🌸రాజస్థాన్ లో అజ్మీర్ - పుష్కర్ దగ్గర గాయత్రి గిరి లో ఉన్న శక్తి పీఠం ఇది. పుష్కర్ అంటే ప్రతి ఏడాదీ జరిగే ఒంటెల పరుగు పందాలకు ప్రసిద్ధి అని అందరికి తెలుసు. ఇక్కడికి రవాణా సౌకర్యం కూడా బాగానే ఉంది.దీనినే "బ్రహ్మ పుష్కరిణి" అని కూడా అంటారు.
🌿అమ్మవారి కంఠాభరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం. ఇక్కడి అమ్మవారు గాయత్రీదేవి. దగ్గరలో సర్వానంద శివాలయం చాలా ప్రసిద్ధమైనది. సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఈ పీఠం ఉంది.
🌸ఇక్కడి సరస్సు పేరే "పుష్కర్''. సరస్సులో 52 ఘాట్ లున్నాయి. నిత్యంహోమాలు, పూజలతో కళకళ లాడుతుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. ఇదొక్కటే ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం.
🌿మనదేశంలో అతి ముఖ్య తీర్ధరాజంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి "తీర్ధ రాజ్'' అనే సార్ధక నామం కలిగింది. ఈ క్షేత్రానికి గొప్ప స్థల పురాణం ఉంది.
🌸పద్మపురాణంలో వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించటం చూసి తట్టుకోలేక తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి బ్రహ్మ దేవుడు ఆ రాక్షసుడిని సంహరిచాడట. ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి మూడు రేకులు రాలి మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడ్డాయి.
🌿వాటికే జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అనే పేర్లు ఏర్పడ్డాయి. బ్రహ్మ చేతి నుండి జారి పడిన తామర పువ్వు పడిన ప్రదేశం కనుక పుష్కర్ అనే పేరు సార్ధక మైంది. బ్రహ్మకు ఇక్కడే యజ్ఞం చేయాలనే సంకల్పం కలిగింది.
🌸రాక్షసుల బారిన పడకుండా సరస్సుకి దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూరా, తూర్పున సూర్య గిరి అనే కొండలను సృష్టించి, దేవతల నందరిని బ్రహ్మ ఆహ్వానించాడు. సుముహూర్తం సమీపించింది.
🌿బ్రహ్మ భార్య సరస్వతీదేవి అనే సావిత్రీదేవిని తీసుకొని రమ్మని బ్రహ్మ నారదుడిని పంపిస్తాడు ... నారదుడు ఆమెను ఒంటరిగా వెళ్ళవద్దని చెలికత్తేలతో కలిసి వెళ్ళమని కపట సలహా ఇస్తాడు. ఆమె లక్ష్మీ, పార్వతులతో కలిసి వెళ్దామని ఆగిపోయింది.
🌸ముహూర్తం దగ్గర పడుతున్నా భార్య సావిత్రీ దేవి రాలేదని కంగారు పడుతున్నాడు బ్రహ్మ దేవుడు. అనుకొన్న ముహూర్తానికి యజ్ఞం ప్రారంభించాలనుకొని ఇంద్రునితో ఒక అమ్మాయిని చూడమని ఆమెను వివాహం చేసుకొని యజ్ఞం ప్రారంభిస్తానని అన్నాడు.
🌿అప్పుడు ఇంద్రుడు గుజ్జర్ల కుటుంబానికి చెందిన ఒక పాలమ్ముకొనే అమ్మాయిని తీసుకొని వస్తాడు శివ, మహావిష్ణువుల సలహా మేరకు ఆమెకు తలంటి పోయించి సర్వాభరణాలను ధరింపజేసి, గోవుతో శుభ్రం చేసి ఆమెకు ‘’గాయత్రి’’అనే పేరు పెడతారు.
🌸అనుకొన్న ముహూర్తానికి బ్రహ్మ, గాయత్రిదేవితో కలిసి యజ్ఞం ప్రారంభిస్తాడు. యజ్ఞం పూర్తయ్యే సమయంలో సరస్వతీదేవి, లక్ష్మీ, పార్వతులతో అక్కడికి చేరుకుంటుంది.
🌿సరస్వతీదేవికి కోపం వచ్చి అక్కడున్న బ్రహ్మాది దేవతలందర్నీ శపిస్తుంది. భర్త బ్రహ్మను వెంటనే వృద్ధుడై పోయేట్లు శపించి బ్రహ్మకు ఒక్క పుష్కర్ లో తప్ప వేరెక్కడా ఆలయం ఉండదని ఘోర శాపం ఇచ్చింది.
🌸ఇంద్రుడికి అన్ని యుద్ధాలలో అపజయం తప్పదని శపించింది. మానవ జన్మ ఎత్తి భార్యా వియోగంతో బాధ పడమని విష్ణువును శపించింది. శ్మశానంలో భూతప్రేతపిశాచాలతో సంచరించమని శివుడిని, భిక్షాటనలో జీవించమని బ్రాహ్మణులను శపిస్తుంది.
🌿ఉన్న డబ్బంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుబెరుడికి శాపం ఇచ్చింది. ఆ తర్వాత సరస్వతీదేవి అనే సావిత్రీదేవి రత్నగిరి పర్వతాలలో తపస్సు చేసుకొంటూ, సరస్వతీ నదిగా మారి ప్రవహించిందని పురాణ కధనం.
🌸అందువల్లే కొండమీద సావిత్రీ ఆలయంతో బాటు, ఒక చిన్న నీటి ప్రవాహం కూడా కనిపిస్తుంది దీనినే ఇక్కడి వారు సావిత్రీ నది అని పిలుస్తారు. సావిత్రీ దేవిని పూజించిన స్త్రీలకు నిత్యసుమంగళి వరాన్ని ప్రసాదిస్తుందని పుష్కర్ ను సందర్శించిన వారంతా భావిస్తారు.
🌿అలిగి శపించి వెళ్ళిపోయిన సావిత్రీదేవి నిష్క్రమణ తర్వాత అక్కడి బ్రాహ్మణులను యజ్ఞం కొనసాగించమని బ్రహ్మ కోరాడు. వారు తమకు ఇచ్చిన శాపం నుండి విముక్తి కల్గించమని వేడుకొన్నారు.
🌸అప్పటికే యజ్నఫలంతో శిద్ధించిన శక్తులతో గాయత్రి పుష్కర్ తీర్ధ క్షేత్రమై విలసిల్లుతుందని, ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకొంటాడని, విష్ణువు శ్రీరాముడిగా జన్మించి రాక్షస సంహారం చేస్తడని, బ్రాహ్మణులు గురు గౌరవం పొందుతారని బ్రహ్మ సావిత్రి ఇచ్చిన శాపానికి తీవ్రత తగ్గించాడు ఆ తర్వాత అందరు కలిసి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తారు.
🌿అందుకే బ్రహ్మకు ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఆలయం లేదు. సావిత్రీదేవి ఆలయం 14వ శతాబ్దం నాటిది. అంతకు ముందు రెండువేల ఏళ్ల క్రితం ఒక పురాతన ఆలయం ఉండేదట.
🌿ఆది శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ఒకసారి ఆలయాన్ని పునరుద్ధరించారట. ఆ తర్వాత మధ్యయుగంలో మహారాజా జవాత్ రాజా మరోసారి పునరుద్ధరణ చేశారట.
🌸ఆలయం లోపలి గోడలకు వందలకొద్దీ వెండినాణాలు అంటించి ఉండటం ఇక్కడ గొప్ప విశేషం. భక్తులు తమ పేర్ల మీద నాణాలు సమర్పిస్తారు. పాలరాతి మెట్లు ఎక్కి మందిరం దాటి లోపలికి ప్రవేశిస్తే, హంస వాహనం మీద ఉన్న చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం కనువిందు చేస్తుంది.
🌿ఆయన నాలుగు చేతులలో అక్షరమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. ఆయనకు ఎడమ వైపు గాయత్రీ దేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆలయం గోడలమీద సరస్వతీదేవితో బాటు ఇతర దేవీ విగ్రహాలూ ముచ్చటగా ఉంటాయి.
🌸శీతాకాలంలో ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం పూజాదికాలు ఉంటాయి మధ్యాహ్నం మూడింటికి విరామం. సనాతన పద్ధతిలో పూజలు చేస్తారు. కేవలం సన్యసించిన వారే పూజలు నిర్వహించటం ఇక్కడ సాంప్రదాయం.
🌿పుష్కర్ లోని "పరాశర" గోత్రీకులే
పూజలు నిర్వహిస్తారు. సాధువు ద్వారానే కానుకలను భక్తులు అందజేస్తారు. గర్భగృహం మధ్యలో వెండి తాబేలు ఉంది. ఏటా కార్తీక పౌర్ణమికి బ్రహ్మదేవునికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
🌸వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి వచ్చి పుష్కర సరస్సులో పవిత్రస్నానాలు చేసి బ్రహ్మ దేవుడిని దర్శించుకొంటారు. ప్రతి పౌర్ణమి అమావాస్యల రోజుల్లో ప్రత్యేక పూజలుంటాయి.
🌿కార్తీకంలోనే "పుష్కరజాతర'' మహా వైభవంగా జరుగుతుంది. ఇది దీపావళి తర్వాత వచ్చే ఏకాదశి నాడు ప్రారంభమై, పౌర్ణమి వరకు జరుగుతుంది. ఈ సమయంలోనే ఒంటెల సంత కూడా జరుగుతుంది.
🌸తోలు బొమ్మలాటలు రాజస్తానీ సంప్రదాయ నృత్యాలతో రంగుల కాంతులతో మహా వైభవంగా జాతర ఉంటుంది.
🌿బ్రహ్మ ఆలయాన్ని దర్శించిన తర్వాత సావిత్రీ, గాయత్రీ అమ్మవార్ల ఆలయాలను దర్శించటం సంప్రదాయం. ఈ రెండు ఆలయాలు సరస్సుకు ఎదురుగా రెండు వేర్వేరు కొండలమీద ఉన్నాయి బ్రహ్మను శపించిన సావిత్రీ దేవి ఆలయం పుష్కర్ లో కెల్లా ఎత్తైన రత్నగిరి మీద బ్రహ్మ ఆలయానికి వెనక వైపు ఉంటుంది.
🌸అమ్మవారి విగ్రహంలో కోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. గాయత్రీదేవి సావిత్రి కోపానికి భయపడినట్లు దర్శన మిస్తుంది. ఈ ఆలయం సరస్సుకు తూర్పున చిన్న కొండమీద ఉంటుంది...స్వస్తి..

No comments:
Post a Comment