THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, October 5, 2022
శ్రీవారి బ్రహ్మోత్సవాలు 8వ రోజు రాత్రి : అశ్వవాహనం
💠 బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవనాటిరాత్రి వేంకటేశ్వరస్వామి ఒక్కడే శిరస్త్రాణాన్ని ధరించి, ఖడ్గం చేతపట్టి యుద్ధ వీరునివలె కనిపిస్తూ అశ్వవాహనంపై ఊరేగుతాడు.
💠వేగానికి అశ్వం ప్రతీక. అనాదిగా అశ్వంవాహనంగా వుంది. ప్రయాణాలకే గాక రథాలకు అశ్వాలను కట్టి నడిపేవారు. చతురంగబలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వం. అమృతం కొరకు రాక్షసులు దేవతలు పాలసముద్రాన్ని చిలికినపుడు పాలసముద్రంనుండి ఉచ్ఛైఃశ్రవం అను పేరు గల అశ్వరాజం పుట్టింది.
💠 విష్ణుదేవుని అవతారాలు పది ప్రసిద్ధమైనవి గలవు. వాటిలో చివరి అవతారం కల్కిఅవతారం. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కిరూపం ధరించి, ఖడ్గం చేతబూని అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారం, శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు బోధిస్తున్నాయి.
💠 కలియుగాంతంలో వేంకటేశ్వరస్వామి అశ్వవాహనం మీద కల్కిరూపంలో వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే అశ్వవాహనం యొక్క ప్రయోజనం.
పద్మావతీ శ్రీనివాసులు తొలిచూపుల వేళలో వేంకటేశ్వరుడు అశ్వ వాహనారూఢుడైయున్నాడు.
💠 విష్ణుదేవుని మరొక అవతారం హయగ్రీవుడు అశ్వముఖుడు. కఠోపనిషత్తు మానవ ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణించింది. కనుక గుర్రం నెక్కి ఊరేగుతున్న వేంకటేశ్వరుడు ఇంద్రియ నియామకులమై సాగించాలని వేంకటేశ్వరస్వామి అశ్వవాహనం ద్వారా హితం ఉపదేశిస్తున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment