Adsense

Wednesday, June 15, 2022

1. శ్రీ గోలింగేశ్వరస్వామి దేవాలయము; 2. ఏకశిలా లక్ష్మీగణపతి ఆలయం : బిక్కవోలు (తూర్పుగోదావరి)




💠 బిరుదంకితుడనే పేరు గల రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. 
అతని పేరు మీదే ఈ ప్రాంతాన్ని బిరుదాంకితవోలుగా, కాలక్రమేనా బిక్కవోలు గా పిలువబడుతున్నది.
బిక్కవోలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. గోదావరి నది పరవళ్ళు తొక్కే తూర్పు గోదావరి జిల్లలో పచ్చని పంటపొలాలతో ఈ ప్రాంతం అలరారుతున్నది.

💠 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుండి  39 కి మీ దూరం లో ఉన్న బిక్కవోలు గ్రామం లో వెలసిన గోలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది . చాళుక్యుల కాలమా లో నిర్మించిన ఈ దేవాలయం లో  శివుడు వెలసిన క్షేత్రం ఇది. ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. 
 
💠 బిరుదాంకుడు అనే రాజు కానేటి కోటలో వుండి ఈ ప్రాంతాన్నంతా పరిపాలించేవాడు. 
ప్రస్తుతం ఈ కోట పూర్తిగా శిథిలమై పోయింది. ఇప్పుడు మిగిలివున్నది ఆ కోటలోని మహాలక్ష్మి అమ్మవారి గుడి మాత్రమే ఉంది. బిరుదాంక మహారాజు పాలనలో బిరుదాంకపురం బిక్కవోలులో 118 దేవాలయములు నిర్మించి 118 చెరువులు త్రవ్వించాడు. 

🔅వీటిలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.
👉 శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం.
👉శ్రీ కుమార సుబ్రమజ్యేశ్వరస్వామి ఆలయం.
👉శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం.
👉శ్రీ ఏకశిలా విఘ్నేశ్వర ఆలయాలు.


⚜ 1. శ్రీ గోలింగేశ్వరస్వామి దేవాలయం చరిత్ర :

💠శ్రీ గోలింగేశ్వరస్వామి మొదట బిరుదాంకపురంలో మంద బయలు భూమిలో కప్పబడి వుండేది.
 గ్రామంలో ఉన్న ఓ రైతు యొక్క ఆవు ప్రతి నిత్యం తన పాలు ఈ లింగాకారం వున్న ప్రదేశంలో కార్చి వెళ్ళిపోయేది. 
గ్రామస్థులు అంతా ఆ రైతు కలిసి 
పాలు మడుగుకట్టిన భూమిలోపల ఏ దేవుడో, దేవతో ఉండవచ్చని భావించి గ్రామస్తులంతా మంచి ముహూర్తంలో అక్కడ త్రవ్వారు. అక్కడ పానవట్టంతో సహా లింగం బయటపడింది.

💠 బిరుదాంక మహారాజు గుడి కట్టించడానికి ముందుకొచ్చి పునాదులు త్రవ్వుతుంటే ఆ పునాదుల్లో పుట్టబయలుదేరింది. 
ఆ పుట్టను అలాగే వుంచి తిరిగి పునాదులు త్రవ్వుతుండగా కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. మొదట బయల్పడిన లింగంనకు శ్రీ గోలింగేశ్వర స్వామి అని పిలిచారు. 

💠 భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి స్వయంభూ విగ్రహాలు రెండుచోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి దక్షిణ దేశంలోని 'ఫలణి'లోను రెండవది బిరుదాంకపురంలో వెలిశారు

⚜ 2 . లక్ష్మీ గణపతి స్వయంభూ ఆలయం : 

💠 రామాలయం లేని గ్రామము ఉండదని నానుడి. ఆచరణలో రామాలయం లేని గ్రామము ఉండవచ్చేమో కానీ ప్రధమ పూజ్యుడు అయిన వినాయకుడుని పూజించనిదే హిందువులు ఆచరించు పూజాకార్యక్రమం ప్రారంభంకాదు.                                                                           

💠గణేశ్ మహరాజ్ అని ఉత్తరభారతంలో, వినాయగర్, గణపతిపేర్లతో దక్షణాధిలో, గణనాయక, గణాధ్యక్ష, విగ్నరాజ మొదలైన ఏకాదశ నామములలో తెలుగురాష్ట్రములందు స్థానికముగా వినాయకుడని పిలువబడు స్వామికి స్వయంభూ దేవాలయములతో పాటుగా వివిధఆకార పరిమాణములు మరియు వివిధమహత్తులతో భారతధేశమంతటా స్థాపించబడిన వినాయక దేవాలయములలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  తూర్పుగోదావరిజిల్లాలో  ప్రధానకేంద్రము కాకినాడ నుండి 33 కి.మీ.  రాజమహేంద్రవరమునుండి 40 కి.మీ.దూరంలో బిక్కవోలు గ్రామంలోలో ఉన్న శ్రీలక్ష్మి గణపతి దేవాలయం విశిష్టమైనది

💠 ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ  ఆలయంలో స్వయంభూ వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు
11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది. కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి

💠ఇది నవాబుల కాలంలో విచ్ఛిన్న సమయంలో ఈ ఆలయం భూగర్భంలోకి వెళ్లిపోయింది. తరువాత 1960 వ సంవత్సరంలో ఒక భక్తుని కలలో కనిపించిన స్వామి నేను భూమిలో ఉన్నాను అని చెప్పారు. అక్కడ తవ్వకాలు జరపగా ఆలయం కనపడింది. విగ్రహం బయటపడిన కొత్తలో చిన్నగా ఉంది. తరువాత భారీగా పెరుగుతూ ఇక్కడి భక్తుల కథనం.

💠ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని నమ్మకం.

💠ఇక్కడ వినాయక చవితి, మార్గశిర షష్ఠి నాడు ఉత్సవాలు చేస్తారు. ప్రతి నెలా శుద్ధ చవితి నాడు లక్ష దూర్వ బిలాలతోపూజ, మూల మంత్ర జప తర్పణ హోమాలు, అభిషేకాలు, ఏకా దశ, గణపతి,రుద్ర, చండి హోమాలు చేస్తారు. 

💠ఈ ప్రాంగణంలో ఇంకా రాజరాజేశ్వరీ చంద్రశేఖర, గొలింగేశ్వర, పార్వతి, సుబ్రమణ్య స్వామి,నంది, నవ గ్రహాలు ఇలా శైవ కుటుంబం అంతా కొలువై ఉంది.

No comments: