Adsense

Wednesday, June 15, 2022

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం & సాక్షి బావ నారాయణ స్వామి దేవాలయం : పొన్నూరు



💠 పూర్వము పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని "పొన్నూరు" 
 (పొన్ను+ఊరు) అని పిలవడం ప్రారంభించారు. 
తమిళంలో "పొన్ను" అంటే బంగారం అని అర్థం. పొన్ను + ఊరు, అంటే స్వర్ణపురి అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే నిలిచిపోయింది. I

👉 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయము : 

💠ఈ ఆలయం పొన్నూరు పట్టణము నందు కలదు. పొన్నూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఇచట ఎన్నో ప్రాచీన ఆలయాలు కలవు. వాటిలో వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయమొకటి. దీనిని పొన్నూరు ఆర్యవైశ్యులు క్రీ.శ. 1899లో నిర్మింపచేశారు.

💠 దేవతలు లోకకల్యాణం కోసం అవతారాలు ఎత్తుతారని పురాణాలూ చెబుతున్నాయి. అయితే ఇక్కడి ఆలయంలో మాత్రం ఒక కన్య పరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడి వైశ్యులకి కులదేవతగా మారింది.
 మరి ఈ వాసవీ అనే కన్య ఆ అవతారం వెనుక పురాణం ఏంటి ? 
ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

💠 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణం నందు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ఎన్నో ప్రాచీన ఆలయంలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయం పొన్నూరు ఆర్యవైశ్యులచే క్రీ.శ. 1899 లో నిర్మించబడింది.

💠 ఈ ఆలయ పురాణానికి వస్తే, పచ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామం కలదు. ఆ గ్రామంలో కుసుమ శ్రేష్టి కౌసుంబి అనే వైశ్య దంపతులుండేవారు.
 ఆ దంపతులకు వాసవీ అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, సౌదర్యవతి. అయితే ఆమెని విష్ణువర్డనుడను రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇదే విషయం ఆమె తల్లితండ్రులకి చెప్పగా వారు, మా కులమువారందరు అంగీకరించినచో ఆమెను తమకిచ్చుట అభ్యంతరము లేదని వారు రాజుకి తెలియచేసారు. కానీ వైశ్య కులస్థులు ఎవ్వరు అంగీకరించలేదు. 
అప్పుడు రాజుకి కోపం వచ్చి తన సైన్యంతో వారందరిపై దండెత్తి వచ్చాడు. రాజుని ఎదురించి పోరాడలేని వైశ్యులు అందరు కుసుమ శ్రేష్ఠితో కలసి అగ్నికి ఆహుతై తమ ప్రాణాలని వదిలారు.

💠అప్పుడు వాసవీ కన్య తన నిరసనను తెలియచేసి, అగ్నికాహుతైనది. ఆమెయే తరువాత పరమేశ్వరిగా అవతరించింది. 
ఈ పరమేశ్వరిని మిగిలిన వైశ్యులు తమ కులదేవతగా భావించి ఆరాధించసాగారు. తరువాత వైశ్యులు అధికంగా ఉన్న ప్రతిచోట ఆమె ఆలయాలు నిర్మించారు. ఈ విధంగా ఏర్పడిన ఆలయాలలో పొన్నూరులో ఏర్పడిన ఈ ఆలయం కూడా ఒకటి.

💠ఈ ఆలయంలో గర్భగృహమునందు వాసవీ కన్యకా పరమేశ్వరితో పాటు ఈశాన్యదిశ యందు వినాయక విగ్రహం కలదు.
ఇలా వెలసిన ఈ ఆలయంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజున గొప్ప ఉత్సవాలు జరుగును.

👉 2 .సాక్షి బావ నారాయణ స్వామి ఆలయం:  పొన్నూరు

💠 సాక్షి  భావనారాయణస్వామి దేవాలయం గుంటూరు జిల్లా,పొన్నూరు పట్టణం (30 km ) లో వెలసిన  అతి ప్రాచిన మహిమన్మితమైన, శక్తివంతమైన  క్షేత్రం ఇది. 
శ్రీ మహా విష్ణువు కాశి క్షేత్రం నుంచి ఇక్కడకి వచ్చి ఇక్కడ కోలువైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది . 

💠 ఆలయం లో బ్రహ్మ సరోవరం వెలసి ఉంది  ,ఇక్కడ బ్రహ్మ దేవుడు  గోస్టివనం లో తపస్సు చేసిన సమయం లో ఈ సరోవరం లో స్నానం చేసేవారు అని  పురాణాలు కథనాల ద్వార తెలుస్తుంది. 
స్వామి వారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడు  దర్శనం ఇస్తాడు . 
ఆలయానికి ప్రక్కనే చెన్నకేశవస్వామి ఆలయం కొలువై ఉంది . బ్రహ్మ ,విష్ణువు,శివ దేవతలు కొలువైన ప్రదేశం.  

💠 ఒక భక్తుడికి సాక్ష్యం చెప్పడానికి స్వామి వారు దివి  నుండి భువికి దిగి వచ్చి ఇక్కడ కొలువయ్యారు అని అందుకీ  ఈ క్షేత్రానికి సాక్షి భాయనారాయణ స్వామి ఆలయంగా పేరు వచ్చింది అని పురాణం గాథ . 

💠ఈ క్షేత్రం లో రాజ్యలక్ష్మి సమేత  భావనారాయణ స్వామి  విగ్రహాలు ,నరసింహ స్వామి ,ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి . 
ఈ ఆలయప్రాంగణమున ఉన్న ఇతర ఆలయాలు
1. శ్రీ రాజ్యలక్షీ అమ్మవారి ఆలయం.
2. శ్రీ కాశీవిశ్వేశ్వరాలయము.
3. శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయo.

💠 కాశి విశాలాక్షి దేవాలయం లో ప్రతి ఏట మహా శివరాత్రి పర్వదీనన  కల్యాణోత్సవం జరుగుతుంది . 

💠సాక్షి భావ నారాయణ స్వామి ఉత్సవాలు(తిరునాళ్ళు)  వైశాక మాసం లో కనుల పండుగ గ, శోబయమానంగా జరుగుతాయి . చూడడానికి ఎక్కడెక్కడో నుండి భక్తులు వస్తారు. 

💠స్వామి వారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడు దర్శనం ఇస్తాడు . ఆలయానికి ప్రక్కనే చెన్న కేశవా స్వామి ఆలయం కొలువై ఉంది . 
బ్రహ్మ ,విష్ణువు,శివ దేవతలు కొలువైన ప్రదేశము

No comments: