22వ మహర్షి కపిల మహర్షి చరిత్ర తెలుసుకుందాము..
🌸కపిల మహర్షి ఎవరో తెలుసా? సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే!! ఇప్పుడు మనం ఆయన కథలోకి వద్దాం.
🌿పూర్వం అంటే కృతయుగంలో కర్దమ ప్రజాపతి అనే ఆయన సరస్వతీనదీ తీరంలో పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు.
🌸 విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకు దేవహూతి అనే భార్యయందు తొమ్మిది మంది కూతుళ్ళు, నా అంశతో ఒక కొడుకు పుడతారని చెప్పాడు.
🌿కొంతకాలానికి కర్దమ ప్రజాపతికి తొమ్మిది మంది కూతుళ్లు పుట్టారు.
కర్దమ ప్రజాపతి భార్య దేవహూతిని పిలిచి నేను తపస్సు చేసుకుందుకు వెడుతున్నానని చెప్పాడు.
🌸అప్పుడు దేవహూతి స్వామీ! ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వంశం ఉద్ధరించడానికి ఒక కొడుకుని ప్రసాదించి తరువాత తపస్సు చేసుకుందుకు వెళ్ళండి అంది. విష్ణుమూర్తే నీకు కొడుకుగా పుడతాడు.
🌿 కాబట్టి, నువ్వు విష్ణుమూర్తిని ప్రార్థించు అని భార్యకి చెప్పాడు. దేవహూతి కూడ భర్త చెప్పినట్లే భగవంతుణ్ణి ప్రార్థించింది.
🌸కొన్నాళ్ళకి ఆమెకి ఒక కొడుకు పుట్టాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు, కిన్నెరలు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. బ్రహ్మదేవుడు, గొప్పగొప్ప మునులు అందరూ వచ్చి
🌿ఆ పిల్లాడిని చూసి కర్దమ ప్రజాపతికి దేవహూతికి ఆ పిల్లవాడు విష్ణుమూర్తి అవతారమేననీ, అతడు కపిల మహర్షిగా ప్రసిద్ధి కెక్కుతాడనీ చెప్పి మరీచి అనే ఒక మునిని అక్కడ ఉంచి తిరిగి వెళ్ళిపోయారు.
🌸కొంతకాలమయ్యాక ప్రజాపతి తన కూతుళ్లకి మహర్షులతో పెళ్ళిళ్ళు జరిపించాడు. ఒకనాడు కపిల మహర్షిని పిలిచి మహాత్మా ! భగవంతుడవైనా నువ్వు నా యింట్లో నాకు కొడుకుగా పుట్టావు.
🌿నాకు ఇంతకన్న భాగ్యం మేముంటుంది? ఇంక నేను తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు.
🌸 “నేను ఈ మునివేషంలో పుట్టింది నాకోసం కాదు మునులందరికి భగవంతుడి గురించి తెలియచెప్పడానికే" అన్నాడు.
🌿నువ్వు కూడ నా మీదే దృష్టిపెట్టి తపస్సు చేసుకో, మోక్షం వస్తుంది వెళ్ళిరా... అని తండ్రి కర్దమ ప్రజాపతిని పంపించాడు.
🌸దేవహూతి కొడుకుని రక్షించమని వేడుకుంటుంది. కపిల మహర్షి నీ మనస్సు సంసారం మీద పెట్టకుండా భగవంతుడి మీద పెట్టమని సాంఖ్య యోగం, భక్తి యోగం ఉపదేశం చేశాడు. దేవహూతి మోక్షం పొందిన చోటుని 'సిద్దిప్రద' అంటారు.
🌿కపిల మహర్షి ఒకసారి గోవుని అది వేదస్వరూపం అని తెలిసినా కూడా నిర్లక్ష్యంగా దాన్ని చూశాడు. సూర్యరశ్మి అనే ఒక ముని కపిల మహర్షికి వేదాలంటే అసలు ఏ భావం ఉందో తెలుసుకుందామని
🌸ఆవులో ప్రవేశించాడు. కపిలుడి ముందుకు వచ్చి వేదాలంటే చాలా గొప్పవంటారు కదా ! నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు.
🌿కపిలుడు నాకు వేదాల మీద సదభిప్రాయం లేదు అన్నాడు. భగవంతుణ్ణి మనస్సులో ప్రతిష్టించి, వాక్కుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, బ్రాహ్మణులు మాత్రం వేదోక్తంగా వాళ్ళ కర్మలని వాళ్ళు చెయ్యాలి.
🌸 వేదపాఠకులు, వేదజ్ఞులు అవ్వాలి. అంటే వూరికే వేదాలు చదవడం కాదు, ఆచరించాలని చెప్పాడు. సూర్యరశ్మి కపిల మహర్షికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
🌿పుండరీక మహారాజు వేటాడుతూ దాహం వేసి కపిల మహర్షి ఆశ్రమంలో వున్న ఒక సరస్సులో మంచి నీళ్ళు త్రాగి, అక్కడ పరుగులు పెడుతున్న లేడిని చూసి దాన్ని చంపాడు.
🌸అది పరిగెత్తుతూ వెళ్ళి కపిల మహర్షి ముందు ప్రాణాలు వదిలింది. అది చూసి కపిలమహర్షి ఆ పుండరీకుణ్ణి మందలించాడు. నీ విలాసం కోసం నోరులేని జంతువును చంపావు.
🌿నీ శరీరం మీద నీకెంత ప్రేమ ఉందో దానికి కూడా దాని శరీరం మీద అంత
ప్రేమ ఉండదా ? అని మందలించాడు. పుండరీకుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో ఆత్మహత్య చేసుకోబోయాడు.
🌸 కపిల మహర్షి పుండరీకుణ్ణి ఆపి ఆత్మహత్మ మహాపాపమనీ, సంపదలు క్షణికమేననీ, పరులను హింసించడం పాపమనీ, గురువాజ్ఞతో గురువు చెప్పిన ప్రకారం నడుచుకోవాలనీ, అప్పుడే మోక్షం కలుగుతుందనీ చెప్పాడు.
🌿పుండరీకుడు తన రాజ్యం, సంపదలూ వదిలేసి కపిల మహర్షిని, తనని శిష్యుడిగా చేసుకోమన్నా కపిల మహర్షి మాట్లాడలేదు.
🌸పుండరీకుడు నీళ్లల్లో కూర్చుని ఆ పదమూడు రోజులు కపిల మహర్షిని గురించే తపస్సు చేశాడు. పధ్నాలుగో రోజు కపిలుడు పుండరీకుడికి కర్మ, భక్తి, వైరాగ్యం, జ్ఞానం మొదలయిన నాలుగు యోగాల గురించి బోధించాడు.
🌿 పుండరీకుడు కపిల మహర్షి చెప్పిన విధంగా చేసి మోక్షాన్ని పొందాడు.
ఒకసారి సగర చక్రవర్తి ఎన్నో అశ్వమేధయాగాలు చేసి ఇంకా ఆశ తీరక మళ్ళీ ఇంకొక యాగం మొదలుపెట్టాడు.
🌸ఇంద్రుడికి అసూయ కలిగి ఆ గుఱ్ఱాన్ని నాగలోకం తీసుకువెళ్ళి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేసి వెళ్ళిపోయాడు.
🌿సగరుడి కొడుకులు అరవై వేలమంది ఆ గుఱ్ఱం కోసం వెతుకుతూ వచ్చి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర తమ గుఱ్ఱాన్ని చూశారు.
🌸వాళ్ళు కపిల మహర్షి తమ గుఱ్ఱాన్ని అక్కడ కట్టేసుకున్నాడని అనుకున్నారు. కపిల మహర్షిని చంపుదామనుకున్నారు.
🌿కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. అంతే అరవై వేలమంది భస్మం అయిపోయారు.
🌸అప్పుడు సగరుడి మనవడు అంశుమంతుడు గుఱ్ఱాన్ని వెతుకుతూ వచ్చి కపిల మహర్షికి నమస్కారం చేసి గుఱ్ఱాన్ని ఇమ్మని ప్రార్థించాడు.
🌿కపిలుడు తీసుకుపోయి మీ తాత యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు. అంశుమంతుడు గుఱ్ఱాన్ని తాతకి ఇచ్చి యాగం పూర్తి చేయించాడు.
🌸 కొంతకాలం తర్వాత భగీరధుడు గంగాజలాన్ని భూమిమీదకు తెచ్చినప్పుడు ఆ నీళ్ళు తగిలి సగరుడి కొడుకులు అరవైవేల మంది మళ్ళీ బ్రతికారు.
🌿పూర్వం అశ్వశిరుడు అనే మహారాజు యాగాలు చేస్తూ బ్రాహ్మణులకి దానధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు కపిల మహర్షి జైగీషవ్య మునిని తీసుకుని అశ్వశిరుడి దగ్గరకి వెళ్ళాడు.
🌸అశ్వశిరుడు కపిల మహర్షికి నమస్కారం చేసి స్వామీ! నేను విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి? అని అడిగాడు.
🌿కపిల మహర్షి రాజా ! నేనే విష్ణుమూర్తిని అన్నాడు. దానికి రాజు విష్ణుమూర్తి అంటే ఇలా ఉండడు గదా? శంఖం, చక్రం, గరుడవాహనం ఉంటాయి కదా.
🌸 నువ్వే విష్ణుమూర్తివని నాకు నమ్మకం లేదు అన్నాడు. కపిల మహర్షి విష్ణుమూర్తి రూపంతో, జైగీషవ్య ముని గరుడవాహనంగా కనిపించారు.
🌿 మళ్ళీ రాజు అనుమానంతో విష్ణుమూర్తి బ్రహ్మమనస్సులోంచి పుట్టినవాడు కదా! బ్రహ్మ నాభిలోంచి పద్మంతో పాటు పుడతాడు కదా! మరి నువ్వు అలాలేవేం? అన్నాడు.
🌸కపిల మహర్షి రాజుకి కావలసినట్లే కనిపించాడు. రాజు ఇంకా నమ్మకుండ ఇదంతా మోసం అనుకుంటాడు.
🌿అప్పుడు సభలో ఆశీనులైన వారంతా మాయమయిపోయి క్రూరజంతువుల్తో సభ నిండిపోయింది.
🌸అప్పుడు రాజు భయపడి కపిల మహర్షిని ప్రార్ధించాడు.
కపిల మహర్షి రాజుకి కనపడి రాజా ! నువ్వు విష్ణుభక్తుడవే కాని, విష్ణువు లోకం అంతా నిండిపోయి ఉన్నాడు అని అర్ధం చేసుకోలేక పోతున్నావు.
🌿 ఇంక అది తెలుసుకుని నీ కులానికి తగిన ధర్మాలు, వేదవిహితాచారాలు చేస్తూ విష్ణుమూర్తిని ధ్యానిస్తే నీకు మోక్షం వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు.
🌸కపిల మహర్షి సాంఖ్యయోగాన్ని గురించి బోధించాడు. దీన్ని 'కపిలస్మృతి' అని కూడ అంటారు. దీంట్లో ఆయుష్షు క్షణికమని, సుఖదఃఖాలు కాలాన్ని బట్టి వస్తూ పోతూఉంటాయని ఆత్మ అంటే నారాయణుడే అని,
🌿 అత్మని తెలుసుకుని మోక్షం పొందాలని చెప్పాడు. వేద, శాస్త్ర పురాణాల్లో ఉన్నంత జ్ఞానం
🌸కపిల మహర్షి భక్తియోగాన్ని గురించి కూడ చెప్పాడు. ఎప్పుడూ హింసతో కూడిఉన్న పన్లేచేస్తూ, ఈర్ష్య, అసూయ లాంటి చెడ్డ గుణాలు ఉండి భగవంతుడంటే భక్తి ఉన్నవాణ్ణి తామస భక్తుడు అంటారు.
🌿 అన్ని రకాలయిన సుఖాలు అనుభవిస్తూ భక్తి కలిగి ఉండేవాణ్ణి రాజస భక్తుడు అంటారు. ఇతరుల కోసం భక్తుడయ్యేవాణ్ణి సాత్విక భక్తుడు అంటారు.
🌸అసలైన భక్తుడు భగవంతుడి గురించి వింటే చాలు భక్తితో పరవశించిపోతాడు. అతడే అసలయిన భక్తుడు, పరమ భక్తుడు అని చెప్పాడు.
🌿కపిల మహర్షి ఒకసారి పశ్చిమ సముద్రతీరంలో పద్మాసనం వేసుకుని, కళ్ళుమూసుకొని ధ్యానంలో ఉన్నాడు.
🌸 రావణాసురుడు ఈశ్వరుడి వల్ల వరం పొంది బలవంతుల్ని అందర్నీ చంపేద్దామని తిరుగుతూ కపిల మహర్షిని చూశాడు.
🌿 రావణుడి కంటికి కపిల మహర్షి చేతుల్లో ఆయుధాలతో వక్షస్థలం మీద లక్ష్మీదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, ధాత, విధాత, రుద్రులు అందరూ కలిసి కనిపిస్తున్నారు.
🌸రావణుడు ఇందంతా ఋషులమాయేలే అనుకుని కపిల మహర్షిని కొట్టాడు. వేంటనే కపిల మహర్షి కూడ రావణుడ్ని ఒక దెబ్బ వెయ్యగానే రావణుడు మూర్ఛపోయాడు.
కపిలుడు గుహలోకి వెళ్ళిపోయాడు.
🌿రావణుడు తెలివొచ్చి మళ్ళీ గుహలోకి వెళ్ళాడు. కపిల మహర్షిని చూసి మహాత్మా! మీరెవరు? అని అడిగాడు. కపిల మహర్షి నోరు తెరవగానే రావణుడు విష్ణుమూర్తి విశ్వరూపం చూసి మహాత్మా ! మీ చేతిలో చచ్చిపోవడంకంటే నాకింకేం కావాలి? అనుగ్రహించండి
🌸అని కళ్ళు మూసుకున్నాడు. కపిల మహర్షి ఆ గుహలో మాయమైపోయాడు. కపిల మహర్షి చరిత్రలో ఇలాంటి కథలు అనేకం వున్నాయి!
🌿కపిల మహర్షి చెప్పిన సాంఖ్య యోగం, భక్తియోగం, ఇప్పటికి మనకి అందుబాటులో ఉన్నాయి. అవి చదివి ఆచరించి ముక్తిని పొందవచ్చు. మనం కూడ విష్ణుమూర్తి విశ్వరూపాన్ని చూడవచ్చు.
🌸చూశారా ! మనలాంటి అజ్ఞానుల్ని ఉద్ధరించడానికి మనిషి రూపంలో పుట్టి, తపస్సు చేసుకుంటున్న ఎంతోమంది మునులకి జ్ఞానబోధ చేసి, ఎంతోమంది మహాత్ముల్ని మనకోసం
🌿ఈ భూలోకంలోకి పంపి, మనకి ధర్మంగా ఎలా బ్రతకాలో కపిల మహర్షి రూపంలో సాక్షాత్తు విష్ణుమూర్తే బోధించాడు.
స్వస్తి..

No comments:
Post a Comment