THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Friday, October 7, 2022
శక్తి – భక్త్తి -ముక్తి – లక్ష్మీదేవి కనుబొమల కదలికలలోనే సకల సృష్టి..!!
🌿పరమాత్మగా చెప్పబడే శ్రీమన్నారాయణునికి అన్ని వేళలా అన్ని కార్యాలను సమకూర్చేది శక్తియే. ఈ జగత్తునంతా ఆమెయే రక్షిస్తుంది.
🌸అంటే చూస్తుంది. కటాక్షిస్తుంది. లక్ష్యంగా చేసుకుంటుంది కనుక ‘లక్ష్మి’ అయింది. శ్రీమహావిష్ణువు భావమును ఆశ్రయిస్తుంది కనుక శ్రీ అని వ్యవహరిస్తారు.
🌿ఆమెను పద్మ, పద్మమాలినీ అంటారు. అందరికీ కోరికలను ప్రసాదిస్తుంది కనుక ‘కమల’ అయింది. శ్రీమహావిష్ణువు సామర్థ్యరూపంగా ఉండటం వలన విష్ణుశక్తిగా పేర్కొనబడుతుంది.
🌸‘యత్ భ్రూ భజ్గా: ప్రమాణం స్థిరచర రచనా తాతరమ్యే మురారే’….అని శ్రీ పరాశర భట్టర్‌వారు ఉద్భోధించారు. అంటే పరమాత్మ చేసే సృష్టిలో కొన్ని స్థావరములు. కొన్ని జంగమములు. కొన్ని కదలనివి. కొన్ని కదిలేవి.
🌿అందరినీ సృష్టించువాడు పరమాత్మయే అయినపుడు ఈ సృష్టిలో ఈ తారతమ్యాలెందుకు? అన్న సందేహం సహజం. స్వామి సృష్టిలో తారతమ్యం అంతా అమ్మవారి(లక్ష్మీదేవి) కనుబొమల కదలికలలో కలదట.
🌸 కనుబొమలు ఎగురవేసినట్లయితే దేవతులగాను, కొంత తక్కువగా ఎగురవేస్తే మానవులుగాను, కిందకి చేసినట్లయితే దానవులుగాను, అసలే కదల్చకుంటే పశువులుగాను సృష్టిస్తాడని భావం.
🌿జీవుల కర్మవిశేషాలనే ఆ కనుబొమల కదలలికలు తెలియజేస్తాయి. ఉత్తమ కర్మలు చేసి ఉంటే సంతోషంగా కనుబొమల నగురవేస్తుంది. తక్కువ మంచిపనులు చేసివుంటే కొద్దిగా ఎగురువేస్తుంది.
🌸పాపాలు చేసి ఉంటే కనుబొమలు వాల్చటం జరుగుతుంది. అంటే స్వామి చేసే సృష్టికార్యములో అమ్మ ఉపయోగపడుతుందని తెలుస్తోంది.
ఇక స్వామిరక్షణలో అమ్మ పురుషకార రూపం గా ఉపకరిస్తుంది.
🌿అలాగే సంహారంలో మహాకాళిగా సహకరిస్తుంది. జీవుల కర్మలను లక్ష్యంగా చేసుకొని సృష్టికార్యంలో సహకరిస్తుంది కనుక శ్రీ మహాల క్ష్మిగా చెప్పబడుతుంది. అలాగే రక్షణలో శ్రీదేవిగా పేర్కొనబడుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment