....!!
🌸🌿సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని
స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.
🌸🌿పరాశక్తి ‘సప్తమాతృకలు’గా అవతరించిది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.
🌸1.బ్రాహ్మణి: ఈ మాతృమూర్తి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షరమాల, కమండలం ధరించిన శక్తి.
🌿2.మహేశ్వరి: శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.
🌸3.కౌమారి: కుమారస్వామి శక్తి.
శక్తి (బల్లెం) హస్త, మయూర వాహనారూఢ.
🌿4.వైష్ణవి: విష్ణుశక్తి. శ్రీమాహావిష్ణువువలె గరుడవాహనాన్ని అధిరోహించి, చేతులలో శంఖచక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.
🌸5.వారాహి: హరి అవతారమైన యజ్ఞవరాహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.
🌿6.చాముండి: శక్తి దేవి, త్రిశూలం, ఖడ్గాన్ని ఆయుధంగా కలిగి, గుడ్లగూబ లేదా శవాన్ని అధిరోహించిన యోగిని, మాత.
🌸7.ఐంద్రీ: ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.
🌸🌿 – ఇవీ సప్తమాతృకలు. అంటే సర్వదేవతలు అమ్మ రూపాలే. జగదంబ రాక్షససంహారం చేస్తుండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయి.
🌸🌿సప్తమాతృకల ఆవిర్భావం🌿🌸
🌸బ్రాహ్మణి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతలను సప్త మాతృకలు అంటారు. దేవీ, బ్రహ్మవైవర్త, విష్ణుధర్మోత్తర మరియు స్కంద పురాణాలు సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి.
🌿పూర్వం జగన్మాత రాక్షసులతో పోరాడుతున్న సమయంలో రాక్షసుల మాయవల్ల తిరిగి అవిర్భవిస్తూ వస్తున్న రాక్షసుల సంహారం కోసం దేవతలు వారి లోని అమ్మవారి శక్తి రూపాలను అమ్మవారికి సహాయంగా యుద్ధానికి పంపుతారు.
🌿ఏ శక్తి రూపం ఏ దేవత నుండి అవిర్భవించిందో చూద్దాం:
🌸బ్రహ్మ పంపిన బ్రాహ్మణి హంస వాహనంపై,
🌿విష్ణుమూర్తి పంపిన వైష్ణవి గరుడ వాహనంపై,
🌸కుమార స్వామి పంపిన కౌమారీ నెమలి వాహనంపై,
🌿వరాహమూర్తి పంపిన వారాహి మహిష వాహనంపై,
🌸ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ఐరావతంపై,
🌿యముడు పంపిన చాముండి శవ వాహనంపై యుద్ధభూమికి చేరుకున్నాయి.
🌹🌿సప్తమాతృకల వాహనాలు🌿🌹
🌸బ్రాహ్మణి వాహనంగా 'హంస' .. మహేశ్వరి వాహనంగా 'వృషభం' .. కౌమారి వాహనంగా 'నెమలి' .. వైష్ణవి వాహనంగా 'గరుడ పక్షి' .. వారాహి వాహనంగా 'మహిషం' .. ఇంద్రాణి వాహనంగా 'ఏనుగు' .. చాముండి వాహనంగా 'శవం' కనిపిస్తాయి.
🌿ఇలా ‘సర్వంశక్తిమయం’ దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడిన జగన్మాత స్వరూపలే ఈ సప్త మాతృకలు!
🌸మనలోని మనకు తెలియకుండా ఉన్న దుర్గుణాలు, లోభం, అసూయ వంటి గుణాల నుండి మనల్ని రక్షించ మని ఆ తల్లిని ప్రార్ధించాలి, చెడు నుండి మనల్ని కాపాడమని కోరుకోవాలి, నాలోని బలం ఆ తల్లి! అనే భావన బలపడాలి.ఆ భావనే భక్తి.
🌿ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరాన్నే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి...స్వస్తి.
No comments:
Post a Comment