🌀 కేరళలోనేనా అయ్యప్ప స్వామి ఆలయం ఉంది మన రాష్ట్రంలో లేదా అనే వారికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ..!
కేరళ రాష్ట్రంలో ఉన్న ఆలయం మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆలయం ఉంది.
ఈ ఆలయాన్ని విశాలమైన మైదానంలో నిర్మించినారు.
ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందనేగా మీ సందేశం ..!
💠 ద్వారపూడిలోని అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమలైలోని అయ్యప్పగుడి తరహలో నిర్మించారు.
ఈ దేవాలయము రాజమండ్రి-కాకినాడ రహదారికి చేరువగా ఉండుటవలన ప్రయాణికులకు శోబాయమానముగా కనువిందు చేస్తూ ఉంటుంది.
రోడ్దుకు అటువైపున ధవలేశ్వరం-కాకినాడ గోదావరికాలువ ఉంది.
భక్తులు ఈ కాలువలో కాళ్ళు, చేతులు కడుగుకొనుటకు, స్నానాలు చేయుటకు అనుకూలంగా కాలువ వడ్దున మెట్లు నిర్మించారు.
💠 అయ్యప్ప దీక్ష చేపట్టి కేరళలోని శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడి అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ఇరుముడులు సమర్పిస్తారు.
💠 ఎన్.ఎల్. కనకరాజు గురుస్వామి సంకల్ప బలంతో శ్రీకారం చుట్టిన ఈ ఆలయం ఆనతి కాలంలోనే దినదిన ప్రవర్ధమానమై ప్రముఖ యాత్ర స్థలంగా ఖ్యాతి గాంచింది.
💠 1989వ సంవత్సరంలో కంచికామకోటి పీఠాదిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయం ముందు భాగంలో ఏకశిలతో చెక్కిన 18 మెట్లను అమర్చారు.
💠ముఖద్వారంలో శివకేశవుని, పశ్చిమ దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి అతి పెద్ద విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తాయి.
ఆలయ క్రింది భాగంలో దుర్గాదేవి ఆలయం, సింహద్వారం, శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి, షిరిడీ సాయినాథ్ మందిరం, నవగ్రహాలయం ఉపాలయాలుగా నిర్మించారు.
అయ్యప్ప ఆలయానికి తూర్పు వైపున 200 అడుగుల పొడవున సొరంగం తవ్వి, 40 అడుగుల లోతులో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
పాలరాతితో మూడు అంతస్తులుగా నిర్మించిన అష్టాదశ ఉమాలింగేశ్వర స్వామి ఆలయంలో ఋషికేశ్, హరిద్వార్, కేదారినాథ్, బదరీనాథ్, బ్రహ్మకపాలం, గంగోత్రి, అమరనాథ్, కాశీ, యమునోత్రి, ఓంకార్ తదితర ప్రాంతాల నుండి తెచ్చిన 18 శివలింగాలను ప్రతిష్టించారు. ఆలయం వెలుపల నటశేఖరుని, నందీశ్వరుని అతిపెద్ద ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి.
💠 ప్రాంగణం ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి (సగం శివరూపం,సగంవిష్ణురూపం) విగ్రహం దర్శనం యిస్తుంది.
ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్పస్వామి గుడివున్నది .అయ్యప్పగుడి రెండు అంతస్తులగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్పస్వామి వున్న మందిరమున్నది.
క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు. పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరానికి వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం ఉంది.
💠 అయ్యప్ప విగ్రహం వున్న మందిరం (గర్భగుడి) పైభాగాన గోపుర నిర్మాణమున్నది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను బొమ్మలరూపంలో నిర్మించబడివున్నాయి. ఆయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారి విగ్రహంవున్నది. అయ్యప్పగుడిలో నిత్యాన్నదానం అమలులోవున్నది.
💠 పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరంకు వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి ఒకటి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం వున్నది.
No comments:
Post a Comment