Adsense

Saturday, October 1, 2022

నారద గర్వభంగము

 

ఒకానొక సమయంలో నారదమహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు, గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో, అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మ మును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతుని యందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు.

ఆ సమయంలో ఇంద్రుడు మన్మథుడిని పిలిచి ఒకమాట చెప్పాడు. ‘మన్మథా, మహా సంయముడయిన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి నారదుడు యింద్రియములకు వశుడవుతాడేమోచూడవలసినది అని చెప్పాడు. మన్మథుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు.

నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ‘ఈశ్వరా, హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను, మన్మథుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను వాటిని లెక్కపెట్టలేట్టదు. కామమును జయించి తపస్సునందు సిద్ధినిద్ధి పొందాను’ అని చెప్పాడు.

అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం. ఎంతగా మాయ కమ్మే సిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి ‘నారదా, నీవు కాముడినే జయిన్చావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు’ అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రానివిద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టనిట్ట వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు.

నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరగ్గకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు, సిద్ధినిద్ధి పొందినట్లు చెప్పా డు. అపుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మథుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకుపూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు.

నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళా డు. నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు. అపుడు నారదుడు ‘స్వామీ, నేను తపస్సు చేశాను మన్మథుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు. సిద్ధి పొందాను’ అని చెప్పా డు. అపుడు నారాయణుడు ‘ఎంత గొప్పపని చేశావయ్యా, శివుని తర్వాత మరల నీవే చేశావు’ అని మెచ్చుకున్నాడు. నారదునికి పుట్టం పెట్టి లోపల జ్ఞానము
బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపించివేశాడు. ఇపుడు మాయ ప్రారంభమయింది.

నారదుడు బయలుదేరి ఒక రాజ్యం లోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శీలనిది అనే రాజు పరిపాలిస్తున్నా డు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెనుర్తె నారదుని వద్దకుద్ద తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి, తన కుమార్తెకుర్తె ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు.

నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత  పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అన్నాడు.

అక్కడి వరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు.

వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘అయ్యా,
నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరి పోతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. ఇంతకు మునుపు మన్మథ బాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదీ మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, కోతి. హరి శరీరమును కింద వరకు ఇచ్చాడు, కోతి తలను పైన యిచ్చాడు.

వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నా డు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదుర్షలు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణచూస్తె మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతిముఖం ఇతని మేడలో ఎలా మాల వేస్తుంది అని అనుకుంటున్నారు.
పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు.

శ్రీమతిదండ పట్టుకుని దగ్గరగ్గ కు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారిచూసి భ్రుకుటిముకుళించి ఈ కోతి శిరస్సుఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళి పోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు.వరమాల తీసుకువెళ్ళి ఆయన మేడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళి పోయాడు.

అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదుర్షలు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లిచేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరిద్ద నీ మీరు రాక్షసయోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయాప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదుర్షలు నారదుని తిరిగిశపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు.

నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి“శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపముయివ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకుకాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పడిఏడిస్తే, ఈ కోతిముఖం వున్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను
శపిస్తున్నాను’ అన్నాడు.

శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకుధర్మమార్గముర్గ నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థతస్థ
కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నా డు. మాయ తొలగింది.

శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలుముక్కలుగా కత్తిరింత్తి చెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రముజాగుచెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరింత్తి చెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటిధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు.

నారదుడు కాబట్టి మరల అంత తొందరగాస్వస్థితిస్థిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూఉంటాము.పరిశీలించినట్లయిట్లతే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడుమరల ద్వాపరయుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు యివ్వమని అడిగాడు.అపుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వానిబుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు.

No comments: