👉 శివుడి అనుగ్రహంతో చిరంజీవి అయిన భక్తమార్కండేయుడి కథ తెలిసిందే. సారంగధరుడి గురించి కథలూ నాటకాలూ సినిమాల ద్వారా వినే ఉంటాం. ఆ రెండు కథలకూ పుట్టినిల్లు మన రాజమహేంద్రవరమేనని తెలుసా..!
👉రాజకీయ, ఆర్థిక, సాంఘిక, చారిత్రక, ప్రాముఖ్యత కలిగిన పట్టణం రాజమండ్రి. ఆధ్యాత్మిక ప్రాశస్త్యమూ చెప్పుకోదగిందే.
శ్రీ లలితాదేవి శ్రీ చక్రమధ్యగతమై దర్శనమిచ్చి ఇంద్రుడికి విజయాన్ని ప్రసాదించినట్టు చెప్పే కోటిలింగాల రేవు రాజమండ్రిలోనే ఉంది. అలాగే ఈ పట్టణంలో ఉన్న మరో రెండు పుణ్యధామాలు... ఉమామార్కండేశ్వరస్వామి ఆలయం, సారంగధరేశ్వరాలయం.
🔅 సారంగధర దేవాలయం 🔅
👉సారంగధరుని కథను ఆధునికులు పుక్కిటి పురాణంగా కొట్టి పారేస్తుంటారు. కానీ రాజమహేంద్రిలో అది నిజంగానే జరిగిందని స్థానికుల విశ్వాసం. అందుకే రాజరాజ నరేంద్రుడు సారంగధరునికి శిక్ష విధించిన ప్రదేశాన్ని 'సారంగధరమెట్ట'గానూ అతడు పూజించిన శివలింగాన్ని సారంగధరేశ్వరుడు గానూ వ్యవహరిస్తున్నారు.
🔅 స్థల పురాణం 🔅
👉తూర్పు చాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు.
అతని కుమారుడు సారంగధరుడు.
సకల విద్యాపారంగతుడు, అందంలో మన్మథుడు, రాజరాజనరేంద్రుని రెండో భార్య చిత్రాంగి. ఆమె అపురూప లావణ్యరాశి.
👉ఒకనాడు అనుకోకుండా సారంగధరుని చూసిన చిత్రాంగి అతని అందానికి ముగ్ధురాలై మోహం పెంచుకుంది.
ఒకరోజు చిత్రాంగి సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది, తన కోరిక తీర్చమని కోరగా... 'నీవు నాకు తల్లితో సమానం' అంటూ సారంగధరుడు తిరస్కరించి, వేటపై ఆసక్తి ఉన్న సారంగధరుడు విందుకు రాకుండా వేటకు వెళ్తాడు
అది అవమానంగా భావించిన చిత్రాంగి సారంగధరుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని రాజరాజనరేంద్రునికి లేనిపోని మాటలు చెప్పిందట.
👉ఆమె మాటలు నమ్మిన రాజు కన్నకొడుకు అనే విచక్షణ కూడా, లేకుండా సారంగధరుని కాళ్ళు, చేతులు నరికించండి అని ఆజ్ఞ వేసాడు.
సేవకులు రాజాజ్ఞ పరిపాలించి సారంగధారుడిని నగరానికి ఉత్తర దిశలో అడవులతో నిండిన ఒక ఎత్తైన పర్వతం మీద రెండు చేతులు రెండు కాళ్ళు ఖండించి పాడవేస్తారు.
👉సారంగధారుడు రెండు చేతులు కాళ్ళ నుండి నెత్తురు పారుతూ ఉండగా సారంగధారుడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు సారంగ ధారుడికి ఆకాశవాణి ద్వారా పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల ఈ శిక్షని అనుభవించవలసి వచ్చిందని, ఈ జన్మలో పాపం ఏమి చెయ్యలేదని చెబుతుంది.
👉ఆ ఆర్తనాధం విన్న అటుగా వెళ్తున్న మీననాథుడనే అనే శివ భక్తుడు అక్కడకు వచ్చి సారంగధారుడికి సపర్యలు చేసి, శివుడిని ప్రార్థించమని సలహా చెబుతాడు. సారంగధారుడు మేఘనాధుడి సూచన ప్రకారం శివుడి ఆరాధిస్తే శివుడు ఆ ప్రార్థనతో సంతృప్తి చెంది పరమేశ్వరుడు సారంగధారుడికి తన పూర్వపు చేతులు, కాళ్ళు, మంచి అందమయిన శరీరాన్ని ప్రసాదిస్తాడు.
👉సారంగధరుడు శివుడి అనుగ్రహంతో పునర్జన్మ పొందిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశం పేరే సారంగధార మెట్ట, ఈ దేవాలయంలో నున్న దేవుడు సారంగధేశ్వరుడు.
👉అనంతర కాలంలో సారంగధరుడు మీననాథుని సారధ్యంలో సన్యాసం స్వీకరించి అదే ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ జీవించాడట. అప్పట్లో అతడు ప్రతిష్ఠించిన శివలింగాన్నే సారంగధరేశ్వరుడుగా భక్తులు పూజిస్తున్నారని స్థలపురాణం. .
👉1976లో భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. సారంగధరేశ్వరుడితో పాటు బాలాత్రిపుర సుందరి, లక్ష్మీగణపతి ఈ గుడిలో పూజలందుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం సంక్రాంతి పర్వదినాల్లో కనుమనాడు ఇక్కడ జాతర జరుగుతుంది. అప్పట్లో చిత్రాంగి నివసించిందని చెప్పే భవనాన్ని (చిత్రాంగి అతిథిగృహం) నేటికీ ఈ ప్రాంతంలో చూడొచ్చు.
👉 సారంగధీశ్వర దేవాలయం రాజమండ్రి నగరం నుండి కోరుకొండ వైపు వెళ్ళే కోరుకొండ రోడ్డు వెళ్తేవచ్చే సారంగధార మెట్టపై నున్నది.
No comments:
Post a Comment