🌿ఉలి మలచిన ఉన్నత కళా
శిల్పరూపాలతో
ఉండవల్లి గుహలు ప్రతిష్టాత్మకంగా నిలిచివున్నాయి.
🌸ఈ గుహలో ఆనందంగా
శయన భంగిమలో
దర్శనమనుగ్రహిస్తున్నాడు
అనంత పద్మనాభ స్వామి.
🌿 ఉండవల్లి ఆంధ్రప్రదేశ్ లోని
గుంటూరు జిల్లా తాడేపల్లి
మండలానికి చెందిన ఒక
గ్రామము.
🌸 అమరావతి చుట్టూ
వున్న గ్రామాల్లో ఇది ఒకటి.
ఇక్కడ ఒక కొండ వరసలో
ముందు భాగము నుండి
లోపలికంటా దొలుచుకుంటూ
పోయి,
🌿 నాలుగు అంతస్తులుగా శిల్పకళతో అద్భుతాలను
సృష్టించారు. వీటిలో
గుహాలయాలు, శిల్పాలు
అత్యంత సౌందర్యం
మలచబడి సందర్శకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
🌸అనంతపద్మనాభ స్వామి
నరసింహ స్వామి ప్రధాన దైవాలుగా ఈ ప్డడడలచీన గుహల్లో కొలువై దర్శనమిస్తున్నారు.
🌿ఒకే బండ మీద మలచిన 20 అడుగుల ఏకశిలా విగ్రహంగా అనంతపద్మనాభుడు దర్శకుల కనులకి, మనసుకి పవిత్రతను
ఆనందం కలిగిస్తుంది.
🌸ఇందుతోపాటూ ,
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల
ముమ్మూర్తులకు గుహాలయాలు వున్నాయి.
🌿ఇక్కడ వున్న శిల్ప కళా శైలి అజంతా, ఎల్లోరా శిల్పాలని
తలపింప చేస్తాయి.
🌸ఈ శిల్పశైలి గుప్తుల కాలంనాటి ప్రధమ భాగానికి చెందినట్లు
భావించబడుతున్నది.
🌿ఈ గుహాలయాలు ,
విష్ణు కుండినులు రాజ్యమేలుతున్న కాలంనాటివిగా చెప్ప బడుతున్నవి.
🌸ఈ గుహలు బయటికి
బౌధ్ధ విహారాల వలె కనబడినప్పటికి ,
గుహాలయములుగానే
ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతి చెందాయి.
🌿ఈ ఆలయాలు బౌధ్ధ హిందూమత సంగమంగా కనిపిస్తాయి. ఈ గుహాలయాల మొదటి అంతస్తులో,
నరసింహ స్వామి, వినాయకుడు, దత్తాత్రేయుడు ఇతర శిల్పాలు మలచబడి వున్నాయి.
🌸ఋషులు, సింహాల శిల్పాలు కూడా వున్నవి. స్ధంభాల మీద కూడా కొన్ని
శిల్పాలు కనిపిస్తాయి.
🌿రెండవ అంతస్తులో శయన
భంగిమలో అనంతపద్మనాభ
స్వామి దర్శనమిస్తున్నాడు.
🌸గర్భాలయం ముఖ ద్వారము
వద్ద జయ విజయుల విగ్రహాలు నిలబడిన భంగిమలో వున్నాయి. అనంతపద్మనాభ స్వామి విగ్రహం పొడవుగా సర్ప శయనంగా గోచరిస్తుంది.
🌿ఈ గుహాలయం లోపల
తామరపుష్పం లో ఆశీనుడైన
బ్రహ్మ, సప్త ఋషుల , పలు దేవతల శిల్పాలు వున్నవి.
🌸కొండ వెలుపల, గుహ పై భాగాన సప్త ఋషుల పెద్ద పెద్ద శిల్పాలు మలచబడి దర్శనమిస్తాయి.
🌿మూడవ అంతస్తులో అసంపూర్ణంగా మలచబడని
త్రికూట ఆలయం వున్నది.
దీనిలో శిల్పాలు ఏమీ లేవు.
🌸యీ గుహాలయాలు మధ్య మధ్య వున్న స్ధంభాలతో,
వాటి మీద చెక్కిన లతలు,
గుహాలయ గోడల మీద చెక్కిన దైవ శిల్పాలతో,
🌿ఆలయాలు విశాలంగా కనిపిస్తాయి.
ఒకే కొండని గుహలుగాను, దైవ శిల్పాలుగాను, ఏక శిలపై చెక్కి నిర్మించిన
🌸శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని
మెచ్చుకోకుండా వుండలేము.
గుహాలయాల చుట్టూ పచ్చని
చేలు కళ్ళకి విందు చేస్తాయి.
🌿ఈగుహ నుండి సొరంగ మార్గాలు..
ఆ కాలంలో పాలించిన
కొండవీటి రాజుల కోటలోకి,
మంగళగిరి కొండకి, విజయవాడ కనక దుర్గా దేవి ఆలయానికి
🌸 రహస్య మార్గాలు వున్నట్టు తెలుస్తోంది. ఆ కాలంలో ఈ మార్గాలగుండా శత్రువులకు తెలియకుండా
యుధ్ధ సైనికులను పంపడానికి వుపయోగించే వారట.
🌿ఇప్పుడవి పూర్తిగా శిధిలమై మూసుకు పోయి, పాడైపోయివున్నాయి.
ఉండవల్లి గుహాలయాలకు
గుంటూరు, విజయవాడ నగరాల నుండి రోడ్డు మార్గాలు వున్నవి.
🌸గుంటూరు నుండి 30 కి.మీ
దూరములోను, విజయవాడ నుండి , 6 కి .మీ దూరంలోనూ వున్నవి.
🌿ఉదయం 6 గం..
నుండి సాయంకాలం 5 గం.30 ని .. వరకు యాత్రీకులు సందర్శనార్ధం అనుమతిస్తారు...
No comments:
Post a Comment