూడా చెప్పబడుతున్నాయి.

 🌸అంటే త్రిమూర్త్యాత్మకమైన శక్తి. అంటే త్రిమూర్త్యాత్మకమై ముగురమ్మల ముగురయ్యల స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటిది గాయత్రి. 

ఈ గాయత్రి ‘త్రిపద’ అని ఋగ్యజుస్సామాత్మకంగా చెప్పబడుతూ ఉంటే ‘త్రిపుర’ అని లలితారాధనలో అదే చెప్తున్నాం. 

🌿ఈ విశ్వమంతా ‘త్రి’ అన్న తత్త్వంతోనే ఉన్నది. భూతభవిష్యత్వర్తమాన కాలములు, ముల్లోకాలు, సత్త్వరజస్తమోగుణములు, సృష్టి స్థితి లయలు, 

🌸అన్నీ మూడింటితోనే చెప్పబడుతున్నాయి. ఈ మూడింటితో ఉన్న విశ్వమంతా వ్యాపించిన శక్తి గనుక ఆ తల్లి ‘త్రిపదా గాయత్రి’ అని చెప్పబడుతున్నది. 

🌿అలాంటి గాయత్రీ ఆరాధనలో 24అక్షరములూ కూడా 24 తత్త్వములకు సంకేంతంగా కూడా భావన చేశారు. 

🌸అయితే ఈ 24తత్త్వాలతోనే విశ్వమంతా ఉన్నది. అందుకే పంచముఖాలలో కూడా విశ్వ తత్త్వమే చెప్పబడుతున్నది.

🌿 అక్షరములుగా 24 సంఖ్యలలో ఉన్నాడని ప్రత్యేకత కూడా అదే. అంతేకాదు మన వెన్ను దండంలో ఉన్న పూసల సంఖ్య కూడా 24 యే.

🌸 అంటే ప్రాణశక్తి సంచరించేటటువంటి వెన్నుదండంలో ఉండేటటువంటి ఆ విభజన కూడా 24తోనే ఉన్నది. 

🌿అలాగే ఒక వీణలో మెట్లు 24 ఉంటాయి. ఇలా గమనించినట్లైతే ఆ ‘తత్త్వార్థ వర్ణాత్మికాం’ అని చెప్పినట్లుగా తత్త్వ సంఖ్యయైన 24 తో ఉన్నది.

 🌸‘పంచ కోశాంతర స్థితా’ అని ఈ తల్లిని భావన చేశారు. ఈ పంచకోశ మధ్యంలో ఉన్నటువంటి పరతత్త్వ స్వరూపిణిగా ఉన్నటువంటిది ఆ తల్లే అని తాత్త్వికమైన దర్శనం కూడా ఉంది.

 🌿ఇలా గాయత్రీ ఆరాధన వల్ల ప్రాణశక్తి ఆరాధన చెప్పబడుతూ ఉన్నది. ‘ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ’ అని వర్ణించిన ప్రకారం. ఈవిధంగా విద్యాధిదేవతగా గాయత్రీదేవిని ఆరాధించడం ఉంది..

No comments: