శ్రీ నూకాలమ్మవారి ఆలయం : కాండ్రకోట (తూర్పుగోదావరి)
💠 పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడల మీదుగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరం దారి పొడవునా రోడ్దుకిరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు..... వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, రవాణాకి వాడుతున్న ఎద్దుల బండ్లు.
ఊరి మద్యలో రామాలయం - రామకోవెల (రాంకోలు) మీద అష్టా చమ్మా ఆడుతూ పిల్లలు ... దృశ్య శ్రవణ యంత్రం (టెలివిజన్ - టివి ) వీక్షిస్తున్న వృద్దులు, పెద్దలు... ఊరంతా కల్మషం లేని మనుసులు.
ఆ మనుషులని కంటికి రెప్ప లా కాపాడే నూకాలమ్మ అమ్మవారు) వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోట ని కన్నులారా చూడవలసిందే ....................
💠 పెద్దాపురం నుంచి 10 కిమీ దూరంలో నూకాలమ్మ వారి ఆలయం కలదు.
పెద్దాపురం మరిడమ్మ , కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి విగ్రహాలు చాల పెద్దవి . దగ్గరకు వెళ్లి చూస్తుంటే మనకు తెలియకుండానే నమస్కరిస్తాము అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించిన అనుభూతి మనకు కలుగుతుంది. కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది .
💠 పూర్వం కిమ్మీరాసురుడు అనేవాడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయడం కోసం వచ్చాడు.
తరువాత కాలంలో కాండ్రుడు అనే రాయి పరిపాలించడం వల్ల క్రాండ్రకోట అని పేరు వచ్చింది.కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడు. అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారు.
అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధంలో ఓడిపోయారు.
💠 ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తిని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడు.
ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపింది.
అమ్మవారి అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు.
💠 ఆ ఆది పరాశక్తి నూకాలమ్మ అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరనిది.
💠 ఫాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు
💠 మనం కాండ్రకోట నుంచి తొలి తిరుపతి 5 కిమీ దూరం లో ఉంది .
No comments:
Post a Comment