Adsense

Thursday, September 29, 2022

5th day bathukamma name Atla Batukamma అట్ల బతుకమ్మ

అట్ల బతుకమ్మ


🌸ఐదో రోజున బతుకమ్మను 'అట్ల బతుకమ్మ' (Atla Bathukamma) అంటారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. బియ్యం పిండి, రవ్వతో ఈ అట్లను తయారు చేస్తారు.

🌿బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ ఈ అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఐదో రోజును పురస్కరించుకొని తంగేడు, గునుగు, చామంతి, బంతి, గుమ్మడి, మందార పూలతో ఐదంతరాల బతుకమ్మను పేరుస్తారు.

🌸వలయాకార తాంబాలం లేదా ప్లేటులో ఈ ఐదంతరాల బతుకమ్మను పేర్చి... సాయంత్రం వేళలో కోలాటాలు చేస్తారు. బతుకమ్మను చుట్టూ పెట్టి... ఉయ్యాల పాటలు పాడుతారు.

🌿అనంతరం బతుకమ్మను గంగమ్మ చెంతకు చేర్చి... తమతో తీసుకొచ్చిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు.

🌸🌿కోలాటాల కోలాహలం🌿🌸

🌸సాయంత్రం వేళ విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు.

🌿చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు.

🌸బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు.

🌿బంధాలు, బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు...స్వస్తి..

No comments: