Adsense

Tuesday, October 4, 2022

"సాలకట్ల బ్రహ్మోత్సవాలు"లో సాలకట్ల అంటే ఏంటి అర్థం?



💠 ఇది మహంతుల కాలంలో ఏర్పడిన నామం.
మహంతులు ఉత్తర భారతీయులు.
"సాల్" అంటే హిందీ లో సంవత్సరం.
ఈ పదం "సాలుకు" ,'సాలీనా" వంటి పదాల లో సమానార్ధకం గా వాడబడుతూ మనకు కనిపిస్తుంది.
కట్ల అనేది కట్టడి అనే దానినుంచి వచ్చినదిగా కొందరి భావన.
సాల్ కట్ల అంటే సంవత్సరంలో సంప్రదాయంగా పాటించబతున్న అని మనం అనుకోవచ్చు .

💠 ఒక‌ప్పుడు బ్ర‌హ్మోత్స‌వాలు ఏడాదికి పొడ‌వునా... నెల‌కి ఒక‌సారి చొప్పున జ‌రిగేవ‌ట‌. ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక‌సారే... అది కూడా ద‌స‌రా సమ‌యంలో జ‌రుగుతున్నాయి.
ఈ బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో తిరుమ‌ల మాడ‌వీధుల‌లో వేర్వేరు ర‌థాల మీద తిరిగే స్వామిని ద‌ర్శించుకునేందుకు ఎక్క‌డెక్క‌డి నుంచో భ‌క్తులు వ‌స్తారు.
ర‌థోత్స‌వంలో ఉన్న స్వామిని క‌నుక చూస్తే, త‌మ క‌ష్టాల‌న్నీ తీరిపోయి అంతులేని అనుగ్ర‌హం ద‌క్కుతుంద‌ని న‌మ్ముతారు.


💠 ప్రతి సంవత్సరం  కన్యారాశి లో శ్రవణా నక్షత్రం రోజున బ్రహ్మోత్సవంనే వార్షిక బ్రహ్మోత్సవం అంటారు


💠 అదే ఆశ్వయుజ మాస శ్రవణా నక్షత్రం
సమయంలో వచ్చేది అధిక మాస బ్రహ్మోత్సవం .
దీనిని నవరాత్రి బ్రహ్మోత్సవం or  సాలకట్ల బ్రహ్మోత్సవం అంటారు.


💠 అధిక మాసం ఎలా నిర్ణయం అవుతుంది అంటే సౌరమానంలో 365 రోజులకు ఒక సంవత్సరం అయితే ,చంద్రమానం లో 354 రోజులకు ఒక ఏడాది.
ఇలా వ్యత్యాసం ఉన్న పదకొండు రోజులను మూడేళ్ళు తరవాత లెక్కేస్తే ఒక నెల అధికం గా కలుస్తుంది.అప్పుడు రెండు పద్దతుల్లో రోజుల సంఖ్యా సమం అవుతుంది.ఇలా అధికంగా వచ్చే చంద్రమాన మాసాన్ని అధిక మాసం అంటారు.
ఇది 2017, 2020 లో వచ్చింది.
ఇక తదుపరి 2023 లో వస్తుంది.

💠 ఇప్పుడు రెంటి నిర్వహణలో ఏవైన తేడాలున్నాయా గమనించండి.

👉 వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ,అవరోహణ ఉంటే,నవరాత్రి ఉత్సవాల్లో ఉండవు.

👉 వార్షిక బ్రహ్మోత్సవాల్లో కోయ్యరధం రధోత్సవాల్లో వాడితే ,నవరాత్రి ఉత్సవాల్లో బంగారు రధం మాత్రమె వాడతారు.

👉 వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ వాహన సేవ తర్వాత విగ్రహాలని తిరుమలరాయ మండపం లో ఉంచి పల్లకి ఉత్సవం చేయగా, నవరాత్రి ఉత్సవాల్లో రంగ నాయకుల మండపంలో ఉంచుతారు.

No comments: