Adsense

Tuesday, October 4, 2022

మహబూబ్ నగర్ జిల్లా.. శ్రీ మైసిగండి మైసమ్మ ఆలయం




💠 తెలంగాణ రాష్ట్రంలోని, మహబూబ్ నగర్ జిల్లాలోని, ఆమనగల్లు మండలం, హైదరాబాద్ నుండి సుమారు 50 కీ.మీ. దూరంలో కర్నూలు వెళ్లే రహదారిలో మైసిగండి అనే గ్రామంలో గండి మైసమ్మ ఆలయం ఉంది.

💠 ఈ ప్రాంతంలో ఒక వేప చెట్టు క్రింద బురుజు గోడలో స్వయంభువుగా మైసమ్మ తల్లి వెలసింది.
ఈ తల్లి కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలసిందిగా పురాణాలూ చెబుతున్నాయి.
ఈ గ్రామంలోని ప్రజలు ఈ తల్లిని గ్రామ దేవతగా కొలుస్తారు. ఈ మైసమ్మ చుట్టూ పక్కల గ్రామాలలోని ప్రజలందరికి ఆరాధ్య దైవంగా పూజలందుకొనుచున్నది. భక్తుల పాలిట కొంగుబంగారమై కోరిన కోరికలు తీర్చే అమ్మగా ఈమెను కొలుస్తారు. ఈ ఆలయంలో సృష్టి స్థితి లయకారిణి అయి కాళికాదేవి స్వరూపంతో పూజలనందుకొంటుంది.


💠 మైసమ్మ విగ్రహం ప్రతిష్టించక ముందు ఇక్కడ చిన్న శిలావిగ్రహం ఉండేది. కొంతకాలం తరువాత ఒక భక్తుడు ఈ మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.
మైసిగాండి మైసామ్మ విగ్రహం సుమారు 20 అడుగుల  పొడవు, మరియు గోపురం కూడా భారీ మరియు అన్ని  దక్షిణ భారత దేవాలయాల నుండి భిన్నంగా ఉంటుంది
ఇది ఎగువన తెరిచి ఉంటుంది.
ఆలయం యొక్క ప్రధాన
దేవత ఆలయం పైభాగంలో తెరిచి ఉండాల్సిన అవసరం ఉందని పురాణ కథనం .

💠 మైసమ్మ దేవాలయానికి కొంత దూరంలో శివాలయం, రామాలయం, అన్నపూర్ణేశ్వరి దేవాలయాలు ఉన్నాయి.
ఈ ప్రాచీన దేవాలయాలను గోల్కొండను పాలించిన తానిషా వద్ద మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాధన్నలు నిర్మించినట్లుగా చెబుతారు.
అయితే ఈ ఆలయాలకు ఎదురుగా ఒక గండి (కోనేరు) ఉంది. ఈ గుడికి ఎదురుగా మైసమ్మ ఉన్నందున ఈ ప్రాంతానికి మైసిగండి అనే పేరు స్థిరపడింది.

💠 ప్రతి ఆదివారం, గురువారాలలో వేల సంఖ్యలో భక్తులు ఈ మైసమ్మను దర్శిస్తుంటారు. అన్నివర్గాల ప్రజలచే నిత్యం పూజలు అందుకుంటూ ఈ దేవత మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే జాతరకు భక్తులు విశేషంగా వస్తారు.

💠 ముఖ్యంగా బోనలు మరియు "జాతర"
సమయంలో పండుగలగా ఉంటుంది .
ప్రజలు తమ కోరికలు నెరవేర్చిన తరువాత "బోనం" (దేవతకు ఆహార
ప్రసాదాలు) అందిస్తారు.


💠 ఇక్కడ ఉన్న ఆలయాల్లో నిత్యపూజలతోపాటు,విశేష పూజలు జరుగుతున్నాయి.
ఇక్కడ అమ్మవారికి దసరా నవరాత్రలు, శివాలయంలో శివరాత్రికిబ్రహ్మోత్సవాలు, రామాలయంలో శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు గొప్పగా జరుగుతాయి.


💠 మైసమ్మను అర్చించినవారు సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లుతారనే గొప్ప నమ్మకం ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఉంది.

No comments: