Adsense

Monday, August 22, 2022

వాగీశ్వరుడు ...!!

 
              
🌿స్వతంత్ర్య నాయకీ సమేత వాగీశ్వరుని దేవాలయం తమిళనాట మైలాడుతురై కు సమీపమున  వున్న  పెరుంచేరి లొ వున్నది. 
🌸విశాల ప్రాంగణం లో నిర్మించబడ్డ ఈ ఆలయంలో ధ్వజస్ధంభం , నంది,  బలి పీఠం  దాటిన తరువాత
మూడు అంతస్తుల రాజగోపురం దర్శనమిస్తుందీ. 

🌿దాని తరువాత వున్న ముఖ్య మండపానికి  కుడి ప్రక్కన అమ్మవారి సన్నిధి. మహామండపం
దాటేక అర్ధ మండపం , గర్భగుడి వున్నాయి. 
🌸గర్భగుడి లో వాగీశ్వరుడు
లింగరూపంలో తూర్పు
ముఖంగా అనుగ్రహిస్తున్నాడు. 
పానువట్టం  చతురంగా వుండడం,  విమానం ఇంద్ర విమానము వలె
వలయాకారంలో వుండడం యీ ఆలయ ప్రత్యేకత.

🌿ఆలయ లోపలి ప్రాకారంలో, సరస్వతీ దేవి పరమేశ్వరునికి పూజచేసే
శిల్పం  అత్యద్భుతంగా
మలచబడి  వున్నది. 

🌸ఆవరణకి దక్షిణమున
వినాయకుడు  సరస్వతి, 
దక్షిణామూర్తి,  పడమట 
అణ్ణామలైయారు,   ఉత్తరాన బ్రహ్మ, దుర్గాదేవి
దర్శనం అనుగ్రహిస్తున్నారు.

🌿తూర్పు ప్రాకారంలో  నాలుగు భైరవమూర్తులు వున్నాయి.
ఇప్పుడు ఈ వాగీశ్వరాలయ స్థల మహత్యం గురించి తెలుసుకుందాము.

🌸గురుభగవానుడు వేద, వేదాంగాలు , సకల ఆగమాలు, భూత, వర్తమాన ,భవిష్యత్ లు 
తెలిసిన  గొప్ప జ్ఞాని .

🌿ఈయననే బృహస్పతి అని అంటారు 
ఈయన భార్య తార సౌందర్యవతి.
గురువు ఆశ్రమంలో  గురుకుల వాసం చేసే  విద్యార్థుల లో చంద్రుడు కూడా ఒకడు.  

🌸ఆ చంద్రుడు తారను మోహిస్తాడు. ఆమె కూడా చంద్రుని కోరుకుంటుంది.
వీరి విషయం తెలిసిన గురువు   చంద్రుడు కుష్టు వ్యాధితో క్షీణించమని శపించాడు.  

🌿ఒకసారి గురు భగవానుడు, మయూరంలో వున్న దక్షిణా మూర్తిని తనకు దేవతలకి గురువుగా వుండే  పదవి కలగాలని వేడుకున్నాడు.  

🌸పరమేశ్వరుడు , గురువు కోరిక  నెరవేరడానికి, పెరుంచేరి పవిత్ర స్ధలంలో శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించమని చెప్పాడు. 

🌿ఆ విధంగా తీర్ధయాత్రకి బయలుదేరిన  గురువు పెరుంచేరికి వచ్చి, పంచాగ్నిని ప్రజ్వలింప చేసి, పరమశివుని గురించి తపమాచరించి  ఆత్మ   జ్ఞానాన్ని   పొందాడు. 

🌸ఆత్మ జ్ఞానాన్ని పొందిన గురుభగవానుని దేవతలకి గురువుగా నియమించాడు  పరమేశ్వరుడు. 
అందువలన  ఈ స్ధల ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహించినందున
వాగీశ్వరుని పేరుతో పిలుస్తారు. 

🌷అలాగే మరొక కధ కూడా ఇక్కడ చెపుతారు.🌷

🌸ఉమాదేవిని పుత్రికగా పొందిన దక్షుడు   ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాడు. ఆ యాగానికి తన అల్లుడైన పరమశివుని తప్ప బ్రహ్మాది దేవతలనందరిని ఆహ్వానించి పరమేశ్వరుని  అవమానించాడు. 

🌿దేవతలందరూ పత్నీ సమేతంగా ఆ యాగానికి వెళ్ళేరు. విషయం తెలిసిన దక్షుని కుమార్తె  ఉమాదేవి
శివుడు వద్దంటున్నా వినక దక్షుని యాగాన్ని నిలిపి వేయాలని 

🌸వెళ్ళిన పార్వతీ దేవికి తండ్రి వలన  అవమానం పొంది ఆ క్రోధంతో  యాగ గుండంలో దూకి ఆత్మాహుతి చేసుకున్నది. 

🌿ఇది తెలిసిన   పరమశివుడు  మహోగ్రుడై త్రినేత్రాన్ని
తెరవగా,  ఆ నేత్రము నుండి వీరభద్రుడు ఆవిర్భవించాడు. 

🌸 దక్షుని యాగ శాలకు వెళ్ళిన వీరభద్రుడు, ఈశ్వరుని యొక్క ఆవిర్భాగము యిమ్మని అడుగగా ,

🌿దక్షుడు ఇవ్వడానికి అంగీకరించక మాటలతో పరమశివుని తీవ్రంగా అవమానించాడు .
రుద్రమూర్తి అయిన వీరభద్రుడు  యాగశాలని  విధ్వంసం చేసి అక్కడకు వచ్చినవారందరిని హింసించాడు.

🌸దేవతలందరూ భయంతో కేకలు పెడుతూ పరుగులు పెట్టేరు.
వీరభద్రుని ఆవేశంనుండి సూర్యుడు, చంద్రుడు , యముడు, నైఋతి, కుబేరుడు, వాయువు ,ఇంద్రుడు కూడా ఎవరూ వీరభద్రుని నుండి తప్పించుకోలేక పోయారు.

🌿అభయం అడిగి శరణు వేడుకొన్న వారిని మన్నించి వదలివేశాడు. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి వీరభద్రుని చేతీకి చిక్కేరు. 

🌸బ్రహ్మదేవుని తల మీద మోదగా క్రింద పడిపోయాడు బ్రహ్మదేవుడు. ప్రక్కనే నిలబడిన సరస్వతీ దేవి
ముక్కు కోసి అవమానించాడు.

🌿ఆఖరికి దక్షుని తల నరికి భూమి మీద పడకుండా  దానిని యాగ గుండానికి ఆహూతి చేశాడు. 

🌸పిదప ప్రక్కనే వున్న ఒక మేక తల తీసువచ్చి  దక్షునికి అమర్చాడు. 
ముక్కు కోయబడిన సరస్వతి , అవమానంచెంది వేదనతో, బ్రహ్మదేవుని వద్ద దుఃఖించినది.

🌿బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో, " శివుడు శాంతిస్తే సమస్తం చక్కబడుతుందని బ్రహ్మ చెప్పడంతో సరస్వతీ దేవి పెరుంచ్చేరి పుణ్యస్ధలానికి
వచ్చి అక్కడ వున్న
వాగీశ్వరుని గురించి తపస్సు చేసింది. 

🌸తపస్సును మెచ్చిన వాగీశ్వరుడు  సరస్వతీదేవికి దర్శనమిచ్చాడు. 
తన అంగ విహీనతను రూపుమాపి ,  అందరి నాల్కల మీద నివసించి వారికి  వాక్పటిమ అనుగ్రహించేలా  వరాలు కోరుకున్నది.

🌿సరస్వతి కోరినవిధంగానే వరములు
అనుగ్రహించాడు పరమేశ్వరుడు.
సరస్వతీదేవి పోయిన ముక్కుని తిరిగి పొంది, బహ్మ దేవుని చేరి, వాక్పటిమని అనుగ్రహించే శక్తి ని పొందినది.

🌸సుమారు 800 సంవత్సరాలు పురాతనమైన  యీ వాగీశ్వరాలయ  స్థలవృక్షం పన్నీరు వృక్షం.  

🌿గురు భగవానుడు
దేవ గురువు గా పదవి పొందిన పుణ్య క్షేత్రం అవడం వలన,  గోచార గురువు యొక్క దొషపరిహార స్ధలంగా కూడా ఈ ఆలయం ప్రసిధ్ధి పొందివున్నది. 

🌸మంచి వాక్కు , జ్ఞానం కావాలని కోరుకునే భక్తులు తప్పక దర్శించ
వలసిన ఆలయం.

No comments: