గాయత్రి శుభ ఫలధాత్రి
గాయత్రి శుభ ఫలధాత్రి
సావిత్రి వేద వరదాత్రి
lగాయత్రిl
వేదమంత్ర జనని
సకల యంత్ర తంత్ర సుజని
హంస వాహని యోగధారిణి
బ్రహ్మతేజో వివర్ధని
lగాయత్రిl
సూర్యమండల వాసిని
సామవేద స్వరూపిణి
అక్షరమాలా ధారిణి
అంబా అమృత వర్షిణి
సకల శాస్త్ర వర ప్రదాయని
మహామంత్ర ఫల ప్రసాదిని
lగాయత్రిl
అజ్ఞాన తిమిర సంహారిణి
తరణి స్నేహ గమని
ఆనందామృత దాయని
సదా నిత్య స్మరణి
సకల వేద సంచారిణీ
మహా వైభవాకారిణీ
lగాయత్రిl..
No comments:
Post a Comment