Adsense

Tuesday, October 4, 2022

శృంగేరీ శారదా పీఠం...





🌸కర్నాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం శృంగేరి. చాలా కాలం క్రితం ఇక్కడ ఒక పాము ప్రసవించే కప్పకు తన పడగను నీడ ఇవ్వడం జరిగింది.

🌿జాతి వైర్యం కలిగిన కప్ప, పాము ఈ విధంగా ఉండటం చూసిన సద్గురువు ఆది శంకరాచార్యులు ఇంతటి మహత్తు కలిగిన ఈ ప్రాంతంలో తాను నిర్మించదలిచిన నాలుగు మఠాల్లో మెదటి మఠంను నిర్మిస్తాడు.అదే శృంగేరి శారదా పీఠం.

🌸దీంతో ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఎటువంటి శత్రువులైన మిత్రులుగా మారుతారని భక్తులు విశ్వసిస్తారు. ఇద్దరూ కలిసి లేదా విడివిడిగా ఈ క్షేత్రాన్ని సందర్శించవచ్చు.

🌿ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆలయం శ్రీ ఆంజనేయ దేవాలయం. పడమటి కనుమల్లో మల్నాడు ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలతో ఆకర్షించే పవిత్ర శృంగేరిలో ఇది కలదు.

🌸ఇక దేశం మొత్తం మీద ఆది శంకరాచార్యులు ఇక్కడ మాత్రమే ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించారు. కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూర్ జిల్లాలో తుంగ నది ఒడ్డున శృంగేరిఉంది.

🌿విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

🌸ఈ ఋష్యశృంగుడు రోమపాదుడు పాలిస్తున్న అంగరాజ్యములో అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామము నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు.

🌿అంతేకాకుండా ఈ ప్రాంతం ఎప్పుడూ వర్షాలతో సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. ఇక ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి, కంచి, ద్వారకలో మరో మూడు మఠాలను స్థాపించారు.

🌸ఇవి ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ఇక ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో శృంగేరి శారద మఠం మెదటిది. దీనినే దక్షిణామ్నాయ మఠంగా చెబుతారు. హిందూ సనాతన ధర్మాలను ఈ పీఠాలు పరిరక్షిస్తూ ప్రచారం చేస్తుంటాయి.

🌿మరోవైపు దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ శృంగేరి శారద మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు.

🌸ఆయన సన్యాస్యాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది. 1782 నుంచి 1799 వరకూ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరీ శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది.

🌿శారదాదేవి జ్ఞానానికి , విజ్ఞాన సర్వస్వానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు నెలకొల్పారని చెబుతారు. ఉన్నదని చెబుతారు. మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని స్థలపురాణం.

🌸మెదట ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14 వ శతాబ్దములో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి మరియు బంగార విగ్రహ ప్రతిష్ఠ చేసారని చరిత్ర బట్టి తెలుస్తోంది.

🌿ఆలయ పరిసరాలు 20 వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడింది. అగ్నిప్రమాదము జరగడంతో పాత దేవాలయపు స్థానములో కొత్తదేవాలయము నిర్మించారు.
జీర్ణోద్ధారణ జరిగిన ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగింది.

🌸శారదా శృంగేరి మఠానికి పదవ పీఠాధిపతైన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత పీఠాధిపతి భారతి కృష్ణ తీర్థుల ఆధ్వర్యంలో 1357-58 మిగిలిన నిర్మాణం జరిగింది.

🌿విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్క రాయలకు గురువు. ఈ ఆలయం నిర్మాణం హొయసల శైలిలో జరిగింది. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు.

🌸స్వామికి ఇరుప్రక్కల వినాయకుడు, అమ్మవారు ఉంటారు. ఈ దేవాలయం లోపలి మండపంలోని స్థంబాలపై 12 రాశులు చెక్కి ఉంటాయి. ఆలయ నిర్మాణం, గవాక్షాల ఏర్పాటు (కిటికీ ఏర్పాటు) సూర్య కిరణాలు నెలల ప్రకారం ఆయా రాశుల మీద పడేటట్లు చేయబడింది.

🌿ఇంకో విశేషం ఏమంటే మండపంలోని స్తంభాలపై ఉన్న గుండ్రపు రాళ్ళు గోళాకారంగా సింహపు నోటి నుండి బయటకు జారునట్లుగా చెక్కారు. ఇవి సింహం నోటిలో ఉన్నట్లు ఉంటాయి కాని గోళం అంచులు సింహం నోటికి తగిలి తగలనట్లు ఉండి జారిపడతాయి అనిపించేటట్లుగా అత్యద్భుతంగా చెక్కారు.

🌸శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉంది. తుంగ నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం, దాని ప్రక్కన ఆ ఆలయానికి అనుసంధానం ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి.

🌿ఇక్కడి పూజా మూర్తులకు అవసరమైన జలాలన్ని ఇక్కడ నుండే తెస్తారు. తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు..స్వస్తి.

No comments: