ఈ రోజు 16వ మహర్షి ఔర్వ మహర్షి గురించి తెలుసుకుందాము.
🌿ఔర్వ మహర్షి తండ్రి పేరు అప్రవానుడు . తల్లి పేరు ఋచి , ఆయన ఎలా పుట్టారో తెలుసుకుందాం .
🌸హైహయ వంశంలో వాడయిన , కార్తవీర్యార్జునిడి తండ్రి కృతవీర్యుడు అనే మహారాజు యజ్ఞాలు చేసి భార్గవ వంశంలో గొప్పగొప్ప బ్రాహ్మణులని పిలిచి వాళ్ళకి గురుదక్షిణగా తన సంపదలన్నీ ఇచ్చేశాడు .
🌿 కానీ , కృతవీర్యుడి పిల్లలు మాత్రం బ్రాహ్మణులే మోసం చేసి వాళ్ళ తండ్రి నుంచి సంపదలన్ని తీసేసుకున్నారని నిందించారు .
🌸ఇదీ హైహయులకీ , ఆర్య బ్రాహ్మణులకూ మధ్య వైరానికి మూలకారణం . కృతవీర్యుడి కొడుకులు భార్గవవంశ బ్రాహ్మణుల్ని , వాళ్ళ భార్యల్ని ,
🌿 పిల్లల్ని వెతికి వెతికి చంపడం మొదలు పెట్టారు . వాళ్ళల్లో ఋచి కూడ ఉంది . ఋచి గర్భంతో ఉందని కూడా చూడకుండా తరుముతూ వచ్చారు .
🌸 ఆవిడ పరుగెత్తలేక ఒకచోట కూర్చుండిపోయింది . ఆ సమయంలో ఋచి గొప్ప తేజస్సు కల్గిన కొడుకుని ప్రసవించింది . అతడు పుట్టగానే తేజస్సుకి ఋచిని తరుముకుంటూ వచ్చిన రాజు
🌿 కొడుకులంతా గ్రుడ్డివాళ్ళయిపోయారు . ఋచికి పుట్టిన ఆ పిల్లవాడే ఔర్వుడు . మన ఔర్వ మహర్షి ఎలా పుట్టాడో తెలిసిందిగా .
🌸కృతవీర్యుడు కొడుకులు ఋచి కాళ్ళమీద పడి , అమ్మా ! మమ్మల్ని క్షమించు . బుద్ధిలేక ఇలాంటి పని చేశాము . ధర్మంగా లేని పన్లు చేస్తే ఇలాగే జరుగుతుందని తెలిసికూడ తప్పు చేశాము , క్షమించమన్నారు .
🌿 ఋచి నాయనలారా ! ఇందులో నేను చేసింది ఏమీ లేదు . ఇప్పుడే పుట్టిన ఈ భార్గవ వంశ కులానికి దీపం లాంటి ఈ పిల్లాడే చేసి ఉంటాడు .
🌸 ఇతడు గర్భంలోంచి బయటికి రాకుండానే వేదవేదాంగాలను నేర్చుకున్నాడు . తపస్సంపన్నుడు , సర్వశక్తి సంపన్నుడు . ఈ పిల్లవాడే మిమ్మల్ని శపించి ఉంటాడని అంది .
🌿 కొడుకు ఔర్వుడితో “ నాయనా !
తెలియక తప్పు చేశారు . వాళ్ళని క్షమించి వాళ్ళకి కళ్ళు కనిపించేలా ” చెయ్యమని చెప్పింది .
🌸 తల్లి అలా కోరిన వెంటనే రాజకుమారులకు పోయిన కళ్ళు తిరిగి వచ్చాయి . రాజకుమారులు ఔర్వుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు .
🌿 ఔర్వుడు కొంత పెద్దవాడయ్యాక , తన తండ్రితో సహా తమ బంధువులు అందరూ రాజుల వలన చనిపోయారని కోపంతో తపస్సు మొదలుపెట్టాడు
🌸 అతని తపస్సుకి అందరూ భయపడిపోయారు . పితృదేవతలు భూలోకానికి వచ్చి నాయనా ! నీ తపోబలానికి లోకాలన్నీ భయపడుతున్నాయి . మమ్మల్ని రాజకుమారులు చంపలేదు .
🌿మాకు ధనాశకూడ లేదు . ఉంటే మాకు కుబేరుడే స్వయంగా వచ్చి ఇచ్చేవాడు . మా తపస్సు వల్ల మాకు ఆయుష్షుకూడ ఎక్కువగానే ఉంది .
🌸మాకు మనుష్యలోకంలో ఉండటం ఇష్టం లేదు . చచ్చిపోతే గాని స్వర్గానికి వెళ్ళలేం . ఆత్మహత్య చేసుకుంటే పుణ్యలోకం రాదు .
🌿ఇవన్నీ ఆలోచించుకుని పైహయవంశ రాజులతో శతృత్వం పెంచుకుని మాకు మేమే వారి వల్ల చచ్చిపోయాం . నువ్వు కోపం విడిచి పెట్టు .
🌸 దీనివల్ల లోకానికి చెడుచేసిన వాడివవుతావు అని చెప్పారు .
ఆ ఔర్వుడు పితృదేవతలకు సాష్టాంగ నమస్కారం చేసి మీరు చెప్పినట్లే చేస్తాను .
🌿కాని నా కోపాన్ని ఉపసంహరిస్తే అది నన్నే దహించేస్తుంది కదా ... ఏం చెయ్యమంటారు ... ? అని అడిగాడు . నీ కోపాన్ని నీళ్ళల్లో విడిచిపెట్టు .
🌸 ఎందుకంటే నీళ్ళకి నీ కోపాగ్నిని తట్టుకునే శక్తి ఉందని చెప్పి ఔర్వ మహర్షిని దీవించి వెళ్ళి పోయారు పితృదేవతలు .
🌿 ఔర్వుడి కోపాగ్నిని " ఔర్వాగ్ని " అంటారు . ఔర్వ మహర్షి బ్రహ్మచర్యం తీసుకుని మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు . ఈయన చేసే తపస్సుకి మళ్ళీ లోకాలన్ని గడగడలాడాయి .
🌸 మహర్షులు , దేవతలు , రాక్షసులు , అందరూ వచ్చేశారు కుమారా ! ఇంత చిన్నతనంలో బ్రహ్మచర్యం తీసుకుని ఇంత తపస్సు చేస్తున్నావు . నువ్వు పెళ్ళి చేసుకోకపోతే భార్గవకులం నాశనమయిపోతుంది .
🌿 నువ్వు వెంటనే పెళ్ళిచేసుకో అన్నారు . ఔర్వ మహర్షి చిరునవ్వు నవ్వి వేదాధ్యయనం , యజ్ఞం , సంతానం పొందడం ఇవన్నీ గృహస్థులకు ఉండవలసిన ధర్మాలు .
🌸నేను అడవిలో ఉండేవాణ్ణి , నాది వానప్రస్థ ధర్మం . అంటే ఉపవాసం , గాలి నీళ్ళు భోజనంగా తీసుకోవడం నా ధర్మం . బ్రహ్మచర్యం వల్ల బ్రహ్మగతి వస్తుంది .
🌿బ్రహ్మదేవుడు బ్రహ్మచారి అయినా మానసపుత్రులు ఉన్నారు కదా ! పిల్లల్ని కనడమే ముఖ్యమనుకుంటే నేను కూడ పెళ్ళి కాకుండానే
🌸పిల్లల్ని చూపించమంటారా ? చూడండి అని అగ్ని హోత్రంలో తన కాలు పెట్టి ఒక దర్భతో రాశాడు .
🌿అతని కాలు నుంచి అగ్నిహోత్రుడే కొడుకుగా బయటికి వచ్చాడు .
అతడు అంతకంతకి పెరిగిపోతుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఔర్వ మహర్షీ ! నీ కొడుక్కి ఉండటానికి చోటు ,
🌸ఆహారము నేను ఇస్తాను . అతన్ని నాకు విడిచి పెట్టు అన్నాడు . ఈ అగ్ని కూడ సముద్రంలో ఉన్న ఔర్వాగ్నితో కలిసి ప్రళయ సమయంలో నీరుగా మారిపోతుంది అన్నాడు .
🌿 బ్రహ్మదేవుణ్ణి మీ ఇష్ట ప్రకారమే జరగనియ్యండి అన్నాడు ఔర్వ మహర్షి ఆ కొడుకు రూపంలో ఉన్న అగ్ని సముద్రంలో కలిసిపోయింది .
🌸అందరూ వెళ్ళిపోయారు . హిరణ్యకశిపుడు మాత్రం ఆగిపోయి ఔర్వ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు . ఔర్వుడు హిరణ్యకశపా ! నీకు ' విద్యమాని ' అనే విద్యను ఇచ్చాను తీసుకోమన్నాడు .
🌿అదే రాక్షసమాయ అంటే . ఈ విద్య నీ వంశంలో వాళ్ళకే ఉంటుంది అని చెప్పాడు . ఒకసారి ఔర్వ మహర్షి బ్రహ్మచర్య వ్రతంలో ఉండే ఒక కూతుర్ని కూడా పొందాడు .
🌸' కందని ' అని ఆమెకు పేరు పెట్టాడు . ' కందని ' ఎంత అందంగా ఉంటుందో అంత కఠినంగా మాట్లాడుతుంది . కందని ' పెరిగి పెద్దయ్యాక దూర్వాస మహర్షి గురించి విని దుర్వాసుడితో పెళ్ళి చెయ్యమని తండ్రిని కోరింది .
🌿 ఔర్వుడు “ కందని " ని తీసుకుని దుర్వాస మహర్షిని కలవాలని బయలు దేరాడు . “ కందని ” అందం వల్ల కలిగిన తేజస్సుతోను , ఔర్వ మహర్షి తపశ్శక్తితో వచ్చిన తేజస్సుతోనూ వాళ్ళిద్దరూ కలిసి వెడుతుంటే ఆ దారంతా కాంతితో నిండిపోయింది .
🌸ఔర్వ మహర్షి దుర్వాస మహర్షిని కలిసి " కందని " ని ఆయనకిచ్చి పెళ్ళి చెయ్యాలని అనుకుంటున్నట్లు చెప్పాడు .
🌿దుర్వాసుడు అందుకు ఒప్పుకున్నాక ఇద్దరికి పెళ్ళి చేయించి ఔర్వ మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు . చాలాకాలం కందని దుర్వాసులు కలిసి ఉన్నారు .
🌸 ఒకనాడు కందని కటువైన మాటలు భరించలేక దుర్వాసుడు కందనిని కోపంగా చూశాడు . తపశ్శక్తితో ఉన్న ఆ చూపుకి కందని భస్మమయిపోయింది . అది తెలిసి ఔర్వుడు అవమానాలతో బాధపడే మనిషిగా పుట్టమని శపించాడు దుర్వాసుణ్ణి .
🌿అయోధ్యానగరాన్ని పాలిస్తున్న బాహురాజు తన రాజ్యాన్ని పోగొట్టుకుని గర్భవతియైన భార్యను తీసుకొని ఔర్వ మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు .
🌸సవతి పెట్టిన విషం వల్ల రాజు భార్యకి ఏడు సంవత్సరాలయినా కొడుకు పుట్టలేదు . కాని , రాజు పెద్దవాడవడం వల్ల చనిపోయాడు .
🌿రాజు భార్య కూడా సతీసహగమనం చేస్తుంటే ఔర్వ మహర్షి రాజు భార్యని ఆమె కడుపులో వున్న పిల్లాడు గొప్ప చక్రవర్తి అవుతాడని సహగమనం చెయ్యద్దని చెప్పాడు .
🌸రాజు భార్య పరమేశ్వరుణ్ణి తల్చుకుంటూ కాలం గడుపుతోంది . ఒకనాడు ఆమెకి కోడుకు పుట్టాడు . విషంతో కూడ బయటికి వచ్చిన ఆ పిల్లాడికి ఔర్వ మహర్షి సగరుడు
అని పేరు పెట్టి అక్కడే పెంచుతూ ఉన్నాడు .
🌿అతనికి ఉపనయనం చేసి వేద విద్యలు , శాస్త్ర విద్యలు మొదలయిన అన్ని విద్యలు నేర్పించాడు . ఒకనాడు సగరుడు తల్లితో అమ్మా ! మన రాజ్యం ఏమయింది ? మనం అడవుల్లో ఎందుకు ఉన్నాం ? అని అడిగాడు .
🌸 తల్లి జరిగినదంతా కొడుక్కి చెప్పింది . సగరుడు గురువుగారి దగ్గర తల్లి దగ్గర అనుమతి తీసుకుని శత్రువుల్ని జయించివస్తానని బయలుదేరి హైహయ వంశ రాజులందర్ని జయించాడు .
🌿సగరుడికి భయపడి శక , యవన , కాంభోజ , పారప్లవ దేశాల రాజులు వసిష్ఠ మహర్షిని శరణు వేడారు . వసిష్ఠుడు సగరుడికి నచ్చచెప్పి వాళ్ళ రాజ్యాలు వాళ్లకి ఇప్పించాడు .
🌸తర్వాత సగరుడు అయోధ్యా నగరానికి వచ్చి పట్టాభిషేకం అయ్యాక పెళ్ళి చేసుకున్నాడు . అతని భార్యలు సుమతి , సుకేశి . కాని సగరుడికి పిల్లలు పుట్టలేదు .
🌿సగరుడు భార్యలను తీసుకుని ఔర్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి గురువుగారికి పరిచర్యలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు .
🌸ఒకనాడు ఔర్వ మహర్షి సగరుడి భార్యల్ని పిలిచి వంశాన్ని ఉద్ధరించే కొడుకు ఒకడు కావాలా ? సామాన్యమైన అరవై వేలమంది కొడుకులు కావాలా ? అని అడిగాడు .
🌿సుకేశి ఒక్క కొడుకు చాలంది . సుమతి అరవై వేల కొడుకులు కావాలని అడిగింది . ఔర్వ మహర్షి వాళ్ళడిగినట్లే అనుగ్రహించాడు . గురువుగారి ఆశీర్వాదంతో సగరుడికి అరవైవేల ఒక్క కొడుకులు పుట్టారు.
🌸సగరుడు చాలా కాలం రాజ్యం చేశాడు . ఒకనాడు గురువుగార్ని విష్ణువుని పూజిస్తే ఏం ఫలితం పొందచ్చని గురువుగార్ని అడిగాడు .
🌿 ఔర్వుడు సగరుడితో రాజా ! వర్ణాశ్రమ ధర్మాల్ని శ్రద్ధ , భక్తితో నిర్వహించే వాళ్ళంటే విష్ణుమూర్తికి ఇష్టం . ఇతరుల ధనాన్ని ఆశించకుండా , జీవహింస చెయ్యకుండా , సాధువుల్ని తిట్టకుండా , అహంకారం లేకుండా ,
🌸గురుభక్తి కలిగి బ్రాహ్మణులని సేవించి , అన్ని జీవుల్లోనూ భగవంతుడున్నాడని తెలుసుకుని ఎవరి వృత్తిని వాళ్ళు చేసే వాళ్ళంటే విష్ణుమూర్తికి చాలా యిష్టం .
🌿అలాంటి వాళ్ళకి విష్ణుమూర్తి ఏమడిగితే అది ఇచ్చేస్తాడు అని చెప్పాడు ఔర్వ మహర్షి గురువర్యా ! గృహస్థ ధర్మాల్ని గురించి చెప్పండన్నాడు సగరుడు .
🌸ఔర్వుడు రాజా ! గృహస్థు ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఇహలోకంలోనూ , పరలోకంలోనూ కూడా సుఖంగా ఉంటారు .
🌿రాజా ! గృహస్థు బ్రహ్మ ముహూర్తంలో లేచి గురువుని స్మరించి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి తెల్లని మడిబట్ట కట్టుకుని సంధ్యావందనం
🌸ధ్యావందనం చేసుకుని సూర్యనమస్కారం ఇష్టదేవుడి పూజచేసి అతిథుల్ని ఆదరించాలి . రోజూ చెయ్యవలసిన పనులు చేసుకుంటూ వేద శాస్త్ర ప్రసంగాలతోనూ ,
🌿ధర్మకార్యాల గురించీ మాట్లాడుకుంటూ పగటి సమయాన్ని గడపాలి.
🌸సాయంకాలం సంధ్యా సమయంలో చెయ్యాల్సిన పనులు పూర్తిచేసుకుని భోజనం చేసి తాంబూలం వేసుకుని తూర్పుకు గానీ , దక్షిణానికి గానీ తల పెట్టుకుని నిద్రపోవాలి .

🌿ఇలా చేస్తూ ఉంటే గృహస్థుకి పుణ్యలోకాలు కలుగుతాయని ఇంకా శ్రాద్ధకర్మల గురించి కూడ సగరుడికి చెప్పాడు ఔర్వ మహర్షి .
🌸నీతిగా ధర్మంగా దయగా పద్ధతిగా గురుభక్తి దేవుని యందు భక్తి అన్నీ వున్నవాడు సాధించలేనిది ఏమీ లేదు అని ఆ మహర్షి అనేక విషయాలు తెలిపాడు.
🌿ఔర్వునికి తెలియని విషయాలు లేవు.అతడు మేధావి అస్థలిత బ్రహ్మచారి.తపోనిధి.ఉపకారి.
అటువంటి మహర్షి చరిత్ర నిజంగా చాలా గొప్పది.

No comments:
Post a Comment