Adsense

Tuesday, October 4, 2022

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 8వ రోజు ఉదయం : రథోత్సవం

  

💠 శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవమైనది, భక్తి జనాకర్షకమైనది రథోత్సవం.
ఎనిమిదవ రోజు ఉదయం, ఉదయ సూర్యుని కిరణకాంతులలో మేరుపర్వతం వంటి రథంలో ఇరువైపులా శ్రీదేవీ భూదేవులు సేవిస్తుండగా మధ్యలో మలయప్పస్వామి వేంచేసి యుండగా భక్తజనులందరు గోవింద నామస్మరణ చేస్తూ రథంపగ్గాలను లాగుతుండగా తిరుమల నాలుగుమాడ వీధులలో నెమ్మదిగా రథోత్సవం జరుగుతుంది.

💠ఈ ఉత్సవం భక్తులు తేరుపగ్గాలను పట్టుకొని రథాన్ని లాగుతూ స్వయంగా పాల్గొనడం ఈ రథోత్సవం ప్రత్యేకత.
ఇతర వాహన ఊరేగింపులలో భక్తులు ప్రేక్షకులు మాత్రమే. స్వయంగా పాల్గొనే అవకాశం లేదు. రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొనడం వల్లనే ఉత్సవం అత్యంత వైభవంగా, కోలాహలంగా వుంటుంది.

💠“రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే”. రథంలో వేంచేసియున్న విష్ణుదేవుని దర్శనం జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది అనే విశ్వాసంతో భక్తులందరు రథోత్సవంలో స్వయంగా పాల్గొంటారు.


💠 ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్" -3-34

💠శరీరం రథం. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెము. ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియవిషయాలు అవి పరుగులు తీసేమార్గాలు. ఆత్మ (అంతర్యామిగా వున్న భగవదంశ) రథికుడు.
గుర్రాలవంటి ఇంద్రియాలను మనస్సు అనెడి కళ్ళెంతో అదుపుచేసి, రథంవంటి శరీరాన్ని మీ బుద్ధియను సారధి ద్వారా చక్కని మార్గంలో నడిపించి రథికుడైన ఆత్మను నన్ను - గుర్తించి, సేవించి, తరించండని హితబోధ చేస్తున్నాడు వేంకటేశ్వరస్వామి.

No comments: