💠 సంఘీ దేవాలయం, హైదరాబాద్ లో సంఘీనగర్ లో ఉంది. ఈ ఆలయం హైదరాబాదుకు సుమారు 35కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం యొక్క ఎత్తైన రాజ గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుంచి చూడవచ్చు. ఈ దేవాలయ సముదాయం పరమనంద గిరి కొండపైన నిర్మించారు. ఇది కొండల మద్య ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
💠 ఈ ఆలయంలో శ్రీవెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. స్వామి విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో చూపరులకు కనువిందు చేస్తుంది.
ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతి రూపమని ప్రతీతి. ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
💠 ఈ ఆలయం చోళ, చాళుక్యుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం కలిగి ఉంటుంది.
ఇది 1991 వ సంవత్సరంలో నిర్మించారు.
ఈ ఆలయంలో ప్రధాన దైవంగా శ్రీ దేవి, భు దేవి సహిత వెంకటేశ్వర స్వామీ వారు కొలువై ఉన్నారు.
💠 దక్షిణ భారత దేశ పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం తల పెట్టిందని కథనం. ఈ ఆలయం యొక్క మరొక విశేషం చీకటి పడగానే ఆలయం దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను ఆకర్షిస్తుంది.
💠 రామోజీ ఫిలిం సిటీకి దగ్గరగా ఉన్నందున్న ఇక్కడ నిత్యం సినిమా షూటింగ్ లు జరుగుతూ ఉంటాయి. అందుకే అనేక సినిమాలలో కూడా ఈ ఆలయం కనపడుతుంది. ఇంకా ఇక్కడ దుర్గాదేవి, కార్తికేయ, వినాయక, రామ, శివుడు, కాలాంమ్బిక, ఆంజనేయ స్వామి వార్ల ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి.
No comments:
Post a Comment