Adsense

Thursday, September 29, 2022

శ్రీ దేవి శరన్నవరాత్రలలో నాలుగవ నవదుర్గ...!!ఈరోజు నవరాత్రులలో భాగంగా - ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి - అన్నపూర్ణాదేవి అలంకరణ Vijayawada Navatri.. Ammavari alankaram Annapurna Devi

 శ్రీ దేవి శరన్నవరాత్రలలో నాలుగవ నవదుర్గ...!!
ఈరోజు నవరాత్రులలో భాగంగా - ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి - అన్నపూర్ణాదేవి అలంకరణ..

                                                        
🌷"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"🌷

🌿కాశీ ( వారణాసి )అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు...

🌸వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం...

🌿ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు.

🌸పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు.

🌿ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి , నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే, కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ,

🌸ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది.
ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని నమ్మకం...

       🌷అన్నపూర్ణా దేవి కథ..🌷

🌿కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ  ప్రచారంలో ఉంది.
మన పవిత్ర గ్రంధాల , పురాణాల ప్రకారం...

🌸ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు.

🌿భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది.

🌸దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది, ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది.

🌿చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు.

🌸అప్పటి నుండి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని చెబుతారు.

🌷పూజా : 🌷

🌿అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి.

🌸"హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా"

🌿అనే మంత్రాన్ని జపించడం మంచిది... అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం , పొంగలి నివేదించాలి, అన్నపూర్ణ అష్టోత్తరం , స్తోత్రాలు పారాయణం చేయడం మంచిది,

🌸ఈరోజు కొంతమంది పేదలకు, వస్త్రాలు, నిత్యావసర వస్తువులు, అన్నం దానం చేయడం చాలా ఉత్తమం .

No comments: