70వ విశ్వామిత్ర మహర్షి గురించి తెలుసుకుందాం
🌸ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహర్షి విశ్వామిత్రుడు.భృగువంశం వాడయిన ఋచీక మహర్షి గాధిరాజుని అతని కూతురు సత్యవతినిచ్చి పెళ్ళి చేయ్యమన్నాడు.గాధిరాజు తెల్లటి రంగుతో, నీలం రంగు చెవులున్న గుర్రాల్ని తెస్తే చేస్తాన్నాడు.
🌿ఇదంతా మీరు ఋచీక మహర్షి కథలో తెలుసుకున్నారు కదా. ఋచీక మహర్షి భార్య సత్యవతికి, ఆమె తల్లికి పిల్లల కోసం బ్రాహ్మ రాజమంత్రాల్లో రెండు పాత్రలిస్తే ఇద్దరూ మార్చుకుంటారూ... గుర్తొచ్చిందా... అలా విశ్వామిత్రుడు గాధిరాజుకు పుట్టాడు.
🌸విశ్వామిత్రుడు చిన్నప్పటినుండి రాజభోగాలతో అల్లారు ముద్దుగా పెరుగుతూ కృశాశ్వుడి దగ్గర అనేక అస్త్రశస్త్రాల ప్రయోగాల్ని గురించి తెలుసుకుని గొప్ప విలుకాడయ్యాడు . కొంతకాలం తర్వాత విశ్వామిత్రుడి తండ్రి గాధిరాజు చనిపోయాక విశ్వామిత్రుడు కన్యాకుబ్దానికి రాజయి ధర్మసతంగా ప్రజారంజకంగా పాలించాడు.
🌿కొన్నివేల సంవత్సరాలు రాజ్యం చేశాక ఒకనాడు సైన్య సమేతంగా అడవికి వేటకోసం వెళ్ళి బాగా అలసిపోయి దగ్గర్లో వున్న వసిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. విశ్వామిత్రుణ్ణి గౌరవించి అతడికి అతని సైన్యానికి కూడ అతిథి మర్యాదలు చేసి అందరికీ భోజనం పెట్టాడు వసిష్ఠుడు.
🌸అంతమందికి వసిష్ఠుడు భోజనం పెట్టగలిగాడు అంటే దానికి కారణం అతని దగ్గరున్న కామధేనువే అని తెలుసుకుని దాన్ని తనకిమ్మని అడిగాడు విశ్వామిత్రుడు. వసిష్ఠుడు అందుకు ఇష్టపడలేదు.
🌿విశ్వామిత్రుడు బలవంతంగా కామధేనువుని తీసుకుని వెళ్ళిపోతుంటే అది వసిష్ఠుడికేసి దీనంగా చూసింది. అప్పుడు వసిష్ఠుడు అతని దగ్గర సైన్యముంది, నాకు నువ్వు తప్ప ఏముంది? నిన్ను నువ్వు రక్షించుకోవడానికి అనుమతిస్తున్నానన్నాడు.
🌸వెంటనే కామధేనువులోంచి వేలవేల సైనికులు పుట్టి విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేశాయి. దీన్ని భరించలేక విశ్వామిత్రుడు రాజ్యం వేరేవాళ్లకిచ్చి హిమాలయాలకెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.
🌿శివుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడికి కావలసిన అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉపదేశించాడు. విశ్వామిత్రుడు మళ్ళీ వసిష్ఠుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. వసిష్ఠుడి మీద ఎన్ని శస్త్రాస్త్రాలు వేసినా అవి పని చేయ్యలేదు.
🌸చివరికి బ్రహ్మస్త్రం వేశాడు. వసిష్ఠుడు దాన్ని మింగేసి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోయాడు. బ్రహ్మత్వం ముందు క్షత్రియ బలం పనికి రాదని బ్రహ్మత్వం పొందాలని నిర్ణయించుకుని తపస్సు ప్రారంభించాడు విశ్వామిత్రుడు.
🌿బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షిత్వం ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఇక్ష్వాకువంశం రాజయిన త్రిశంకుడు వసిష్ఠుడి శాపం వల్ల స్వర్గానికి వెళ్ళడానికి లేక విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు యాగం చేసి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపాడు.
🌸కాని ఇంద్రుడు అతడ్ని స్వర్గంలో ఉండడానికి అర్హుడు కాదని తలక్రిందులుగా తోయించాడు. అది చూసిన విశ్వామిత్రుడు అతని కోసం వేరే స్వర్గాన్ని సృష్టించాడు దాన్నే 'త్రిశంకు స్వర్గం ' అంటారు.
🌿అది విశ్వామిత్ర సృష్టి! ఒకసారి అంబరీషుడు యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు యజ్ఞ పశువుని దాచేశాడు. మునులు నరపశువయినా ఫర్వాలేదన్నారు.
🌸అంబరీషుడు లక్ష అవుల్ని తీసుకుని ఎవరైనా తన యజ్ఞానికి పశువుగా వస్తాడేమో అని అడుగుతుండగా ఋచీకుడు తన కొడుకు శునశ్శేఫుడ్ని పంపాడు. శునశ్శేఫుడు పారిపోయి విశ్వామిత్రుడ్ని రక్షించమని శరణు కోరాడు.
🌿విశ్వామిత్రుడు శునశ్శేఫుడికి రెండు మంత్రాలు చెప్పి పంపాడు. బలిపశువుగా బలి ఇచ్చే సమయానికి ఆ రెండు మంత్రాలు శునశ్శేఫుడు పలకగానే ఇంద్రాది దేవతలూ వచ్చి అతడికి దీర్ఘాయుషు, అంబరీషుడికి యాగఫలం ఇచ్చి వెళ్ళిపోయారు.
🌸విశ్వామిత్రుడు ఏమయినా సరే ఋషిత్వం, మహర్షిత్వం, బ్రహ్మర్షిత్వం పొందాలనుకున్నాడు. వెంటనే పుష్కర నదీ తీరానికి వెళ్ళి వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి రాజర్షి అయ్యాడు.
🌿హిమాలయ ప్రాంతానికి వెళ్ళి వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడితో మహర్షిత్వాన్ని పొంది విశ్వామిత్ర మహర్షయ్యాడు. అక్కడి నుంచి తూర్పు దిక్కుకి వెళ్ళి చాలా సంవత్సరాలు కదలకుండా తపస్సు చేశాడు.
🌸ఆ ప్రదేశాన్ని 'సిద్ధాశ్రమo' అంటారు. ఇంక ఆయన తపస్సు తీవ్రతకి తట్టుకోలేక బ్రహ్మగారు విశ్వామిత్రుడికి బ్రహ్మర్షిత్వం, దీర్ఘాయుషు, బ్రహ్మతేజం ఇచ్చేశాడు. విశ్వామిత్రుడికి మాత్రం వసిష్ఠుడు ఒప్పుకుంటేనే కాని తాను బ్రహ్మర్షి కాదని అనుకుని వసిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు.
🌿ఏమయ్యా 'ఋషీ' ! రా ! అన్నాడు వసిష్ఠుడు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చాడు . వసిష్ఠుడు ఏమయ్యా 'రాజరీ' ! అన్నాడు.విశ్వామిత్రుడు వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చాడు. వసిష్ఠుడు ఏమయ్యా 'బ్రహ్మరీ' ! అన్నాడు.
🌸ఎంతో ఆనందంతో వసిష్ఠుడ్ని పూజించాడు విశ్వామిత్రుడు . వాళ్ళిద్దరూ స్నేహితులయిపోయారు . ఒకసారి ఇంద్రుడు సభలో అందర్నీ అసలు అబద్ధం చెప్పనివాడున్నాడా ? అనడిగాడు. అందరూ హరిశ్చంద్రుడున్నాడన్నారు.
🌿కానీ విశ్వామిత్రుడు ఏమయినా సరే హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పించాలని చూశాడు.
🌸ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ అబద్ధం చెప్పలేదు హరిశ్చంద్రుడు. చివరికి విశ్వామిత్రుడే అతడి సత్యధర్మానికి మెచ్చుకుని వరాలిచ్చాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి హింసలు పెడుతుంటే విశ్వేదేవతలు అడ్డుపడ్డారు.
🌸వాళ్ళని భూలోకంలో పుట్టమని శపించాడు విశ్వామిత్రుడు. వాళ్ళే ద్రౌపదికి పుట్టిన ఉపపాండవులు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే తాటక, మారీచ, సుబాహులనే రాక్షసులు అడ్డుపడ్డారు.
🌿దశరధుడి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుల్ని పంపించమని అడిగాడు విశ్వామిత్రుడు. దశరధుడు ఇష్టపడలేదు. దశరధుడికి రాముడంటే విష్ణుమూర్తెనని నచ్చ చెప్పి రామలక్ష్మణులతో రాక్షసుల్ని చంపించాడు.
🌸శ్రీరామ పాదస్మర్శతో అహల్యా శాప విమోచనం చేయించి, మిథిలకి తీసికెళ్ళి శివధనుర్భంగం చేయించి శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల పెళ్ళి జరిపించి చిన్నప్పటి నుంచే శ్రీరామలక్షణులు కారణజన్ములని లోకానికి తెలియడానికి కారణమయ్యాడు విశ్వామిత్రుడు.
🌿'విశ్వామిత్ర స్మృతి' అనే గ్రంథాన్ని తొమ్మిది అధ్యాయాల్లో శ్లోక రూపంలో రాశాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు పట్టుదలతో బ్రహ్మర్షి పదవి పొంది, బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేసి, చండశాసనుడు అని పేరు తెచ్చుకుని , కౌశిక మహర్షి అనే పేరుతో సప్తర్షి గణంలో చేరాడు.
🌸విశ్వామిత్రుడు దయతలిస్తే గడ్డిపోచనైన గొప్ప పర్వతం చేయగలడు, కోపం వస్తే మాత్రం గొప్ప పర్వతాన్ని కూడా గడ్డిపోచ చెయ్యగలడు. త్రిశంకుడికి స్వర్గాన్ని , శునశ్శేఫుడికి దీర్ఘాయుషుని ఇచ్చాడు.
🌿కోపం వున్నది వసిష్ఠుడి మీద, కష్టాలు పెట్టింది సత్యహరిశ్చంద్రుణ్ణి. సత్యవ్రత దీక్ష ప్రాధాన్యతని లోకానికి చాటి చెప్పడం కోసం!! ఇదీ విశ్వామిత్రుడి కథ !!
స్వస్తి.

No comments:
Post a Comment