THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, October 4, 2022
శక్తి పీఠాల్లో మొదటిది శాంకరీదేవి ఆలయం..!!
రావణ స్తుతి సంతుష్టా కృతాలంకాధివాసినీ |
సీతాపహరణరోషేణ త్యక్తలంకామహేశ్వరీ |
సజ్జన స్తితి సంతుష్టా కదంబవన వాసినీ |
లంకాయం శాంకరీదేవి రక్షేత్ ధర్మపరాయణా ||
🌸అష్టాదశ శక్తిపీఠాల్లో శాంకరీదేవి శక్తిపీఠం మొదటిది. ఈ శక్తిపీఠం పొరుగుదేశం పురాణాల్లో సింహళద్వీపం అని పిలవబడే శ్రీలంకలో ఉండేదని పూర్వీకులు చెప్పేవారు. శాంకరీ దేవిని మహర్షులు వనశంకరి అని కూడా పలికెడి వారు.
🌿వనం అంటే నీరు, అడవి అని అర్థం వస్తుంది. శాంకరీదేవి వెలసిన లంక చుట్టూ నీరు ఉంటుంది. ఏ విధంగా చూసినా వనశాంకరీ దేవి, లంకా శక్తిపీఠసంస్థితగానే భావించాలి. ఈ తల్లి రాక్షసగుణాలను సంహరించి, ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పాలించేది.
🌸దక్షుడు యజ్ఞం చేసినపుడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులని పిలవలేదు. అయినా పార్వతీ దేవి శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది.
🌿కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.
🌸సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.
🌿సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు దర్శనమిస్తున్నాయి. అలా వెలసిందే శాంకరీదేవి శక్తిపీఠం. మహావిష్ణువు పార్వతి శరీరాన్ని ఖండాలుగా చేసిన సమయంలో సతీదేవి ఎడమ చెవి శ్రీలంక ద్వీపంలోని తూర్పు తీరప్రాంతములో ట్రింకోమలిపురలో పడిందని చెబుతుంటారు.
🌸ఇక్కడి అమ్మవారు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అష్టాదశ శక్తి శక్తిపీఠాలలో మొదటి శక్తిపీఠం ఇదే, ఇక్కడ అమ్మవారిని శాంకరి దేవి అని కొలుస్తారు.
🌿రావణాసురుడు ప్రతి నిత్యం ఈ అమ్మవారిని పూజించేవాడని తెలుస్తోంది. అయితే ఆయన సీతను అపహరించి తెచ్చినప్పుడు శ్రీ శాంకరీ దేవి ఎంతగా హెచ్చరించినా వినిపించుకోలేదట.
🌸దాంతో ఆగ్రహించిన అమ్మవారు అక్కడ అదృశ్యమై కాశ్మీర ప్రాంతానికి తరలివెళ్లింది. అమ్మవారి ఆగమనం గురించి సంకేతాలు అందడంతో, మహర్షులు అక్కడికి చేరుకొని ఆమెను 'బస శంకరీ' పేరుతో కొలిచారు.
🌿అమ్మవారి ఆగ్రహానికి గురైన కారణంగానే రావణాసురుడు పతనమై అంతమయ్యాడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. దీంతో ఇక్కడ శాంకరీదేవి ఆలయాన్ని కట్టారని పూర్వీకుల వాదన.
🌸కాగా ప్రస్తుత కాలంలో ఈ శక్తి పీఠం శిధిలమై పోయిందని చెపుతుంటారు. ఆ ప్రాంతంలో ఒకనాడు శక్తి పీఠం ఉంది అనడానికి ఆనవాలుగా ఓ స్థంబం మాత్రమే దర్శనం ఇస్తుందని చెపుతున్నారు.
🌿దీంతో శాంకరీదేవి దర్శనం దుర్లభం అనే చెప్పుకోవాలి. శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యం అయినా, క్షేత్ర మహాత్యం, క్షేత్ర దర్శనము ఆనందదాయకమే.
🌸ఈ ఆలయం శిధిలమైపోవడానికి కారనం అలనాడు బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధి చెందడమే అని చరిత్ర చెపుతుంది. దీంతో హిందూమతానిక ఆదరణ కరువై హిందూ దేవాలయాలన్నీ శిథిలముగా మారినాయి.
🌿కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. శాంకరీదేవి మందిరం కూడా ఆ కోవలోనే కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చునని సమాచారం.
🌸ఆ కాలంలోనే శ్రీలంకలో ఉన్న తమిళులపై దాడులు హింసాత్మకమవటంతో వారు తట్టుకోలేక పారిపోయి కెనడా, భారతదేశం మొదలగు దేశములకు చేరిన హిందువుల సంఖ్య పెరిగిపోయింది..స్వస్తి....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment