21వ మహర్షి కామందక మహర్షి గురించి తెలుసుకుందాము.
🌿కామందక మహర్షి గొప్ప తపస్సు చేసి ధర్మశాస్త్రాలన్నీ చదివేశాడు .
వేదవిద్యలు నేర్చుకున్నాడు .
🌸 ఆయనకి ధర్మతత్వజ్ఞడు , నీతిశాస్త్రజ్ఞుడు అని మంచి పేరుంది . కామందక మహర్షికి అంగరిష్ఠుడు అనే రాజు శిష్యుడుగా ఉండేవాడు .
🌿ఆ రాజు నాలుగు రకాలయిన పురుషార్ధాల గురించి అంటే ధర్మం , అర్ధం , కామం , మోక్షం గురించి తెలుసుకుందుకే కామందక మహర్షికి శిష్యుడయ్యాడు .
🌸 మనం కూడ కొన్ని విషయాలు అర్ధం చేసుకోగలమేమో చూద్దాం .
🌿ఇంక కొంతమందికి చెప్పి చేయించాలి . మనం చెయ్యాలి ... అందుకే చదివి తెలుసుకుందాం . ఏదయినా మనకి తెలిస్తే కదా చెప్పగలుగుతాం .
🌸 ఒకసారి అంగరిష్ఠుడు “ మహాత్మా ! కామమోహాలు కలిగిన రాజు పాపాలు చేస్తే దానికి విరుగడు ఏమయినా ఉందా ?
🌿 ఏఏ మంచి పనులు చేస్తే చేసిన పాపాలు పోతాయి ? తెలియకుండా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం ఏమిటి ?
🌸 ఇలా నాకు చాల అనుమానాలున్నాయి మీరే సమాధానం చెప్పాలి అనడిగాడు కామందక మహర్షిని .
🌿కామందక మహర్షి చెప్పడం మొదలు పెట్టాడు . రాజా ! ధర్మార్ధకామాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి . అర్ధమునకు మూలం ధర్మం , ఫలం , కామం వీటికి సంకల్పం కారణం .
🌸ఇక్కడ అర్ధం అంటే ధనం అనీ ధనాన్ని ధర్మంగా సంపాదించాలనీ , ధర్మకార్యాలు చేసినప్పుడు ఫలితాన్ని ఆశించకూడదనీ , సంపాదించిన ధనాన్ని ధర్మకార్యాలకే ఖర్చు పెట్టాలని చెప్పాడు .
🌿 ఇంకా ఇలా చెప్పాడు . రాజు అనే వాడు వేదాల్ని , బ్రాహ్మణుల్ని , ధర్మాన్ని పూజించాలి .
🌸' క్షమ ' అంటే ఓర్పు కలిగి ఉండాలి . సత్యాన్ని ఆరాధించాలి . ఎప్పుడూ రాజ్యంలో శాంతిని నెలకొల్పాలి .
🌿 గురువు చెప్పిన దానిమీద నమ్మకం ఉండాలి . గురువు ఏం చెప్పినా వాదించకుండా వినాలి .
🌸రాజా ! ' కామందక నీతిశాస్త్రము ' అనే గ్రంథంలో ముప్పయి ఆరు ప్రకరణలతో ఇరవై సర్గలతో ఈ విషయాలన్నీ రాసి ఉన్నాయి .
🌿ఆ గ్రంధాన్ని చదవడం వల్ల ఇంకా తెలుసుకునేందుకు వీలవుతుంది అన్నాడు కామందక మహర్షి . ఇంకా ఇలా చెప్పాడు .
🌸 రాజు ఎప్పుడూ ప్రజలని సంతోషపెడ్తూ ఉండాలి . రాజ్యము అంటే ఏడు అవయవాలు కలది . అవి ఏమిటంటే
🌿 1. స్వామి అంటే రాజు .
2. మంత్రి
3 . రాష్ట్రము
4. బలం
5. దుర్గం
6. మిత్రులు
7. కోశాగారం అంటే ధనం దాచేది బ్యాంకు లాంటిది అన్నమాట .
🌸ధనం ధర్మమార్గంలో సంపాదించి మంచి పనులకే ఖర్చు చెయ్యాలి . మంచి నడవడిక ఉన్నటువంటి రాజు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు .
🌿 రాజు పంచేద్రియాల్ని వశంలో ఉంచుకుని వినయంగా ఉండాలి . శబ్ద రూప , స్పర్శ రస గంధ అనేటువంటివి అయిదూ ఇంద్రియాలు చేసే పనులే
ఇవి నాశనానికి సహాయపడతాయి .
🌸 శాఖాహారి అయిన జంతువు కూడ శబ్ద మాధుర్యం వల్ల నాశనమయిపోతుంది .
🌿పర్వతమంత ఉన్న ఏనుగు కూడా ఆడ ఏనుగు స్పర్శ వల్ల చెడిపోతుంది .
దీపం యొక్క రూపాన్ని చూసి మిడత చచ్చిపోతుంది ,
🌸గాలానికి కట్టిన మాంసపు ముక్కకి ఆశపడి చేప వలలో పడి చచ్చిపోతుంది .
🌿గంధం వాసన కోసం తుమ్మెదలు ఏనుగుల మీద
వాలి వాటి చెవుల దెబ్బలతో నశించిపోతాయి .
🌸ఏ ఒక్కటయినా ప్రమాదమే అయినప్పుడు , మనిషికి అన్నీ కలిసి ఎంత ప్రమాదమో ఆలోచించు అన్నాడు కామందక మహర్షి .
🌿రాజా ! రాజు ఎప్పుడూ వేట , జూదము , పానము తప్పకుండా విడిచిపెట్టాలి .
🌸 వీటికి బానిసలైన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళయినా పాండురాజు , నలమహారాజు , యాదవులయిన సాంబాదులు ఎలా నాశనమయ్యారో నీకు తెలుసుకదా ! రాజా !
🌿కామము , క్రోథము , మోహము , మదము , మాత్సర్యము కలిగిన వాళ్ళు ఎంతమందో నాశనమయిపోయారు . విద్యతోపాటు వినయం , న్యాయం , ధర్మం మొదలయిన మంచి లక్షణాలు కలిగిన రాజు మేలిమి బంగారంలా రాణిస్తాడు .
🌸కామందక మహర్షి ' కామందకనీతిశాస్త్రం ' అనే గ్రంథాన్ని రాశాడు . దాన్లో ప్రజల్ని పరిపాలించేవాడు ఎలా ఉండాలి అనేది చాలా బాగా వివరించాడు .
🌿 అప్పుడయితే రాజులుండేవారు . కాని ఇప్పుడు పరిపాలన మారిపోయింది కదా .... ప్రజల్ని పరిపాలించేవాడు మహారాజు అయినా , ముఖ్యమంత్రి అయినా , ప్రధానమంత్రి అయినా , రాష్ట్రపతి అయినా పాలన అన్నది ఒకే విధంగా ఉంటుంది .
🌸కాబట్టి ఈ కామందక నీతిశాస్త్రం అప్పటి రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడ చక్కగా ఉపయోగపడుతుంది . మనం తిన్నాక మిగిలింది ధర్మకార్యాలకే ఉపయోగించాలి ...
🌿 స్వస్తి...

No comments:
Post a Comment