" ఉగ్రం వీరం మహా విష్ణుం
జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం
మ్రిత్యుర్ మ్రిత్యుం నమామ్యహం "
💠 భద్రాద్రి నుండి 100 కి.మీ. దూరములో గల 'మల్లూరు' నరసింహ క్షేత్రము చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది .
💠 ఇక్కడనున్న స్వామి ఉగ్రనరసింహమూర్తి.
ఈ విగ్రహం 9.2 అడుగుల పొడవు ఉంటుంది మరియు నరహరి అష్టభూజములతో విరాజిల్లుచు భక్తకోటికి దర్శనము ఇస్తున్నాడు
💠 ఇక్కడి ప్రజల కథనం ప్రకారం రావణుడు ఈ ప్రాంతాన్ని చెల్లెలు శూర్ఫనఖకి కానుకగా ఇచ్చాడు.
ఇక్కడే రాముల వారు ఖర దూషణాదులను మట్టు పెట్టారు.
అగస్త్యుల వారు ఈ ప్రాంతానికి హేమాచలమని పేరు పెట్టారు. దీనిని పూర్వము 'హేమాద్రి' , "హేమాచాలం "అని పిలిచెవారు.
దట్టమైన అడవుల మధ్య సుందర ప్రదేశం
💠 ఈ క్షేత్రం చాల మహిమన్మితమైన క్షేత్రం మరియు స్వామిని దర్శించుకుంటే అన్ని రకాల బాదలు ,దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం .
💠 కొండపై చింతామణి ధార ప్రవహించుచుండును. అపవిత్రులు ఈ ధారను స్పృశించిన అది ఇంకిపోవునని చెప్పుకొందురు. ఈ దుర్గమమైన పర్వతగుహలలో నవనారసింహులుందురని ప్రతీతి.
రాణి రుద్రమదేవి ఈ ప్రవాహానికి చింతామణి జలపాతం అని పేరు పెట్టారు.
ఇక్కడ చింతామణి తీర్థంలోని నీళ్ళు సకల రోగ నివారణ చేయ గలవు.
💠 అమ్మవార్లు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి. క్షేత్ర పాలిక హనుమంతుడు
💠 ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు.
ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూగా వెలిశాడట.
💠 శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట. మహారాజు 76 వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది.
ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది.
ఈ ద్రవం సేవిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం.
దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు.
💠 స్వామి వారి విగ్రహ నాభి నుండి నీరు ఉబికి వస్తుంది. ఇది భక్తులకు తీర్థంగా ఇస్తారు.
ఆ నీరు పాపాలు మరియు వ్యాధుల నుండి వారిని రక్షిస్తుందని భక్తులు నమ్ముతారు. స్వామి వారి నాభి నుండి వచ్చే ఈ ద్రవం చందనంలా (చీము లా వుంటుంది అని అంటారు) ఉంటుంది.
ఈ చందన ధ్రవం కోసం భక్తులు చాలా దూరం నుండి వస్తారు.
💠 ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు.
ఇక్కడ స్వామి వారి మూలవిగ్రహాన్ని తాకితే మానవుల చర్మాన్ని తాకితే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతి కలుగుతుంది.
స్వామి విగ్రహం రాయి తో చేసినా ఉదర భాగం మెత్తగా మానవ శరీరంలాగా ఉంటుంది. స్వామి సకల కోరికలూ తీరిచే అద్భుత మహత్యం కల వారు.
💠 దేవుడి విగ్రహ మూర్తి మనిషిలా తాకితే మెత్తగా, ఛాతీ మీద వెంట్రుకలతో ఉంటుంది.
మనం విగ్రహం యొక్క ఛాతీని చూపుడు వేలితో తాకినట్లయితే, ప్రతిఘటన లేకుండా వేలు శిలలోకి వెళ్లిపోవడాన్ని మనం చూడవచ్చు. మనం వేలిని తీసివేస్తే, ఛాతీపై ముద్ర పడడం మరియు వేలు తీసివేయడం వలన ఏర్పడిన గుంట (నొక్కు, కందకం) కనుగొనవచ్చు. హేమచల నరసింహ స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఇది.
💠 స్వామివారికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అను ఇద్దరు భార్యలు ఉన్నారు.
iక్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి ఉన్నారు .
💠 ఇక్కడ ఉన్న ఇంకో అద్భుతం చింతామణి జలపాతం ఈ చింతామణి జలపాతం లోని నీరు కొడలలోనుంచి చెట్టు వేరులలోనుంచి వస్తుంది ఆ నీరు ఎప్పటికి వస్తూనే ఉంటుంది ఆ నీటిని మనం ఒక బొటల్ లో నింపుకుని 41 రోజులు పాటు ప్రతి రోజు మనం తాగుతూ ఉంటే దీర్ఘకాలిక రోగాలు కూడా పోతాయి
💠 స్వామి వారి దర్శనం ఏ రోజు అయిన ఉంటుంది కానీ సంతానం కోసం వెళ్లి వారు మాత్రం శనివారం మరియు ఆదివారం మాత్రమే వెళ్ళాలి .
ఆ రోజుల్లో మాత్రమే స్వామి వారి నుంచి ఆ ద్రవం తీయడం జరుగుతుంది .
ఆ దేవస్థానం పూజారులు ఆ 2 రోజులు తప్ప మిగిలిన రోజుల్లో స్వామివారిని ముట్టుకోకూడాదు అని అక్కడ చరిత్ర
ఒక వేళ ముట్టుకుంటే 25000 సార్లు జపం చేయాలి అని చెప్పారు ఈ ద్రవం తీసుకున్న వారికి కచ్చితంగా 6 నెలల లోపు సంతానం కలుగుతుంది అంటే 13 వారాలు లోపు .
💠అలాగే ఇక్కడ స్వామి వారికి చేసే అభిషేకం తిల తైలాభిషేకం అది కూడా శనివారం మరియు ఆదివారంనాడు మాత్రమే చేస్తారు
ఈ 2 పూజలకు దేవస్థానం టికెట్ ఉంటుంది
💠 వైశాక శుద్ధ పౌర్ణమి నుండి స్వామి వారి కళ్యానోత్సవములు నిర్వహించబడును .
చాల మంది భక్తులు స్వామి వారి కళ్యాణోత్సవానికి వస్తారు.
No comments:
Post a Comment