🔅 కోర్కెలు తీర్చే కోటిలింగేశ్వరుడు..!
💠 గోదారమ్మ పరవళ్ళ తో.... పచ్చటి పంట పొలాల అందాలతో... ప్రకృతి సౌందర్యానికి శాశ్వత చిరునామాగా భాసిల్లుతున్న రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక కేంద్రంగానూ పేరుగాంచింది.
ఆ గోదావరి జీవనది ఒడ్డున బోళా శంకరుడు భువనేశ్వరీ సమేతుడై కొలువైన క్షేత్రం ఉమాకోటిలింగేశ్వర ఆలయం.
సాక్షాత్తూ దేవతలే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారనీ , ఇక్కడి గోదావరిలో స్నానమాచరించి ఒడ్డునే ఉన్న ఉమాపతిని దర్శిస్తే కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
💠 పరమశివుడు భక్తవత్సలుడు.
దేవతలు కొలిచినా... దానవులు పూజించినా... ఇద్దరినీ సమాన దృష్టితో సమాదరించే విశిష్ట దైవంగా శివయ్యను పేర్కొంటారు.
రాక్షసులే శివలింగాలుగా మారి పూజలందుకుంటున్న క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉమాకోటిలింగేశ్వర ఆలయం.
💠 అఖండ గోదావరి ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం అటు ఆధ్యాత్మికతకూ ఇటు ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది.
🔔 స్థల పురాణం
💠 కుమార సంభవం జరుగుతున్న సమ యంలో శివుడు కొంతమంది దానవులను సంహరించే బాధ్యతను తీసుకున్నాడు. రాక్షసులతో యుద్ధం చేస్తుండగా పరమేశ్వరుడి శరీరం నుంచి కొన్ని చెమట బిందు వులు జారి వారి మీద పడ్డాయట. దీంతో వారి పాపాలు నశించి ఆ రాక్షసులంతా శివలింగాలుగా ఉద్భవించారు.
💠 ఈ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యపోయి, వాటన్నింటినీ ప్రతిష్ఠించాలని సంకల్పిస్తారు.
ఇందుకోసం గోదావరి జన్మస్థలమైన నాశికా త్రయంబకం నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క నదీతీరాన ఒక్కో కోటిలింగాల రేవును ఏర్పాటుచేస్తూ రాజమహేంద్రవరం చేరు కుంటారు.
ఇక్కడికి వచ్చేసరికి కోటి లింగాల్లో ఒక లింగం తక్కువైందట. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తీ కలిసి కాశీ క్షేత్రం నుంచి ఒక లింగాన్ని తీసుకొచ్చి మొత్తం కోటిలింగాలనూ వారే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారు.
ఈ క్షేత్రంలో కొలువైన స్వామికి కోటి లింగేశ్వరుడూ అని నామకరణం చేశారు.
💠 నాటి నుంచీ నేటి వరకూ ఈ ఆలయం నిత్యపూజలూ శివార్చనలతో అలరారుతోంది.
స్వామిని కాశీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా సీతా లక్ష్మణ సమేతంగా రామచంద్రమూర్తి కొలువై ఉన్నాడు.
ఆలయం వెలుపల ఉన్న హనుమంతుడిని ముందు దర్శించిన అనంతరం భక్తులు మూలవిరాట్టు దర్శనానికి వెళ్లడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.
💠 ఇక్కడ స్వామి వారికి నిత్య పూజలూ అభిషేకాలూ నిర్వహిస్తారు.
రోజూ ఉదయం అయిదున్నరకు తొలి అభిషేకం జరుగుతుంది. అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయంలో కొలువైన భువనేశ్వరి అమ్మవారికి నిత్యం కుంకుమార్చన జరిపిస్తారు.
అభీష్ట సిద్ధికోసం ప్రతి సోమవారం ఈ ఆలయంలోని శివయ్యకు ప్రదోషకాల రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు.
💠 దక్షిణకాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలూ, కార్తికమాస అభిషేకాలూ, మాసశివరాత్రి పూజలూ, దేవీనవరాత్రి ఉత్సవాలూ అంగరంగ వైభవంగా జరుగ ఇలా చేరుకోవచ్చు యి.
💠 అతి పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటిగా రాజమహేంద్రవరంలోని కోటిలింగేశ్వరస్వామి క్షేత్రం విరాజిల్లుతోంది. ఇక్కడ స్వామివారికి వైదిక స్మార్త ఆగమ సంప్రదాయాల్లో నిత్యపూజలు జరుగుతుంది.
💠 అఖండ గోదావరీ తీరాన వెలసిన కోటిలింగేశ్వరుడిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి.
దేశం నలుమూల నుంచీ రాజమహేంద్రవరానికి రైలు సదుపాయం ఉంది.
రైల్వే స్టేషన్ నుంచి సుమారు పదికిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోరిక్షాలు అందుబాటులో ఉంటాయి.
రోడ్డు మార్గంలో వచ్చే భక్తులు... రాజమండ్రి బస్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ప్రయివేటు వాహనాల్లో కోటిలింగాల రేవుకు చేరుకోవచ్చు.
No comments:
Post a Comment