Adsense

Wednesday, June 15, 2022

శ్రీ మల్లన్న దేవాలయం : సిరిచెల్మా (ఆదిలాబాద్)



🌀 భక్తుల కోసం గునపం పట్టిన మల్లన్న

🔅 ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం లో గ్రామ ప్రజల కష్టాలను చూడలేక స్వయంగా శంకరుడే ఒంటిచేత్తో రాత్రికిరాత్రే చెరువును తవ్వాడు. 

👉 ఎక్కడుంది : ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలో గల ఇచ్చోడ కు 15 కిలోమీటర్ల దూరం లో సిరిచెల్మ అనే గ్రామం లో ఉంది. 
ఆదిలాబాద్ నుంచి ఇచ్చోడ 32 కిలోమీటర్ల దూరం లో ఉంది.

🔅  స్థలపురాణం 🔅

👉 గారెలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న పిట్టయ్య, నిమ్మవ్వ అనే దంపతులకు సంతానం లేదు.. శివయ్య వారి దగ్గరకు వచ్చి అనాధ పిల్లవానిగా పరిచయం చేసుకున్నాడు. 
ఆ దంపతుల మనసు కరిగి శివయ్యకు మల్లన్న అని నామకరణం చేశారు.. అప్పటి నుంచి వారు పట్టిందల్లా బంగారమైంది.

👉 ఎన్నో ప్రత్యేకతలు :

👉 శివునికి ఎదురుగా రెండు నందులు దర్శనం ఇస్తాయి. ఆలయం వెలుపల 25 అడుగుల దూరం లో మరో నంది ఉంది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి ప్రయాణిస్తున్న సమయం లో బయట నంది మీద పడిన సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివునిపై ప్రతిబింబించడం షరేందత

👉 ఈ ఆలయం లో శివలింగం పైన ఎవరో లోపాలకి నొక్కినట్టు కొంత లోపలికి ఉంటుంది. రాత్రంతా తట్టలు తలపై వేస్కుని మట్టిని మోసినందుకు ఆ విధంగా ఉంటుంది అని స్థానికులు చెబుతారు.

👉 శ్రీకాళహస్తి ఆలయం లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఏడుతలల నాగుపాము దర్శనమిస్తుంది. శనిప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారు రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తే మంచిదని చెబుతారు. సప్తఋషుల తలపై నాగశేషుడితో ఉన్న శివుడి ప్రతిమ అలనాటి కళా ప్రతిభకు నిదర్శనం. ఆలయం లో ఉన్న ముద్దు గన్నేరు చెట్టు వయసు కూడా తెలియదు. ఇది పురాణకాలం నాటిదని చెబుతారు. సాధారణంగా శివాలయాల్లో అగ్నిగుండాలు నిర్వహించరు. ఇక్కడ మాత్రం భక్తులు నడిచే క్రతువు ఘనంగా జరుగుతుంది.

No comments: