అన్నపూర్ణేశ్వరి దివ్యశోభతో అలరారే దేవాలయం "హోరనాడు".....!!
🌷అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణ వల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం భిక్షాం దేహిచ పార్వతి!!🌷
🌸 అన్నము నుండే సమస్త జీవులు సృష్టింపబడుతున్నవి. సమస్త జీవులకు ప్రాణ శక్తి అన్నము నుండే ఉద్భవిస్తుంది.ఆకలి ప్రాణ శక్తిని క్షీణింపజేస్తున్నది.
🌿కనుక అన్నము - ప్రాణశక్తి - ఆకలి, మూడును ఒకదానికొకటి అనుసంధానము కలిగి ఉన్నవి. సమయానికి అన్నము లభింపకున్న ప్రతి జీవి అలమటించును. కనుకే అన్నము పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది.
🌹స్థల పురాణం🌹
🌸భారతదేశమంతటా ఆదిశంకరులు పాదయాత్ర చేస్తూ ఎన్నో పీఠాలను స్థాపిస్తూ, ఒకసారి వారి శిష్య బృందం ఆకలిగా ఉందని ఆగారు, అరణ్యప్రాంతమవడంతో అతిథ్యమిచ్చే గృహాలే లేవు.
🌿ఆ సమయాన శంకరులు అన్నపూర్ణాదేవిని స్తుతించగా, ఒక పండు ముత్తైదువు వచ్చి, ఆకలిగొన్నట్లున్నారు, మా అథిత్యాన్ని స్వీకరించమని కోరగా,
🌸పంచభక్షపరమాన్నాలతో కూడిన షడ్రసోపేతమైన వంటల్ని వడ్డించేసరికి, శంకరులు ఆమెను అన్నపూర్ణగా గుర్తించి, అక్కడే కొలువౌమని స్తుతించి, ప్రార్థించారు.న్ఆమె కరుణించి అక్కడే బంగారు ప్రతిమై వెలసింది. ఆ ప్రదేశమే నేటి హోరనాడు.
🌸 హోరనాడు ఆలయంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు పూర్వీకుల కథనం ఆదిశక్త్యాత్మక .
🌿శ్రీ అన్నపూర్ణేశ్వరిగా కొలువబడే అమ్మవారి ఐదు అడుగుల విగ్రహం నాలుగు చేతులతో, ప్రసన్నవదనంతో అమృతమయమైన చూపులతో ముగ్ధమనోహరంగా ఉంటుంది.
🌸పీఠంపై దేవి గాయత్రితో, శంఖుచక్రాలతో ధరించి.. పద్మపీఠం అష్టగజ, కూర్మాలను కలిగి ఉంటుంది. ఇక వరద హస్తంలో అన్నపాత్ర, అభయహస్తంలో వడ్డించే గరిటె ఉంటాయి.
🌿ఎంతసేపు చూసినా తనివితీరని సౌందర్యంతో అలరారే అమ్మవారిని దర్శించేందుకు అన్ని ప్రాంతాల భక్తులు తరలివస్తుంటారు.
🌸ఏకకాలంలో 400 మంది అమ్మవారిని దర్శించేందుకు వీలుగా ఆలయంలో తీర్థమండపం ఉంది. ఈ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి ప్రతిరోజూ త్రికాల పూజలు జరుగుతుంటాయి.
🌸మంగళ, శుక్రవారాల్లోనూ.. నవరాత్రుల సమయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
🌿కార్తీకమాసంలో నవమి రోజున, హనుమజ్జయంతి, పంచమి, శ్రవణం తదితర శుభదినాల్లో అమ్మవారికి రోజంతా దీపోత్సవాలను చేస్తారు.
🌸ఈ సందర్బంగా పువ్వులతో అర్చించి.. వివిధ రకాల కూరగాయలు, పళ్లు, కొబ్బరికాయలు, అన్నప్రసాదాలతో అమ్మవారికి నివేదన చేస్తారు.
🌿ప్రతి సంవత్సరంలో మే నెలలో హోరనాడు ఆలయంలో రథోత్సవం కన్నులపండువగా జరుగుతుంటుంది. ఇక్కడ ఐదు రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
🌸హోరనాడు ఆలయ ప్రత్యేకత ఏంటంటే.. అమ్మవారి దర్శనానికి వెళ్లే పురుషులంతా చొక్కాలను తీసివేసి శాస్త్రోక్తంగా ఉత్తరీయాన్ని కప్పుకుని దర్శనానికి వెళ్ళాల్లి ఉంటుంది.
🌿అమ్మ అనుగ్రహానికై వచ్చిన భక్తులు.. అన్న ప్రసాదాలను ప్రత్యేక అనుగ్రహ ప్రసాదంగా భావించి తృప్తిగా స్వీకరిస్తుంటారు.
🌸హోరనాడు ఆలయ దర్శనంవల్ల, భక్తుల మనోభీష్టాలు నెరవేరి.. వారి జీవితంలో తిండికి లోటు లేకుండా ఉండేలా అన్నపూర్ణేశ్వరి అమ్మవారు కటాక్షిస్తారు.
🌿శాపగ్రస్తుడైన శంకరుడిని తన కృపా కటాక్షలతో అనుగ్రహించి శాపవిమోచనం కలిగించిన ఈ అమ్మవారిని దర్శించినంతటనే.. జీవితంలో కష్టాలు తొలగి శాశ్వతానందం సొంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం... స్వస్తి
No comments:
Post a Comment